.
ఖుర్ఆన్లో 114 “సూరహ్”లు ఉన్నాయి. 6 వేల కన్న ఎక్కువ “ఆయత్”లు ఉన్నాయి. పూర్తి ఖుర్ఆన్ను 30 “జుజ్”లుగా విభజించారు. ప్రతీ “జుజ్”లో నాలుగు భాగాలు(హిజ్బ్) ఉంటాయి. ప్రతీ సూరహ్ కొన్ని ఆయత్లతో కూడి ఉంటుంది. ఖుర్ఆన్ యొక్క 9 వ సూరహ్ అయిన సూరయే “తౌబహ్” తప్ప ప్రతీ సూరహ్ “బిస్మిల్లాహ్”తో మొదలౌతుంది. సూరయే బఖరహ్ సూరహ్ లన్నింటిలో పొడవైన సూరహ్, అందులో 286 ఆయత్లు ఉన్నాయి. మరి ఖురఆన్ యొక్క అతి చిన్న సూరహ్, సూరయే కౌసర్ ఇందులో కేవలం 3 ఆయత్లు ఉన్నాయి.
ఆయత్లు దశల వారిగా అవతరించబడేవి. వాటిని ఒకటి తరువాత ఒకటి లిఖిస్తూ ఉండేవారు. దైవవాణిని లిఖించేవారు “బిస్మిల్లాహ్” రానంత వరకు ఆయత్లను వరుసగ అదే సూరహ్ పేరుతో లిఖించేవారు. ఎక్కువగా ఆయత్ల క్రమం అవతరించబడిన విధంగానే ఉండేది కేవలం కొన్ని సందర్భాలలో తప్ప, అదెప్పుడంటే దైవప్రవక్త[స.అ] దైవవాణి అవతరించబడిన తరువాత ఈ ఆయత్లను ఫలానా సూరహ్లో ఫలానా ఆయత్ ముందో లేక తరువాతో లిఖించమని చెప్పినప్పుడు తప్ప. [ఉలూమె ఖుర్ఆన్, వహీ వివరణ అధ్యాయంలో]
రిఫ్రెన్స్
ఉలూమె ఖుర్ఆన్, ఆయతుల్లాహ్ మారెఫత్, వహీ వివరణ అధ్యాయంలో
వ్యాఖ్యానించండి