షియా వర్గం-2

బుధ, 11/24/2021 - 15:12

షియా వర్గాన్ని తప్పుడు వర్గంగా ప్రచారం చేసేవారు శత్రువులై ఉండాలి లేదా అమాయకులై ఉండాలి, నిజానికి అహ్లె సున్నత్ వర్గానికి చెందిన చాలా మంది పెద్ద పెద్ద రచయితలు మరియు ఉలమాలు షియా వర్గం ఇస్లామీయ వర్గంగా భావిస్తారు...

షియా వర్గం-2

ఒకవేళ మేము సత్యాన్ని అసత్యంతో కలిపే, పన్నాగాని చూసినట్లైతే, “ఇస్లాంను అంతం చేయాలనుకుంటున్నవారు వేరూ మరియు దుర్మార్గపు అధికారులకు వ్యతిరేకంగా నిలబడేవారు వేరూ” అని తెలుస్తుంది. ఇలా చేసి హక్కును హక్కుదారుడికి చేర్చడమే వాళ్ళ ఉద్దేశం, ఇలా చేయడం వల్ల ఒక న్యాయమైన అధికారి ద్వార ఇస్లాం చట్టం అమలులోకి వస్తుంది. షియా వర్గం విముక్తులు, ఎందుకంటే వారు “సఖ్లైన్”(ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) ఇత్రత్)తో కలిసి ఉన్నారు.
న్యాయవర్తులైన అహ్లెసున్నత్ ఉలమాలు కూడా ఈ యదార్ధాన్ని అంగీకరిస్తారు.  “ఇబ్నె మన్జూర్” తన పుస్తకం “లిసానుల్ అరబ్”లో షియా యొక్క అర్ధాన్ని ఇలా వివరించారు; “షియా” దైవప్రవక్త(స.అ) యొక్క ఇత్రత్(అ.స)
ను ఇష్టపడేటువంటి వర్గం. అలాగే “డాక్టర్ సయీద్ అబ్దుల్ ఫత్తాహ్ ఆషూర్” “లిసానుల్ అరబ్” యొక్క వాక్యాన్ని ఉల్లేఖించిన తరువాత ఇలా వ్రాశారు: “షియా” దైవప్రవక్త(స.అ) యొక్క ఇత్రత్(అ.స)ను ఇష్టపడేటువంటి వర్గాన్ని అంటారు. అంటే ఇక ముస్లిములలో షియా అయ్యేందుకు నిరాకరించే వాడేవడున్నాడు?.
పారంపర్య ప్రతిపక్షపాతం మరియు శత్రుత్వపు కాలం, అంతం అయ్యింది. ఇప్పుడు కాంతి, వెలుగు మరియు ఆలోచన స్వేచ్ఛగల కాలం వచ్చేసింది. వివేకులు మరియు పరివర్తనాన్ని ఇష్టపడే యువకులు కళ్ళు తెరిచి షియా ముస్లిముల పుస్తకాలు చదవండి, వారితో కలవండి మరియు వాళ్ళ ఉలమాలతో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీరు యదార్ధాన్ని తెలుసుకోగలరు.
ఈనాడు ప్రపంచమంతా ప్రతిఒక్కరి చేతుల్లో ఉంది. మరియు షియా ముస్లిములు కూడా వివిధ నగరములలో ఉన్నారు. మరి అలాంటి సమయంలో పరిశోధకుడికి, షియా ముస్లిముల గురించి, షియా శత్రువులతో మరియు విశ్వాసాల ప్రకారంగా వారి వ్యతిరేకులతో ప్రశ్నించే హక్కులేదు. మొదట్నుండే షియా ముస్లిముల శత్రువులతో ప్రశ్నించేవాడు, ఏమి ఆశించగలడు? షియా వర్గం ఒక గుప్త వర్గం కూడా కాదు, దాని విశ్వాసాలు ఎవరికీ తెలియవు, అని అనడానికి. అంతేకాదు వారి పుస్తకాలు మరియు పబ్లికేషన్స్, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. మరియు తెలుసుకోవాలని అనుకునే ప్రతీ ఒక్కరి కోసం, మద్రసాలు మరియు ఇస్లామీయ యూనివర్సిటీల తలుపులు తెరిచే ఉన్నాయి. వాళ్ళ ఉలమాల తరపు నుండి కాన్ఫ్రెన్స్‌లు, సిమినార్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇస్లాం ఉమ్మత్
ను ఐక్యత పిలుపుని ఇస్తూ ఉంటారు. వాళ్ళందరిని, ఏకాభిప్రాయం కలిగి ఉన్న వాటిలో ఐక్యంగా ఉండేందుకు ఆహ్వానిస్తారు.

ఒకవేళ ఇస్లాం ఉమ్మత్ యొక్క న్యాయవర్తనులు, చిత్తశుధ్ధి మరియు ఉత్సాహంగా ఈ సమస్యను పరిశోధించినట్లైతే అతడు తప్పకుండా యదార్ధానికి దగ్గరవుతారు. యదార్ధం కానిదంతా మార్గభ్రష్టతే, మరి అది వాళ్ళ వరకు చేరేందుకు అడ్డు పడుతుంది, అది షియా శత్రువుల తప్పుడు ప్రచా రం లేదా షియా అజ్ఞానులు చేసిన తప్పులు కూడా కావచ్చు.
ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంది, కేవలం ఒక్క అనుమానం తొలిగిపోతే ఒక షియా శత్రువు, మిత్రుడిగా మారడాన్ని చూడగలరు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు చాలా ఉల్లేఖించబడి ఉన్నాయి. సిరియాకు చెందిన వ్యక్తి మదీనహ్ కు వచ్చినప్పుడు ఇమామ్ హసన్(అ.స)ను చూసి వారి తండ్రి మరియు వారి కుటుంబం సభ్యుల గురించి సిరియాలో ముఆవియా యొక్క తప్పుడు ప్రచారాలకు గురి అయిన వ్యక్తి నోటికొచ్చినట్లు తిట్టాను కాని దానికి బదులు ఇమామ్ నుంచి మంచి ప్రవర్తనను చూసి ఇమామ్ యొక్క షియా గా మారిపోయాడు.

మిల్లత్[1] యొక్క యువకులకు యదార్థాన్ని తెలియపరిచే క్రమంలో తమ సమయం మరియు డబ్బు ఖర్చు పెట్టడం  ప్రపంచమంతటా ఉన్న షియా జ్ఞానులు పై విధి. ఎందుకంటే అహ్లెబైత్(అ.స)ల ఇమాములు, కేవలం షియా ముస్లిములకే చెందినవారు కాదు, వారు ముస్లిములందరి కొరకు రుజుమార్గ దర్శకులు మరియు చీకటిని శోధించే దీపం లాంటివారు.
ఎలాగైతే జనం కాఫిరులు మరియు అవిశ్వాసులుగా ఉన్నంతవరకు మరియు దైవప్రవక్త(స.అ) తీసుకొచ్చినటువంటి ఈ అల్లాహ్ ఇస్లాం ధర్మం, అని తెలుసుకోనంత వరకు ముస్లిములందరు అల్లాహ్
కు జవాబుదారులో అలాగే ఒక వేళ ఇమాముల గురించి సాధారణమైన ముస్లింలకు ముఖ్యంగా అహ్లెసున్నత్
ల యువజ్ఞానులకు తెలియకుంటే, దానికి బాధ్యులు మేమే అవుతాము.[2]

రిఫరెన్స్
1. ముస్లిం సమాజం అని ఆర్థం.
2. అహ్లె సున్నతె వాఖెయి, తీజానీ సమావీ, పేజీ22.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23