.పవిత్ర ఖుర్ఆన్ దశల వారిగా 23 సంవత్సరాలలో వివిధ సంధర్భాలలో అవసరానికి బట్టి అవతరించబడింది.
ఖుర్ఆన్, దైవప్రవక్త[స.అ] యొక్క ఎప్పటికి మిగిలి ఉండిపోయే అద్భుతం. ఈ గ్రంథం జ్ఞాన సముద్రం. మనిషిని తీర్చిదిద్దే మరియు మానవత్వ శిక్షణా గ్రంథం. కాంతి, వెలుగు మరియు తత్వాజ్ఞానం గల గ్రంథం. సమర్థత, ఆలోచన, ప్రవీణత మరియు దైవ ఎరుక గల గ్రంథం.
ఖుర్ఆన్; విశ్వాసం, మంచి పనులు, జిహాద్ మరియు సమాజ సమానత్వం గల గ్రంథం. శుభవార్తలు, ప్రమాణాలు గల గ్రంథం. చరిత్రను సృషించిన గ్రంథం. రాజకీయం, రాజనీతి మరియు చట్టంగల గ్రంథం. ఎప్పటికి అంతకాని, అన్ని చోట్ల ఉన్న, ప్రతీ విషయం ఉన్న ఒక సంపూర్ణ గ్రంథం. ఈ గ్రంథం ఒక మార్గదర్శి, అల్లాహ్ ఉపదేశాలు, నింగి నుండి అవతరించబడ్డ దైవవాణి.
ఈ పవిత్ర ఖుర్ఆన్ దశల వారిగా 23 సంవత్సరాలలో వివిధ సంధర్భాలలో అవసరానికి బట్టి అవతరించబడింది. ఇస్లామీయ అహ్కాములు, సిద్ధాంతాలు, విశ్వాసాలు మరియు జ్ఞానం దైవవాణి రూపంలో దైవప్రవక్త[స.అ] పై అవతరింపబడేది, దైవప్రవక్త[స.అ] కూడ ఆ గ్రంథ ఆయత్లను ప్రజలకు చెప్పేవారు. దైవవాణిని లిఖించేవారు దానిని వ్రాసి భద్రపరిచేవారు. దైవవాణిని లిఖించేవారిని “కాతిబె వహీ”(దైవవాణి లేఖి) అనేవారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స].[ఉలూమె ఖుర్ఆన్, వహీ వివరణ అధ్యాయంలో]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మారెఫత్, ఉలూమె ఖుర్ఆన్, వహీ వివరణ అధ్యాయంలో
వ్యాఖ్యానించండి