నాలుక మరియు నోరు గురించి పవిత్ర మాసులుము ఏమని ఉపదేశిస్తున్నారు అన్న విషయం పై కొన్ని హదీసుల నిదర్శనం...

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: అల్లాహ్ ఒక దాసుడ్ని అవమానించాలనుకున్నప్పుడు అతడ్ని అతడి నాలుక(నోరు)తో అవమానిస్తాడు.[1]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: నీ నాలుక నిన్ను నిత్య కారాగారంలో పడేయక ముందే దాన్ని నువ్వు బంధించు[2]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: స్వర్గ అర్హులు నాలుగు సంకేతాలు కలిగి ఉంటారు: నవ్వుతూ ఉండే ముఖం, మాటలో సున్నితం, కారుణ్య హృదయం మరియు సహాయం చేసే గుణం.[3]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహంగా ప్రజలు అతడి చెడు నోటి ద్వార భయపడే వ్యక్తి, అల్లాహ్ సృష్టిలో అత్యంత అసహ్యకరమైన వ్యక్తి.[4]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: నాలుక(నోరు)ను అదుపులో పెట్టుకోనివాడు పాపముల నుంచి సురక్షితంగా లేనట్లే.[5]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహంగా ఈ నాలుక(నోరు) మంచిచెడ్డలన్నింటి తాళంచెవి... అందుకని వెండిబంగార (సంచి)ని కట్టిపెట్టుకున్నట్లు విశ్వాసి తన నాలుక(నోరు)ను కట్టి పెట్టాలి.[6]
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(స.అ) ఉల్లేఖనం: నాలుక పట్ల మన బాధ్యత, తప్పుడు మాటలకు దూరంగా ఉంచడం, మంచిని అలవాటు చేయడం, వ్యర్థమాటలను విడిచిపెట్టడం, ప్రజలకు మంచి చేయడం మరియు వారితో మంచిగా మాట్లాడడం.[7]
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: విశ్వాసి, సురక్షితంగా ఉండడానికి మౌనంగా ఉంటాడు మరియు లాభం పొందడానికి మాట్లాడతాడు.[8]
రిఫరెన్స్
1. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం75, పేజీ228, హదీస్101.
2. గురరుల్ హికమ్, పేజీ214, హదీస్4180.
3. అమాలీ, తూసీ, పీ638. మజ్మూఅయె వర్రామ్, భాగం2, పేజీ91.
4. కాఫీ(తా-ఇస్లామియహ్) భాగం2, పేజీ323.
5. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ298-బిహారుల్ అన్వార్(తా-బీరూత్) భాగం75, పేజీ178.
6. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ298.
7. అమాలీ, సదీఖ్, పేజీ 368. ఖిసాల్, పేజీ566. మకారిముల్ అఖ్లాఖ్, పేజీ419.
8. కాఫీ(తా-ఇస్లామియహ్) భాగం2, పేజీ231.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి