హిజ్రత్ తరువాత సంభవించిన కొన్ని ముఖ్య సంఘటనలు

బుధ, 11/17/2021 - 16:49

దైవప్రవక్త(స.అ) మక్కా నుండి మదీనహ్ కు హిజ్రత్ చేసిన తరువాత సంభవించిన కొన్ని ముఖ్య సంఘటనల సంక్షిప్త వివరణ...

హిజ్రత్ తరువాత సంభవించిన కొన్ని ముఖ్య సంఘటనలు

మదీనహ్ ముస్లిముల కోరిక మెరకు దైవప్రవక్త(స.అ) మక్కా నుండి మదీనహ్ కు హిజ్రత్ చేశారు. వారు మదీనహ్ కు హిజ్రత్ చేసిన తరువాత సంభవించిన కొన్ని ముఖ్య సంఘటనలు:
దైవప్రవక్త(స.అ), హిజ్రత్ యొక్క మొదటి సంవత్సరంలో మదీనహ్ వాసులు(అన్సారులు) మరియు మక్కా వాసుల(ముహాజిరీనులు) బంధం అన్నదమ్ముల బంధం, అని ఒకరికి ఒకరు సహాయపడాలని ప్రకటించారు. వారి మధ్య సహోదరత్వ ఒప్పందాన్ని కుదిర్చారు. దానిని చరిత్రలో “అఖ్దె ఉఖువ్వత్” అంటారు.

హిజ్రత్ 2వ సంవత్సరంలో మస్లింల యొక్క ఖిబ్లా (నామాజు చదివే దిక్కు) ను “బైతుల్ ముఖద్దస్” (పాలస్తీన) నుంచి “కాబా”(మక్కా) కు మార్చబడింది. ఈ సంవత్సరం లోనే హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క వివాహం హజ్రత్ అలీ(అ.స) తో జరిగింది. ఈ సంవత్సరంలోనె షాబాన్ మాసం చివరిలో రమజాన్ నెలలో ఉపవాసాలు వాజిబ్ (విధి) గా నిర్ధారించబడ్డాయి. ఈ సంవత్సరం లోనే అల్లాహ్ తరపు నుండి “ముష్రికీన్”(అల్లాహ్ కు భాగస్వాములు ఉన్నరని భావించేవారు – విగ్రాహారథన చేయువారు) లతో యుద్దం చేయుటకు ఆజ్ఞాపించబడింది. ఈ సంవత్సరంలోనె “బద్‌ర్” యుద్దం కూడా జరిగింది.
“హిజ్రత్” యొక్క 3వ సంవత్సరంలో జనాబె హంజా(అ.స)[1] “ఒహద్” యుధ్ధం (జంగె ఒహద్) లో వీరమరణం పొందారు. ఈ సంవత్సరంలోనె ఇమామ్ హసన్(అ.స) జన్మించారు.
“హిజ్రత్” యొక్క 4వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్(అ.స) జన్మించారు[2].
“హిజ్రత్” యొక్క 5వ సంవత్సరంలో “ఖందఖ్” (జంగె ఖందఖ్) యుద్దం జరిగింది జంగె ఖందఖ్‌ను “జంగె అహ్‌జాబ్” (జంగె అహ్‌జాబ్) అని కూడా అంటారు. ఈ యుధ్దంలోనె అరబ్ దేశపు పెద్దపెద్ద శూరులను గడగడలాడించిన అమ్‌ర్ ఇబ్నె అబ్దెవద్‌ను అలీ(అ.స) చాలా తక్కువ సమయంలో హతమార్చారు.
“హిజ్రత్” యొక్క 6వ సంవత్సరంలో “జాతుర్రిఖా”, “బనీ లహ్‌యాన్” అను యుధ్దాలు జరిగాయి.
“హిజ్రత్” యొక్క 7వ సంవత్సరంలో “ఖైబర్” (జంగె ఖైబర్) యుధ్ధం జరిగింది. ఈ యుధ్ధంలో కూడా అలీ(అ.స) వలనే ప్రవక్త సైన్యానికి విజయం దక్కింది.

“హిజ్రత్” యొక్క 8వ సంవత్సరంలో “మౌతా” యుధ్ధం (జంగె మౌతా) జరిగింది. ఈ యుధ్ధంలో అలీ(అ.స) సోదరుడు జాఫరె తయ్యార్ ఇబ్నె అబీతాలిబ్ వీరమరణం పొందారు. “ఫత్‌హె మక్కా”[3] కూడా ఈ సంవత్సరంలోనే జరిగింది. అలీ(అ.స), దైవప్రవక్త(అ.స) భుజాల పై ఎక్కి కాబాలో రాళ్ళతో మరియు మట్టితో చేసియున్న విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంవత్సరములోనే “హునైన్” యుధ్ధం(జంగె హునైన్) జరిగింది.
“హిజ్రత్” యొక్క 9వ సంవత్సరంలో “తబూక్” (జంగె తబూక్) యుధ్దం జరిగింది.
“హిజ్రత్” యొక్క 10వ సంవత్సరములో నజ్రాన్ ప్రదేశానికి చెందిన క్రైస్తవులతో ముబాహలహ్ సంఘటన సంభవించింది. అదే సంవత్సరం దైవప్రవక్త ముహమ్మద్(స.అ) తమ చివరి హజ్ చేశారు. హజ్ చేసి వస్తుండగా “గదీర్ మైదానం” లో “నేను ఎవరెవరి నాయకుడినో అలీ నా తరువాత వారికి నాయకుడు” ప్రకటించి తన తరువాత హజ్రత్ అలీ(అ.స)ను తన ఉత్తరాధికారిగా నియమించారు.
“హిజ్రత్” యొక్క 11వ సంవత్సరం, సఫర్ నెల 28వ తారీకున ప్రవక్త ముహమ్మద్(స.అ) స్వర్గస్ధులైయ్యారు.

ఇక్కడ కేవలం హిజ్రత్ తరువాత సంభవించిన ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన సంఘటనలను మాత్రమే సూచించడం జరిగింది. ఇవి కాకుండా చాలా సంఘటనలు సంభావించాయి, ఉదాహారణకు చిన్న చిన్న యుద్ధాలు, కొన్ని సమూహలతో సంధి ఒప్పందాలు, ఇతర వర్గాల వారితో చర్చలు, ప్రముఖులు పెళ్ళిల్లు, జన్మదినాలు, ఆయతుల అవతరణలు, ప్రముఖులు మరణాలు మొ..[4]

రిఫరెన్స్
1. ప్రవక్త ముహమ్మద్(స.అ) యొక్క పిన తండ్రి.
2. కొన్ని ఇస్లాం చరిత్ర పుస్తకాలలో ఇమామ్ హుసైన్ (అ.స) 3 వ హిజ్రత్ లో జన్మించారు అని కూడా వ్రాసి వుంది.
3. మక్కాను జయించుట (మక్కాను తమ అదుపులో తీసుకొనుట).
4. ముంతహల్ ఆమాల్, షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, భాగం1, పేజీ 65 – 136.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13