ఇస్లాం బహిరంగ ప్రచారం

సోమ, 11/15/2021 - 17:21

దైవప్రవక్త(స.అ) యొక్క ఇస్లాం బహిరంగ ప్రచారం తరువాత వారి పట్ల ఖురైషీయులు పన్నిన పన్నాగాలు మరియు ఎదురుకున్న కష్టాల గురించి సంక్షిప్త వివరణ...

ఇస్లాం బహిరంగ ప్రచారం

దైవప్రవక్త(స.అ) కొంత కాలం ఇస్లాం ప్రచారాన్ని గుప్తంగా కొనసాగించారు. ఆ తరువాత ముష్రిక్కుల నుంచి భయపడకుండా బహిరంగంగా ఇస్లాం ప్రచారాన్ని మొదలు పెట్టమని అల్లాహ్ ఆదేశం వచ్చింది: “(ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు. నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవటానికి మేము చాలు”[సూరయె హిజ్ర్, ఆయత్94,95]
అల్లాహ్ ఆదేశం తరువాత దైవప్రవక్త(స.అ) ఒకరోజు “అబ్‌తహ్”[1] అను ప్రదేశంలో నిలబడి ఇలా అన్నారు: “నేను అల్లాహ్ తరుపు నుంచి పంపబడిన వాడిని, మిమ్మల్ని అల్లాహ్ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మీకు లాభనష్టాలు చేకూర్చని, మిమ్మల్ని సృష్టించని, మీకు ఉపాది కలిపించని, మీకు ప్రాణాలు పోసే మరియు ప్రాణాలు తీసే శక్తిలేని విగ్రహాలను వదిలేయమని కోరుతున్నాను”[2]  
ఆరోజు నుంచి దైవప్రవక్త(స.అ) ప్రచారం కొత్త దశలో ప్రవేశించింది. సభలలో, హజ్ సమయంలో మినా ప్రదేశంలో, మక్కా చుట్టుప్రక్కల ఉన్న సమూహాలలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

ఖురైషీయుల ప్రయత్నం
బహీరంగంగా ఇస్లాం ప్రచారం ఆరంభ దశలో ఖురైషీయులు అంతగా పట్టించుకోలేదు, కాని ఎప్పుడైతే దైవప్రవక్త(స.అ) విగ్రహాలను స్పష్టంగా నిషేదించి వాటిని అజ్ఞానులు మరియు ప్రభావం లేనటువంటిగా చెప్పడం మొదలు పెట్టారో అప్పటి నుంచి దైవప్రవక్త(అ.స)ను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. మక్కాలో సమూహాల పరంపరా ఉండడం వల్ల, దైవప్రవక్త(స.అ)ను హతమారిస్తే బనీ హాషిం సమూహానికి చెందిన వారు పగ తీర్చుకోవడానికి వెనకాడరనే భయం ఉండడంతో ఖురైష్ సమూహానికి చెందిన పెద్దలు బనీహాషిం నాయకులు మరియు దైవప్రవక్త(స.అ) పినతండ్రి అయిన అబూతాలిబ్ ద్వార హజ్రత్ ముహమ్మద్(స.అ) ను తన ప్రచారాన్ని ఆపమని చెబుదాం అని నిర్ణియించుకున్నారు. వారు ఎన్నోసార్లు అబూతాలిబ్ వద్దకు వచ్చి ధనం ఆశ చూపించారు మరెన్నో రకాలుగా ప్రచారం నుంచి ఆపాలని ప్రయత్నాలు చేశారు కాని లాభం లేకపోయింది చివరికి వారు అబూతాలిబ్ మరియు దైవప్రవక్త(అ.న)ను చంపుతామని బెదిరించారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) వారికి ఇలా సమాధానమిచ్చారు: “బాబాయ్! నా కుడి చేతిలో సూర్యుడ్ని, ఎడమ చేతిలో చంద్రుడ్ని పెట్టినా, నేను నా ప్రచారాన్ని ఆపను; అల్లాహ్ దాన్ని విజవంతం చేయనంత వరకు లేదా నేను ఈ మార్గంలో చనిపోనంత వరకు”[3]
ఖురైషీయుల బెదిరింపులకు ప్రతి చర్యగా అబూతాలిబ్, దైవప్రవక్త(స.అ) వెనక తను మరియు బనీ హాషింకు సమూహానికి చెందినవారందరూ ఉన్నారని, ఒకవేళ ముహమ్మద్(స.అ)కు హాని జరిగితే దానికి ప్రతికారంగా వారందరిని వదిలి పెట్టమని బెదిరించారు. దాంతో ఖురైషీయులు వెనక్కి తగ్గారు. బనీహాషింకు చెందిన వారందరిలో కేవలం “అబూలహబ్” శత్రువుల వరుసలో ఉండిపోయాడు.
చివరికి ఖురైషీయులు దైవప్రవక్తను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రతీ సమూహం నుంచి ఒక యువకుడు చొప్పున 40 యువకులు ఈ పనికి సిద్ధమయ్యారు. ఖురైషీయులు వారి ఈ పన్నాగం అమలు పరచడానికి రబీవుల్ అవ్వల్ మాసం యొక్క మొదటి రాత్రిని ఎంచుకున్నారు. అల్లాహ్ వారి పన్నాగాలను దైవప్రవక్తకు దైవవాణి ద్వార తెలియపరిచాడు[4]
దైవప్రవక్తకు మక్కాను విడిచి యస్రబ్‌కు బయలుదేరారు. మూడు రోజుల వరకు ప్రవక్త ముహమ్మద్(స.అ) గారె సూర్ గుహలో ఉండి ఆ తరువాత 4వ రోజు మదీనహ్ వైపు బయలుదేరారు. ఈ సంఘటన తరువాత ముస్లింల సంవత్సరం పేరు “హిజ్రత్”గా నిశ్చయించబడింది, ఆ పేరు ఇప్పటి వరకు మిగిలి ఉంది.

రిఫరెన్స్
1. మినా వద్ద ఉన్న ఒక లోయ.
2. తారీఖె యాఖూబీ, భాగం1, పేజీ19.
3. తబరీ, భాగం2, పేజీ218-220.
4. ఓ ప్రవక్తా! కాఫిరులు నీకు వ్యతిరేకంగా వ్వూహ రచన చేసిన సంఘటనను కూడా గుర్తుకు తెచ్చుకో. నిన్ను బందీగా పట్టుకోవాలా? లేక నిన్ను హత్య చేయాలా? లేక నిన్ను దేశం నుంచి వెళ్ళగొట్టాలా? అని వారు తమ తరపున ఎత్తులు వేస్తుండగా, అల్లాహ్ పైఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ సాటిలేనిమేటి - సూరయె అన్ఫాల్, ఆయత్30.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18