ఉసామా సైన్యాథిపత్యం పట్ల వ్యతిరేకత

గురు, 12/02/2021 - 17:43

దైవప్రవక్త(స.అ) నియమించిన సైన్యాథిపతి యొక్క నాయకత్వాన్ని నిరాకరించిన సహాబీయుల గురించి సంక్షిప్త వివరణ...

ఉసామా సైన్యాథిపత్యం పట్ల వ్యతిరేకత

దైవప్రవక్త(స.అ) తన మరణానికి రెండు రోజుల ముందు, ఒక సైన్యాన్ని సిధ్ధం చేసి, ఉసామా
ను ఆ సైన్యానికి అథిపతిగా నియమించారు, మరియు సహాబీయులందరిని ఆ సైన్యంలో పాలుగోమని ఆదేశించారు, కాని సహాబీయులు అందులో పాలుగోలేదు.
చివరికి దైవప్రవక్త(స.అ)ను “మీరు మాపై 17 సంవత్సరాల, గడ్డం కూడా మొలవని యువకుడిని నాయకుడిగా నియమించారు” అని నిందించారు.
అబూబక్ర్, ఉమర్ మరియు మరి కొందరు, ఖిలాఫత్ ఆశ వల్ల దైవప్రవక్త(స.అ) ఉసామా సైన్యంలో పాలుగోని వాళ్ళపై లఅనత్ చేసినప్పటికీ, వాళ్ళు దానిలో పాలుగోలేదు.[1]

కాని దైవప్రవక్త(స.అ), అలీ(అ.స) మరియు అతని విధేయులను ఉసామా సైన్యంలో పాలుగోమని ఆదేశించలేదు. దైవప్రవక్త(స.అ) విబేధాన్ని అంతం చేయడానికే ఇలా చేశారు. అలా చేస్తే అల్లాహ్ ఆదేశాన్ని వ్యతిరేకించే వారిని మదీనా నుండి బయటకు పంపేయవచ్చు, మరి వాళ్ళు అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పటికి హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ పదవి దృఢమై ఉండేది, అని అర్ధంమౌతుంది. ఇది అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) ఉద్దేశం. కాని ఖురైషీయులు తెలివైనవాళ్ళు మరియు కుట్రాదారులు, వాళ్ళు దీనిని పసిగట్టారు. వాళ్ళందరు కలిసికట్టుగా మేము మదీనా నుండి బయటకు వెళ్ళకూడదు, అని తీర్మానించుకున్నారు. అలాగే వాళ్ళు ఎంత ఆలస్యం చేశారంటే చివరికి దైవప్రవక్త(స.అ) మరణించారు. వారు తమ నిర్ణయాన్ని సాధించుకున్నారు. మరియు దైవప్రవక్త(స.అ) యొక్క కోరికను తిరస్కరించారు. వేరే విధంగా చెప్పాలంటే వాళ్ళు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరాకరించారు.

ఈ సంఘటన ద్వార “అబూబక్ర్”, “ఉమర్”, “ఉస్మాన్”, “అబ్దల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్”, “అబూ ఉబైదహ్”, “ఆమిర్ ఇబ్నె జర్రాహ్”
లు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరాకరించారు, అని మనకు తెలుస్తుంది. వాళ్ళు ప్రాపంచిక ఆశలకు మరియు ఖిలాఫత్
కు తగ్గట్టుగా, నిర్భయంగా ఇజ్తిహాద్ చేసేవారు. మరి అందు లో అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)
కు వ్యతిరేకంగా, పాపాన్ని పాలుపడుతున్నాము అన్న భయం కూడా ఉండేదికాదు.
కాని అలీ(అ.స) మరియు వాళ్ళ విధేయులు, దైవప్రవక్త(స.అ) సున్నత్
పై కట్టుబడి ఉండేవారు. మరియు సాధ్యమైనంత వరుకు సున్నత్
పై అమలు చేసేవారు. అలాంటి కఠినమైన పరిస్థితులలో కూడా అలీ(అ.స)ను దైవప్రవక్త(స.అ) వసీయత్
పై అమలు చేస్తుండడాన్నే చూస్తారు. సహాబీయులందరు దైవప్రవక్త(స.అ)కు గుస్ల్ మరియు కఫన్ ఇవ్వకుండా మృతదేహాన్ని వదిలి, ఖిలాఫత్ పదవీ నిర్ధారణకు “సఖీఫా” చేరుకున్నారు. హజ్రత్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) యొక్క గుస్ల్, తజ్హీజ్, తక్ఫీన్ మరియు తద్ఫీన్ పనుల్లో నిమగ్నమయ్యారు. హజ్రత్ అలీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క ప్రతీ ఆదేశంపై అమలు చేసేవారు. అతనిని వాటిపై అమలు చేయనివ్వకుండా అడ్డుకునే శక్తి ఎవ్వరికి ఉండేదికాదు. అనుకుంటే అతను కూడా సఖీఫాలో వెళ్ళేవారూ, సహాబీయుల ప్లాన్
ను మట్టిలో కలిపేవారు, కాని అతని దృష్టిలో దైవప్రవక్త(స.అ) సున్నత్ పట్ల గౌరవం మరియు దాని ప్రకారంగా అమలు చేయడం, ముఖ్యమైనవి.

అందుకని ఖిలాఫత్ పదవి చేజారిపోతుంది అని తెలిసి కూడా అతను తన పినతండ్రి కుమారుడి దేహాన్ని వదిలి వెళ్ళలేదు.
ఇక్కడ కొంచెం విశ్రాంతి కోసమే సరే, దైవప్రవక్త(స.అ) నుండి అలీ(అ.స)కు వారసత్వంలో లభించిన ఆ గొప్ప సద్గుణాన్ని పరిశీలించడం, అవసరం. హజ్రత్ అలీ(అ.స), దైవప్రవక్త(స.అ) సున్నత్
పై అమలు జరిపేందుకు ఖిలాఫత్
ను వదిలేశారు మరియు ఇతరులు, వాళ్ళు ఖిలాఫత్
పై ఆశతో దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వదిలేశారు.[2]

దైవప్రవక్త(స.అ) ఆదేశాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఇలాంటి సహాబీయుల గురించి మరియు వారిని అనుచరిస్తున్న ముస్లిముల గురించి ఏమని చెప్పగలం. ఇప్పటికీ సమయం మించిపోలేదు, మతపక్షపాతాన్ని దూరంగా ఉంచి పరిశోధన చేసి రుజుమార్గాన్ని పొందవచ్చు. ఇన్ షా అల్లాహ్.  

రిఫరెన్స్
1. “షహ్రిస్తానీ” గారి పుస్తకం “అల్ మిలల్ వల్ నహల్”లో చూడండి. దైవప్రవక్త ఇలా ప్రవచించారు: “لعن اللہ من تخلف عن جیسش اسامۃ” భాగం1, పేజీ29.
2. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ46.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15