అహ్లెసున్నత్ వర్గం-1

సోమ, 11/29/2021 - 16:52

అహ్లె సున్నత్ వర్గం ఎన్ని ఎన్ని సమూహాలతో కూడి ఉంది మరియు ఖిలాఫత్ విషయంలో వారి విశ్వాసం ఏమిటి అన్న విషయాల సంక్షిప్త వివరణ...

అహ్లెసున్నత్ వర్గం-1

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
అహ్లెసున్నత్ వర్గం ప్రపంచమంతటా 1/3 భాగం గల అతిపెద్ద వర్గం ముస్లిముల వర్గం. ఆయిమ్మయే అర్‌బఅ; “అబూ హనీఫా, మాలిక్, షాఫెయీ మరియు అహ్మద్ ఇబ్నె హంబల్”ల తఖ్లీద్ చేసే వర్గం. వారి ఫత్వా మరియు ఆదేశాల ప్రకారంగా అమలు చేయువారు.
కొంతకాలం తరువాత ఈ వర్గానికి ఒక శాఖ బయటకు వచ్చింది దానిని “సలఫీ” అంటారు. దాని నియమాలను “ఇబ్నె తైమియాహ్” నియమించారు. అందుకనే ఇబ్నె తైమియాహ్
ను వీళ్ళు “ముజద్దిదుస్సున్నహ్”[1] అంటారు. ఆ తరువాత “వహాబీయా” వర్గం వెలుగులోకి వచ్చంది. స్థాపించిన వాడు “ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహ్హాబ్”. సౌదీ అరేబీయులు ఆచరించే మతం ఇదే.
మరి వీళందరు కూడా తమను “అహ్లెసున్నత్” అనే అంటారు. మరి అప్పుడప్పుడూ “వల జమాఅత్” కూడా జోడిస్తూ ఉంటారు. “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అను పేరుతో పిలవబడతారు.
చారిత్రక సంభాషణాలతో తెలిసే విషయం ఏమిటంటే; దేనినైతే అహ్లెసున్నత్
లు “ఖిలాఫతే రాషిదహ్” లేదా “ఖులఫాయే రాషిదీన్” అనగా “అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియు అలీ(అ.స)”ల[2] ఇమామత్‌ను అంగీకరిస్తారు, వాళ్ళ కాలంలో కానివ్వండి లేదా ఈ కాలంలో కానివ్వండి. మరి “ఖిలాఫతే రాషిదహ్”ను నిరాకరించిన వారిని షరీఅత్
తో సంబంధం లేనివారిగా నిర్ధారిస్తారు. మరియు దైవప్రవక్త(స.అ) స్పష్ట ఆదేశాల ఆధారంతో హజ్రత్ అలీ(అ.స) ఖిలాఫత్
ను నిదర్శించేవారిని “షియా” అంటారు.

ఇంకో స్పష్టమైన విషయం ఏమిటంటే “అబూబక్ర్ నుండి బనీఅబ్బాస్ ఖులఫాల” వరకు అధికారులందరూ అహ్లెసున్నత్
లతో మంచిగా ఉండేవారు మరియు వారి మాటలతో ఏకీభవించేవారు. కాని అలీ(అ.స) యొక్క షియాల పై కోపంగా ఉండేవారు మరియు వారి నుండి ప్రతీకారానికి వేచి ఉండేవారు.
ఇందు మూలంగా వాళ్ళు అలీ(అ.స) మరియు అతని షియాలను “అహ్లె సున్నత్ వల్ జమాఅత్”
లో లెక్కించేవారు కాదు. “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” పదాన్ని షియా ముస్లిముల విరుధ్ధంలో ప్రదర్శించబడినట్లుంది. బహుశా ఈ కారణంగానే దైవప్రవక్త(స.అ) మరణాంతరం “ఇస్లాం ఉమ్మత్” షియా మరియు సున్నీ అని భాగాలుగా విడిపోయింది.

మేము చారిత్రక సరైన మూల పుస్తకల ద్వార కారణాలను పరిశీలనగా చూస్తే, యదార్ధాల నుండి ముసుగును తొలగిస్తే, దైవప్రవక్త(స.అ) మరణించిన వెంటనే వర్గాల విభజన అయ్యింది, అని తెలుస్తుంది. ఎందుకంటే అబూబక్ర్ ఖిలాఫత్ సీటుపై కూర్చుండి పోయారు, మరియు సహాబీయులలో ఎక్కువ మంది అతనితో బైఅత్ చేశారు. మరి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), బనీ హాషిం మరియు సహాబీయులలో కొందరు, అందులోనూ ఎక్కువ శాతం బానిసత్వం నుండి విముక్తి పొందిన వారు, వాళ్ళు ఆ ఖిలాఫత్
ను నిరాకరించారు.
స్పష్టంమైనదేమిటంటే, అధికారులు వాళ్ళను మదీనా నుండి దూరంగా ఉండేందుకు బలవంతం చేశారు, మరియు కొందరిని దేశబహిష్కరణ చేశారు, మరియు వాళ్ళను దీన్ లేని వానిగా భావించి వాళ్ళ పట్ల అవిశ్వాసుల పట్ల చేసే ప్రవర్తన వలే ప్రవర్తించేవారు. మరియు వాళ్ళపై కాఫిరులపై ఆమోదించే వాణిజ్య మరియు రాజకీయ నిబంధనలనే ఆమోదించబడేవి.

ఈనాటి అహ్లెసున్నత వల్ జమాఅత్ వాళ్ళు అప్పటి కాలంలో పన్నిన రాజకీయ పన్నాగాలను అర్ధం చేసుకోలేరు. మరియు అలాగే దైవప్రవక్త(స.అ) తరువాత మానవ చరిత్ర యొక్క ఉత్తమవ్యక్తికి పదవి దక్కనివ్వకుండా చేసిన ఆ వైరం మరియు శత్రుత్వాన్ని కూడా అర్ధం చేసుకోలేరు.  ఈనాటి అహ్లెసున్నత్ వల్ జమాఅత్ “ఖులఫాయే రాషిదీన్ల కాలంలో వ్యవహారాలన్నీ అల్లాహ్ గ్రంథం ప్రకారంగా జరిగేవి” అని నమ్ముతారు. అందుకని వాళ్ళు ఖులఫాయే రాషిదీన్లను ఒకరిని ఒకరు గౌరవించుకునే వారు మరియు వాళ్ళలో ఎటువంటి ద్వేషం లేనటువంటి దూత స్వభావం గలవారు అని అనుకుంటారు. మరియు అలాగే వారిలో ఎటువంటి నీచ అలవాటు ఉండేది అన్న అనుమానం కూడా రానివ్వరు.[3]

అందుకనే అహ్లెసున్నత్
లు, సహాబీయుల పట్ల ముఖ్యంగా “ఖులఫాయే రాషిదీన్
”ల పట్ల షియా సిధ్దాంతాలను నిరాకరిస్తారు. అహ్లెసున్నత్ వల్ జమాఅత్ తమ ఉలమాలు వ్రాసిన చరిత్ర కూడా చదవలేదు, అంతేకాదు వాళ్ళు పూర్వీకుల నుండి సహాబీయుల గురించి ముఖ్యంగా “ఖులఫాయే రాషిదీన్”ల ప్రశంసలు విని అదే చాలు, అని అనుకున్నారు. ఒకవేళ వాళ్ళు కళ్ళు తెరిచి, పెద్ద మనసుతో తమ చరిత్ర మరియు హదీస్ పుస్తకాలు చదివితే, వారిలో సత్యాన్వేషణ భావావేశం ఉంటే, తప్పకుండా వారి నమ్మకం మారుతుంది. మరి ఇది కేవలం సహాబీయులపై విశ్వాసానికే  పరిమితం కాదు, వారు చాలా తప్పుడు విశ్వాసాలను సరిగా అర్ధం చేసుకుంటారు.

రిఫరెన్స్
1. సున్నత్
ను పునరుద్ధరించినవాడు.
2. తరువాత వచ్చే సంభాషణలతో “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” హజ్రత్ అలీ(అ.స)ను “ఖులఫాయే రాషిదీన్” నుండి అని అనుకునే వారు కాదు. చాలా కాలం గడిచిన తరువాత వారిలో ఒకరుగా చేర్చారు, అని తెలుస్తుంది.
3. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ37.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16