అహ్లెబైత్(అ.స) పట్ల కుట్ర-1

శుక్ర, 12/03/2021 - 17:12

దైవప్రవక్త(స.అ) మరణానంతరం ముస్లిములు రెండు భాగాలుగా విడిపోయిన తరువాత అధికారం పై వచ్చిన ఖలీఫా అహ్లెబైత్(అ.స) ప్రతిష్టత మరియు వారి గొప్పతనాన్ని కించపరచడానికి పన్నిన కొన్ని పన్నాగాల వివరణ...

అహ్లెబైత్(అ.స) పట్ల కుట్ర-1

సహాబీయులలో చాలా మంది సఖీఫాలో అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ గురించి దైవప్రవక్త(స.అ) తన చివరి హజ్ తరువాత గదీర్ రోజున అలీ(అ.స)ను ఖలీఫాగా నియమించిన ఆ స్పష్ట ఆదేశాన్ని వ్యతిరేకించడానికి తీసుకున్న ముఖ్యమైన స్టాండింగ్ సంఘటన ఇది. ఈ సహాబీయులందరు ఆ రోజు అక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు ప్రకటించబడింది.
ఖిలాఫత్ పట్ల అన్సారుల మరియు ముహాజిరీనుల మధ్య అభిప్రాయభేదం ఉండేది. అయినా చివరికి దైవప్రవక్త(స.అ) సున్నత్
ను విడిచి అబూబక్ర్
 ఖిలాఫత్ నిర్ధారణ విషయంలో అందరూ ఏకమయ్యారు. ఒకవేళ ఈ క్రమంలో చాలా మంది చనిపోయినా సరే, అబూబక్ర్ యొక్క ఖిలాఫత్
ను వ్యతిరేకించిన వారు దైవప్రవక్త(స.అ)కు దగ్గర బంధువైనా[1] సరే అతనిని చంపేయాలి, ఖిలాఫత్ మాత్రం అబూబక్ర్ దే, అని నిర్ధారించుకున్నారు.
ఈ సంఘటనలో కూడా సహాబీయుల ఎక్కువ శాతం, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరాకరించడం, మరియు దానిని తమ అభిప్రాయాలకు అనుగుణం గా మార్చేయడంలో అబూబక్ర్ మరియు ఉమర్
ను సహకరించారు. వీళ్ళందరూ ఇజ్తిహాద్
ను సమర్ధించే వారని తెలుస్తుంది.
అలాగే ముస్లిముల తక్కువ సంఖ్య, దైవప్రవక్త(స.అ) సున్నత్
పై అమలు చేసి, అబూబక్ర్ యొక్క బైఅత్
ను నిరాకరించేవారుగా ఏర్పడింది. అనగా అలీ(అ.స) మరియు అతని షియాలు.
ఈ మూడు సంఘటనల తరువాత ఇస్లామీయ సొసైటీలో రెండు వర్గాలు లేదా రెండు ప్రత్యేకమైన పార్టీలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి దైవప్రవక్త(స.అ) సున్నత్
పై నడిచి దాని పై అమలు చేసేవారు. మరొకటి దైవప్రవక్త(స.అ) సున్నత్
ను సొంత అభిప్రాయాలకు అనుగుణంగా మార్చేసినవారు. ఎక్కువ మంది ఉన్న సమూహం, ప్రభుత్వం వరకు చేరాలని అనుకునేవారు, లేదా అందులో భాగాన్ని ఆశించేవారు. అంటే ఒక పార్టీ అనగా అలీ(అ.స) మరియు అతని షియాలు సున్నీయులయ్యారు మరియు రెండవ పార్టీ అనగా అబూబక్ర్, ఉమర్ మరియు వేరే సహాబీయులు ఇజ్తెహాదీయులయ్యారు (అనగా ఇస్లాం స్పష్ట ఆదేశాలకు వ్యతిరేకంగా సొంత అభిప్రాయాలను వెల్లడించేవారయ్యారు).
అబూబక్ర్ నాయకత్వంలో ఉన్న రెండవ పార్టీ, మొదటి యొక్క శ్రేష్ఠతను, హోదాను అంతం చేయాలన్న ఉద్యమాన్ని మొదలు పెట్టింది. మరియు తమ విరోధులను కించపరచాలని ఎన్నో చర్యలు చేశారు. అవి:

1. ఆర్థిక పరంగా దెబ్బతీయడం
అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రతిపక్ష పార్టీ యొక్క జీవనోపాధి మరియు  ఆర్ధిక ఆదాయం పై దాడి చేసింది. అబూబక్ర్ మరియు ఉమర్
లు జనాబె ఫాతెమా జహ్రా(స.అ) రైతులను “ఫదక్” నుండి బయటకు నెట్టి[2] దానిని ముస్లింల సోత్తుగా నిర్ధారించి ఇలా అన్నారు, ఈ ఫిదక్ కేవలం ఫాతెమా(స.అ)కే ప్రత్యేకించ బడిందికాదు. వాస్తవానికి ఆమెకు అతని తండ్రి ఇచ్చారు. అబూబక్ర్, ఫాతెమా (స.అ)ను దైవప్రవక్త(స.అ)లకు ఆస్తి ఉండదు, అని చెప్పి ఆమె తండ్రి ఆస్తి నుండి దూరం చేశారు. ఆ తరువాత ఆమెకు ఇవ్వబడే ఖుమ్స్
ను కూడా ఆపివేశారు. వాస్తవానికి దైవప్రవక్త(స.అ) మరియు అతని అహ్లెబైత్(అ.స)ల పై “సద్ఖా” హరామ్ కావడం వల్ల “ఖుమ్స్” తనకు, తన అహ్లెబైత్(అ.స)లతో ప్రత్యేకించుకున్నారు.
అలా అలీ(అ.స)ను ఆర్థికపరంగా బలహీనులు చేశారు. మంచి లాభాన్ని తెచ్చిపెట్టే “ఫిదక్”ను దోచేసుకున్నారు. అతని పినతండ్రి ఆస్తి నుండి దూరం చేశారు. ఖుమ్స్
ను ఆపివేశారు. అలా అలీ(అ.స), అతని భార్యాబిడ్డలు కడుపు నింపుకోవడానికి నిస్సహాయులయ్యారు. మరి ఇదే మాట అబూబక్ర్, జనాబె జహ్రా(స.అ)తో చెప్పారు: “అవును! ఖమ్స్ మీ హక్కే, కాని నేను ఈ క్రమంలో దైవప్రవక్త(స.అ) విధానం పై అమలు చేస్తాను. మీ తిండీ బట్టల ఏర్పాటు చేయబ డుతుంది”.
హజ్రత్ అలీ(అ.స) విధేయులు మరియు అనుచరులలో ఎక్కువ శాతం బానిసలదే, అని ఇంతకు ముందు కూడా మేము చెప్పాము. వాళ్ళ వద్ద ధనం, సంపద లాంటివి ఉండేవి కావు. మరియు అధికారంలో ఉన్న పార్టీకు కూడా వారి ద్వార భయం ఉండేదికాదు. ప్రజలు అలవాటు ప్రకారం ధనవంతుల ముందు నమ్రతగా ఉంటారు మరియు పేదవారిని హీనంగా చూస్తారు.[3] 

రిఫరెన్స్
1. దీనికి సాక్ష్యం ఫాతెమా జహ్రా(అ.స) యొక్క ఇంటిని కాల్చేస్తామని హెచ్చరించడం.
2. చారిత్రక పుస్తకాలలో “ఫదక్” యొక్క సంఘటన మరియు జనాబె ఫాతెమా(అ.స), అబూబక్ర్ పట్ల నిరాశ చెందడం మరియు అలాగే ఈ లోకాన్ని విడవడం ప్రసిధ్ధమైనవి.
3. షియయె వాఖెయి, సమావీ తీజానీ, పేజీ48-49.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15