షియా వర్గం-1

మంగళ, 11/23/2021 - 17:19

షియా వర్గం యొక్క పరిచయంతో పాటు వారిని నిందించే అంశాలు మరియు వాటి సమాధానాలు సంక్షిప్తంగా...

షియ వర్గం-1

మేము ఎటువంటి ప్రతిపక్షపాతం లేకుండా షియా[1] వర్గం గురించి చెప్పాలంటే, వారి గురించి ఇలా చెప్పాలి: అది ఇస్లామీయ వర్గాలలో ఒకటి, ఆ వర్గం దైవప్రవక్త(స.అ) యొక్క అహ్లెబైత్(అ.స)లలో అలీ(అ.స) మరియు అతని పదకొండు కుమారులను ఇష్టపడతారు. వారి పట్ల విధేయతగా ఉంటారు. ఫిఖా ఆదేశాలన్నీటిలో వారినే ఆశ్రయిస్తారు. దైవప్రవక్త(స.అ) తప్ప మరెవ్వరినీ వారి కన్నా ఉత్తములుకారు, అని నమ్ముతారు.
ఇదీ చాలా సంక్షిప్తంగా షియా యొక్క సరైన అర్ధం. ప్రతిపక్షానికి గురై ఉన్న శత్రవుల “షియాలు ఇస్లాం యొక్క శత్రువులు, లేదా వారు అలీ(అ.స) యొక్క దైవదౌత్యాన్ని నమ్మేవారు, లేదా ఈ వర్గ సృష్టికర్త అబ్దుల్లాహ్ ఇబ్నె సబాయే యహూదీ’’ అన్న మాటలన్నీ నిందలు మాత్రమే వాటికి ఎటువంటి సాక్ష్యాలు లేవు.
కొంతమంది స్వమతపక్షపాతులు “షియా కాఫిర్‌లు(అవిశ్వాసులు) మరియు ఇస్లాం నుండి బహిష్కరించబడిన వారిలా” చూపించడానికై అన్నివిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాని వాళ్ళ వచనాలు కేవలం నింద మరియు స్పష్టమైన అబద్ధాలు. వాళ్లు అహ్లెబైత్(అ.స)ల శత్రువులైన తమ పూర్వీకుల వచనాలనే మరలా చెప్పారు. –ఉమ్మత్
పై బలవంతంగా అధికారం చెలాయించిన మరియు వారిని దేశబహిష్కరణచేసి, ఎవరూలేని ప్రదేశాలలో తమ జీవితాన్ని గడపడంపై బలవంతం పెట్టిన, వారిని చెడు పేర్లతో సంభోదించేటువంటి– నవాసిబ్[2]ల మాటలను రిపీట్ చేశారు.
షియా ముస్లిముల విరోధుల పుస్తకాలలో “రాఫిజీ” లేదా “రవాఫిజ్” లాంటి బిరుదులు లిఖించబడి ఉన్నాయి. అందకనే పాఠకుడికి, దానిని చదవగానే “షియా ముస్లిములు దైవప్రవక్త(స.అ) దౌత్యాన్ని ధిక్కరించేవారు, ఇస్లాం చట్టాన్ని నిరాకరించేవారు, మరియు వాటి పై అమలు చేయనివారు” అని ఆలోచనలు వస్తాయి.
వాస్తవానికి “బనీఉమయ్యాహ్” మరియు “బనీఅబ్బాస్”ల అధికారులు మరియు వాళ్ళ ముఖస్తుతి చేసే ఉలమాలు, షియా ముస్లిములను ఈ చెడు బిరుదులతో గుర్తుచేసే వాళ్ళు. ఎందుకంటే షియాలు హజ్రత్ అలీ(అ.స)ని ఇష్టపడేవారు. వారు అబూబక్ర్, ఉమర్, ఉస్మానుల ఖిలాఫత్
ను నిరాకరించే వారు. మరి అలాగే అమవీ మరియు అబ్బాసీయుల అధికారుల ఖిలాఫత్
ను కూడా నిరాకరించేవారు. బహుశ ఆ అధికారులు నకిలీ హదీసులను తయారు చేసే సహాబీయుల నుండి కొందరి సహాయంతో ఉమ్మత్
పై అధికారాన్ని చేజి క్కించుకొని ఉంటారు. ఎందుకంటే సహాబీయులు వాళ్ళ ఖిలాఫత్
ను షరీఅత్ పరమైనది, అని ప్రకటించేవారు. మరియు అల్లాహ్ యొక్క ఈ ప్రవచనాన్ని నిదర్శనంగా ప్రదర్శిస్తూ ఉంటారు:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡ
అనువాదం: “ఓ విశ్వాసులారా! అల్లాహ్
కు విధేయత చూపండి. ప్రవక్తకు మరియు మీలోని ఊలిల్ అమ్ర్(అధికారం కలిగి ఉన్నవారు)కు విధేయత చూపండి”[నిసా సూరా:4, ఆయత్:59]   
వాళ్ళు ఈ ఆయత్
 ద్వార “ఈ అధికారులనే” అని అనేవారు. ఈ ఆయత్ వాళ్ళ గురించే అవతరించబడిందనీ మరియు వాళ్ళే “أُوْلو ٱلۡأَمۡرِ” అనీ, మరి వాళ్ళ ఆజ్ఞను పాటించడం ప్రతీ ముస్లింపై వాజిబ్, అని అనేవారు. కొన్ని సమయాలలో అధికారులు, దైవప్రవక్త(స.అ) తరపు తప్పుడు హదీసులను అంటకట్టేటువంటి వాళ్ళను అద్దేకు తీసుకునే వారు. అలా దైవప్రవక్త(స.అ) ద్వారా ఇటువంటి హదీస్ ఉల్లేఖించబడింది:
لیس احد خرج من السلطان شبرا فمات علیه الامات الجاھلیه  
అనువాదం: “ఎవ్వరికి కూడా అధికారికి ఒక్క అడుగు కూడా వ్యతిరేకించే హక్కులేదు మరియు ఒకవేళ అతడు అలాగే(వ్యతిరేకతలో) చనిపోతే, అతడు అజ్ఞాన కాలం(అవిశ్వాసిగా)లో చావు పొందినట్లు”.
అంటే ఏ ముస్లిముకూ అధికారిని వ్యతిరేకించే హక్కు లేదన్నమాట.
దీనితో మనకు షియా ముస్లిములు, అధికారుల దుర్మార్గానికి ఎందుకు గురి అయి ఉండేవారో అర్ధమౌతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ అధికారులతో బైఅత్ చేసేందుకు నిరాకరించారు. మరియు “ఖిలాఫత్, అహ్లెబైత్(అ.స)ల నుండి చేదించబడిన హక్కు” అని భావించేవారు, అందుకనే అధికారులు ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి “షియాలు, ఇస్లాం యొక్క శత్రువులు మరియు వాళ్ళు దీనిని నాశనం చేయాలి అని అనుకుంటున్నారు” అని అనేవారు. మరి ఇలాగే జ్ఞానులని వాదించుకునేటువంటి రచయితలలో కొందరు వీటిని వ్రాశారు.[3]

రిఫరెన్స్
1. షియా అనగా మా ఉద్దేశంలో ఇక్కడ “ఇమామియా ఇస్న అషరీ” (12 ఇమాములను నమ్మేవారు) అని) వారిని ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) పేరుని బట్టి “జాఫరీ” అని కూడా సంభోదించబడతారు. మా సంభాషణ యొక్క సంబంధం వేరే వర్గాలు “ఇస్మాయిలియ్యాహ్” మరియు “జైదియ్యాహ్” మొ॥ వర్గాలతో లేదు. వాళ్ళు మా దృష్టిలో “సఖ్లైన్” హదీసును అనుసరించని వేరే వర్గం వారితో సమానమైన వారు. వారికి దైవప్రవక్త(స.అ) తరువాత హజ్రత్ అలీ(అ.స) యొక్క ఇమామత్ యొక్క విశ్వాసం ఎటువంటి లాభాన్ని చేకూర్చదు.
2. అహ్లెబైత్(అ.స)
ల పట్ల శత్రుత్వం గలవారు మరియు వారిని దూషించేవారు.
3. అహ్లె సున్నతె వాఖెయి, తీజానీ సమావీ, పేజీ20.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15