సమీప బంధువులకు ఇస్లాం ఆహ్వానం

సోమ, 11/08/2021 - 18:08

దైవప్రవక్త(స.అ) మూడు సంవత్సరముల వరకు, బహిరంగంగా ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించలేదు, కేవలం ఇతడు ఇస్లాం ఆహ్వానాన్ని స్వీకరించగలడు అన్న నమ్మకం ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించేవారు...

సమీప బంధువులకు ఇస్లాం ఆహ్వానం

దైవప్రవక్త(స.అ) మూడు సంవత్సరముల వరకు, బహిరంగంగా ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించలేదు, కేవలం ఇతడు ఇస్లాం ఆహ్వానాన్ని స్వీకరించగలడు అన్న నమ్మకం ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించేవారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రజలందరిని ఆహ్వానించే చర్యను ముందుగా నీ బంధుమిత్రుల నుంచి మొదలు పెట్టు అని దైవవాణిదూత అవతరించి అల్లాహ్ ఆదేశాన్ని దైవప్రవక్తకు చేర్చాడు. అల్లాహ్ ఆదేశం ఖుర్ఆన్‌లో ఇలా ఉంది: “నీ సమీప బంధువులను హెచ్చరించు. విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో. ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే, “మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు” అని చెప్పు”[సూరయె షుఅరా, ఆయత్214-216.]
ఈ ఆహ్వానం బంధుమిత్రులతో మొదలపెట్టమని ఆదేశించబడడానికి కారణం అందరికి తెలిసిందే; ఒక నాయకుడి పట్ల బంధుమిత్రులు విధేయత చూపితే మగిలిన ప్రజలు కూడా అతడి ఆహ్వానాన్ని స్వీకరిస్తారు, ఎందుకంటే బంధుమిత్రులు ఆ నాయకుడిని దగ్గర నుంచి చూసి ఉంటారు, అతడి హావభావాలు తెలిసినవారు అయి ఉంటారు.
అల్లాహ్ ఆదేశాన్ని విన్న ప్రవక్త బనీ హాషిమ్‌కు చెందిన 45 పెద్దలను మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించి వారి కోసం మాంసం కూర మరియు పాలు సిద్ధం చేయమని అలీ(అ.స)ను ఆదేశించారు.
అతిథులందరూ చెప్పిన సమయానికి దైవప్రవక్త(స.అ) సన్నిధిలో చేరుకున్నారు. భోజనం చేసిన తరువాత దైవప్రవక్త యొక్క పిన తండ్రి అయిన “అబూ లహబ్” తన అల్పమాటలతో ఆ సభను దైవప్రవక్త(స.అ) తన ఇస్లాం సందేశాన్ని చెప్పనివ్వకుండా చేశాడు. అందురూ భోజనాల తరువాత తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దైవప్రవక్త(స.అ) ఆ మరుసటిరోజు మరలా అబూలహబ్‌ను తప్ప అందరిని పిలవాలని నిర్ణయిచుకొని మరలా ఏర్పాట్లు చేయమని అలీ(అ.స)ను ఆదేశించారు. చెప్పిన సమయానికి బనీ హాషిమ్ సమూహానికి చెందిన పెద్దలు వచ్చారు. భోజనాలు అయిన తరువాత దైవప్రవక్త(స.అ) తన ప్రచారాన్ని ఇలా మొదలు పెట్టారు: “ప్రజలలో ఎవ్వరూ ఎవ్వరీ కోసం నేను తీసుకొచ్చినంత మంచి దానిని తీసుకొని రాలేదు. నేను ఇహపరలోక ఉత్తమత్వాన్ని మీ కోసం తీసుకొచ్చాను. నా ప్రభువు మిమ్మల్ని తౌహీద్ మరియు తన ఏకత్యం మరియు నా దౌత్యం వైపు మిమ్మల్ని ఆహ్వానించమని ఆదేశించాడు. మీలో ఎవరు నాకు ఈ మార్గంలో తమ మద్దత్తును తెలిపి నా సోదరుడు మరియు నా వసీ మరియు నా ఉత్తరాధికారిగా అవ్వాలనుకుంటున్నారు?” వారు ఈ వాక్యాన్ని చెప్పి ఎవరైనా తన ఈ ప్రశ్నకు సమాధానమిస్తారేమోనని కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. అప్పుడు అక్కడ నిశ్శబ్ధం కమ్ముకుంది, అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు, అందరూ తమ తలలను వంచుకొని ఆలోచనలలో పడ్డారు.
అకస్మాత్తుగా అలీ(అ.స) [అప్పటికి అతనికి వయసు 14 సంవత్సరాలకి మించి ఉండదు] ఆ నిశ్శబ్ధాన్ని ఛేదించి నిలబడి దైవప్రవక్త(స.అ) వైపు చూసి ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్త! నేను ఈ మార్గంలో మీకు మద్దత్తుదారుడిగా ఉంటాను: ఆ తరువాత తన చేయిని దైవప్రవక్త వైపుకు ఇది మీతో నా ఒప్పందం అని చెప్పడానికి చాచారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) నువ్వు కూర్చో అని ఆదేశించారు. మరలా దైవప్రవక్త(స.అ) తన మాటను ప్రకటించారు. అప్పుడు కూడా అలీ(అ.స) యే నిలబడి తన సమ్మతాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు కూడా దైవప్రవక్త(స.అ) అలీను కూర్చోమని ఆదేశించారు. మూడవసారి ప్రకటించిన తరువాత కూడా దైవప్రవక్త పవిత్ర లక్ష్యాన్ని మద్దత్తుతెలపడానికి అలీ తప్ప మరొకరు నిలబడలేదు. అప్పుడు దైవప్రవక్త(స.అ) తన చేయిని అలీ చేయిని తట్టి చారిత్రాత్మిక వాక్యాన్ని బనీ హాషిమ్‌కు చెందిన పెద్దలతో కూడి ఉన్న ఆ సభలో అలీ గురించి ఇలా ప్రవచించారు: “ఓ నా బంధుమిత్రులారా! మీలో అలీ నా సోదరుడు, నా వసీ మరియ ఖలీఫా”[1]

రిఫరెన్స్
1. తబరీ, ముహమ్మద్ బిన్ జురైర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, భాగం2, పేజీ217. ఇబ్నె అసీర్, అల్ కామిల్ ఫీత్తారీఖ్, భాగం2, పేజీ63. ఇబ్నె అబిల్ హదీద్, నెహ్జుల్ బలాగహ్, తహ్ఖీఖ్: మొహమ్మద్ అబుల్ ఫజ్ల్ ఇబ్రాహీమ్, భాగం13, పేజీ211.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11