రజ్అత్-1

ఆది, 11/21/2021 - 17:30

రజ్అత్ యొక్క అర్థం ఏమిటి? మరియు రజ్అత్ విశ్వాసం గురించి ఇస్లాం యొక్క ఏ వర్గం నమ్ముతుంది? మరియు అలాగే దాని పట్ల నమ్మకం లేకపోతే అవిశ్వాసానికి కారణమా? అన్న అంశాల వివరణ... 

రజ్అత్-1

కేవలం షియా ముస్లిములు “రజ్అత్”ను నమ్ముతారు. ఇస్లామీయ ఇతర వర్గాలలో ఈ నమ్మకం యొక్క ప్రస్తావన లేదు. కేవలం “గైబియా విశ్వాసాలు”(గుప్త నమ్మకాలు) గల సూఫియుల విశ్వాసాలలో కొంత ప్రస్తావన ఉంది. కాని “రజ్అత్” విశ్వాసాన్ని నమ్మని వాడిని కాఫిర్, అని చెప్పలేము. “రజ్అత్ విశ్వాసం” ద్వారా ఈమాన్ సంపూర్ణమూ అవ్వదూ అలాగే ఈమాన్ రజ్అత్ విశ్వాసం పై నిలబడీ లేదు.
స్పష్టంగా చెప్పాలంటే “రజ్అత్” పై విశ్వాసం ఉంచడం లాభానికి గాని లేదా నష్టానికి గాని కారణం కాదు. ఇది కేవలం షియా ముస్లింలు తమ ఆయిమ్మాల ద్వారా కొన్ని రివాయతులు మరియు హదీసులు ఉల్లేఖించారు: విశ్వాసులు అల్లాహ్ శత్రువుల నుండి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రళయం కన్న ముందు ఇహలోకంలోనే అల్లాహ్, విశ్వాసులలో కొందరిని మరియు దుర్మార్గులలో కూడా కొందరిని ప్రాణాలు పోసి బ్రతికిస్తాడు –ఈ రివాయతులు ఒకవేళ సరైనవి అయినట్లైతే– నిజానికి ఈ రివాయతులు షియా ముస్లింల దృష్టిలో సరైనవి మరియు ముతవాతిర్ కూడాను– అయినప్పటికీ సున్నీయుల పై వాళ్ళను నిర్భందించే హక్కు లేదు. సున్నీయులకు ‎“‎మీరు రజ్అత్‌పై విశ్వాసం కలిగి ఉండడం అవసరం” అని చెప్పే హక్కు రజ్అత్ ను నమ్మేవారికి లేదు. ఎందుకంటే ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లు ఈ రివాయతులను తమ పితామహులు దైవప్రవక్త(స.అ) నుండి ఉల్లేఖించారు.
అయితే షియా ముస్లిములు ఎవ్వరినీ “రజ్అత్”ను విశ్వసించు అని బలవంతం చేయరు. మరియు ఎవరైతే రజ్అత్‌ను నమ్మరో వాళ్ళను కాఫిర్ అని కూడా నిందించరు. అందువల్ల షియా ముస్లిముల గురించి తప్పుగా “షియాలు ఇటువంటి వారు అటువంటి వారు అని” చెప్పే అవసరం కూడా లేదు.
షియా ముస్లిములు తన వద్ద ఉన్న కొన్ని రివాయతులు మరియు ఆయతుల వ్యాఖ్యానం ప్రకారంగా రజ్అత్ విశ్వాసాన్ని నమ్ముతారు. ఉదా: وَيَوۡمَ نَحۡشُرُ مِن كُلِّ أُمَّةٖ فَوۡجٗا مِّمَّن يُكَذِّبُ بِ‍َٔايَٰتِنَا فَهُمۡ يُوزَعُونَ
అనువాదం: (ఆ రోజును గురించి కొంచెం ఆలోచించు) అప్పుడు మేము ప్రతి సముదాయం నుండి మా ఆయతులను తిరస్కరించే ఒక్కొక్క జనసమూహాన్ని సమీకరిస్తాము. ఆపై వారిని ఒక క్రమ పద్ధతిలో ఉంచటం జరుగుతుంది[అల్ నమ్ల్ సూరా:27, ఆయత్:83]

“‎తఫ్సీరె ఖుమ్మీ”లో (రావీయుల క్రమాన్ని తొలగిస్తూ) ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ప్రజలు ఈ ఆయత్ – وَيَوۡمَ نَحۡشُرُ مِن كُلِّ أُمَّةٖ– గురించి ఏమని చేబుతారు? అని ప్రశ్నించారు. రావీ, ప్రజలు ఇది ప్రళయం గురించి అని అంటున్నారు, అని అన్నాడు. హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: ప్రజలు చెప్పింది సరికాదు ఈ ఆయత్ రజ్అత్‌కు సంబంధించింది. ఎందుకంటే అల్లాహ్ ప్రళయం నాడు ప్రతీ ఉమ్మత్ నుండి ఒక సమూహాన్ని మాత్రమే లేపి మిగిలిన వాళ్ళను వదిలేస్తాడా? ప్రళయం ప్రస్తావన ఉన్న ఆయత్ ఇది: وَحَشَرۡنَٰهُمۡ فَلَمۡ نُغَادِرۡ مِنۡهُمۡ أَحَدٗا
అనువాదం: ఒక్కరు కూడా మిగిలిపోకుండా మేము మానవులందరినీ సమావేశపరుస్తాము[కహఫ్ సూరా:18, ఆయత్:47]

“అఖాయిదే ఇమామియా” “షేక్ రజా ముజఫ్ఫర్” గారి పుస్తకంలో ఇలా ఉంది: ఇమామియా వర్గం అహ్లెబైత్(అ.స)ల రివాయతుల ప్రకారం అల్లాహ్ కొందరిని వాళ్ళ అసలు రూపంలో ఇహలోకంలోనే మరలా ప్రాణం పోసి బ్రతికిస్తాడు.  ఆ తరువాత కొందరికి గౌరవాన్ని మరియు కొందరికి అగౌరవాన్ని ఇస్తాడు. సత్యులు అసత్యులతో మరియు బాధితులు దుర్మార్గులతో తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. ఇది ఇమామ్ మహ్‌దీ(అ.స) ప్రత్యక్షమగు కాలంలో జరుగుతుంది!. కేవలం అతి ఎక్కువ విశ్వాసంగల వారిని మరియు అతి పెద్ద దుష్టులను మాత్రమే ప్రాణం పోసి బ్రతికించడం జరుగుతుంది. ఆ తరువాత వాళ్ళకు మరలా మరణం సంభవిస్తుంది, అని నమ్ముతారు.[1]
ఆ తరువాత వాళ్ళు అంత్యదినమున పునర్జన్మమివ్వడం జరుగుతుంది. ఎవరికి ఎంత హక్కు ఉందో అతడికి అంత పుణ్యాన్ని మరియు శిక్షను ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్‌లో ఇలాంటి వాళ్ళ కోరికను ప్రవచిస్తున్నాడు. వాళ్ళు తిరిగి వచ్చాకా కూడా మారరు మరియు అల్లాహ్ శిక్షకు అర్హులవుతారు.
قَالُواْ رَبَّنَآ أَمَتَّنَا ٱثۡنَتَيۡنِ وَأَحۡيَيۡتَنَا ٱثۡنَتَيۡنِ فَٱعۡتَرَفۡنَا بِذُنُوبِنَا فَهَلۡ إِلَىٰ خُرُوجٖ مِّن سَبِيلٖ
అనువాదం: వారు ఇలా అంటారు: ‎“‎ప్రభువా! నిజంగానే నీవు మాకు రెండుసార్లు మరణాన్నీ, రెండుసార్లు జీవితాన్నీ ఇచ్చావు. ఇప్పుడు మేము మా తప్పులను ఒప్పుకుంటున్నాము. కనుక ఇక్కడ నుండి బయటకు పడే మార్గం కూడా ఏదైనా ఉందా?[మొమినూన్ సూరా:40, ఆయత్:11][2]

రిఫరెన్స్
1. షేఖ్ మొహమ్మద్ రిజా ముజఫ్ఫర్, అఖాయిదుల్ ఇమామియహ్, పేజీ71.
2. హంరాహ్ బా రాస్తగోయాన్, తీజానీ సమావీ, పేజీ420.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16