సిరాత్ మరియు స్వర్గనరకాలు

బుధ, 12/08/2021 - 17:30

పరలోక స్థానాలలో మిగిలిని స్థానాలు అయిన సిరాత్ మరియు దాని రకాలు, స్వర్గం నరకాలతో పాటు అఅరాఫ్ స్థానం గురంచి సంక్షిప్త వివరణ...

సిరాత్ మరియు స్వర్గనరకాలు

ఇస్లాం దృష్టిలో మృత్యువు, ఈలోకం యొక్క చివరి స్థానం మరియు పరలోకం యొక్క మొదటి స్థానం. మరణించిన తరువాత కొన్ని స్థానాలు ఉంటాయి అవి ఈ క్రమంలో ఉంటాయి: మృత్యువు[1], సమాధి మరియు బర్జఖ్, ఖియామత్[2], లెక్క తీసుకోవడం[3], సిరాత్, స్వర్గ-నరకం-అఅరాఫ్. ఈ స్థానాలు అందరికీ వర్తిస్తాయి. మనిషి ఈలోకంలో చేసిన చర్యలను బట్టి పరలోకం స్థితి నిర్ణయించబడుతుంది. ఇవన్నీ కేవలం ఖుర్ఆన్ మరియు రివాయతుల ఆధారంగానే నిదర్శించబడతాయి. ఇక్కడ సిరాత్, స్వర్గం, నరకం మరియు అఅరాఫ్ గురించి తెలుసుకుందా:

సిరాత్
ఖియామత్ లో ఉన్న మరో స్థానం “సిరాత్” అనబడే మార్గం. దీని పైనుంచి అందరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలా వెళతారు అన్న విషయంలో వార్వారి విశ్వాసం యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. కొందరు చాలా త్వరగా దాని పైనుంచి వెళ్లిపోతారు. కొందరు తమ విశ్వాస బలహీనత వల్ల మెల్లమెల్లగా వెళతారు.
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: సిరాత్ అనగా అల్లాహ్ పట్ల జ్ఞానం. సిరాత్ రెండు రకాలు: ఇహలోక సిరాత్ మరియు పరలోక సిరాత్. ఇహలోక సిరాత్ అనగా అనుచరణ విధిగా నిర్ధారించబడిన ఇమామ్ యొక్క మార్గం. ఎవరైతే ఇహలోకంలో వారి గురించి తెలుసుకొని వారు చెప్పిన మార్గం పై నడిస్తే పరలోకంలో సిరాత్(నరకం యొక్క వంతెన) ను దాటుతారు. మరి ఎవరైతే ఇహలోకంలో ఇమామ్ ను గురించి తెలుసుకోలేదో పరలోక సిరాత్ పై కాళ్లు తడబడి మరియు నరకంలో పడతాడు[4]
ఈ విధంగా మనిషి ఇహలోక సిరాత్ పై సరిగా నడిస్తే పరలోక సిరాత్ ను చాలా సులువుగా దాటగలడు; అనగా మనిషి నిత్యం సిరాత్ వంతెన పై నడుస్తున్నట్లే. పరలోకంలో మన జీవితం ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి సరైనా పరిమాణం ఇహలోక మన జీవన విధానం. మనం మన ప్రభువు చూపిన మార్గం పై నడుస్తున్నట్లైతే పరలోకంలో సిరాత్ మార్గం కూడా చాలా సులభంగా దాటేయవచ్చు.  

స్వర్గం మరియు నరకం
మానవుడి చివరి స్థానం, స్వర్గం మరియు నరకం. ప్రతీ మనిషి దీని పై అంతం అవుతుంది. స్వర్గం అన్ని విధాల అనుగ్రహాలతో నింది ఉండే ప్రదేశం. నరకం అన్ని విధాల కష్టాలతో, బాధలతో మరియు నిరాశలతో కూడి ఉన్న నిలయం. స్వర్గ నరకాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అని చాలా రివాయతులు ఉల్లేఖిస్తున్నాయి.  
ఇవి కాకుండా మరో ప్రదేశం ఉంటుంది దానిని అఅరాఫ్ అంటారు. అది స్వర్గం మరియు నరకం మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అక్కడ నుంచి స్వర్గనరకాలను చూడవచ్చు. వారికి అక్కడ ఉన్న వారందరి గురించి తెలుస్తుంది. ఇది వారి యొక్క పరిపూర్ణ ఆత్మ వల్ల వారికి అవి ప్రసాదించబడతాయి. ప్రవక్తలు, ఔలియాలు, ఉమ్మత్ యొక్క సజ్జనులు అఅరాఫ్ కు చెందిన వారు.
ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: అఅరాఫ్ పై ఉన్నవారు ఎంతోమందిని (నరకవాసుల్ని) వారి  ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ, ఇలా అంటారు: “మీ వర్గాలుగానీ, మీ బడాయిగానీ మీకు ఏమాత్రం పనికి రాలేదే!”[సూరయె అఅరాఫ్, ఆయత్48]

రివాయతులలో అఅరాఫ్ ప్రదేశం గురించి సూచిండబడి ఉంది. ఇక్కడ ఒక హదీసును ప్రదర్శిస్తున్నాము. 
సల్మానె ఫార్సీ ఉల్లేఖనం: పదిసార్లు కన్నా ఎక్కువ దైవప్రవక్త(స.అ) నుంచి ఇలా చెబుతుండగా విన్నాను: “ఓ అలీ! నీవు మరియు నీ తరువాత వచ్చే ఇమాములు, అఅరాఫ్ అస్హాబులు స్వర్గం మరియు నరకం మధ్యలో ఉంటారు. మీ పట్ల జ్ఞానం కలిగివున్న వారు, స్వర్గంలో ప్రవేశిస్తాడు మరియు నీ విలాయత్ ను నిరాకరించిన వాడు నరకంలో ప్రవేశిస్తాడు”[5]

రిఫరెన్స్
1. http://te.btid.org/node/2041
2. http://te.btid.org/node/2042
3. http://te.btid.org/node/2043
4. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ66.
5. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ337.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Jazakallah Qibla
First time I listen about Aaraaf. Thanks agha.
We always read your topics and learn many new things. Thanks to your team.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17