షియా యొక్క ఇమాముల విశ్లేషణ-1

బుధ, 12/29/2021 - 15:14

దైవప్రవక్త(స.అ) చాలా సందర్భాలలో పవిత్ర ఇమాముల “ఇమామత్ పదవి” పై స్పష్టంగా నస్స్‌ను ప్రవచించారు. కొన్ని రివాయత్
లలో పేర్లు వెల్లడించి వారి గురించి చెప్పారు. ఆ రివాయత్‌లను షియా మరియు అహ్లె సున్నత్ ఉలమాలందరూ ప్రవచించారు...

షియా యొక్క ఇమాముల విశ్లేషణ-1

షియాలు, అహ్లెబైత్(అ.స)ల నుండి 12 ఇమాముల, ఇమామత్ అధికారాన్ని విశ్వసిస్తారు. వారిలో మొదటి వారు “అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)” ఆ తరువాత అతని కుమారుడు హసన్(అ.స), అతని తరువాత హుసైన్(అ.స) మరియు ఆ తరువాత ఇమామ్ హుసైన్(అ.స) గారి సంతానం నుండి 9 పవిత్ర ఇమాములు.
దైవప్రవక్త(స.అ) చాలా సందర్భాలలో ఇమాముల “ఇమామత్ పదవి” పై స్పష్టంగా, మరియు సంకేతముగా నస్స్‌ను ప్రవచించారు. కొన్ని రివాయత్
లలో పేర్లు వెల్లడించి వారి గురించి చెప్పారు. ఆ రివాయత్‌లను షియా మరియు అహ్లె సున్నత్ ఉలమాలందరూ ప్రవచించారు.
అహ్లెసున్నత్‌లలో కొందరు ఈ రివాయత్‌ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తారు. వాళ్లు ఇలా అంటూ ఉంటారు;  “దైవప్రవక్త(స.అ) లేనటువంటి విషయాల గురించి ఎలా చెప్పగలరు”?, మరి ఖుర్ఆన్ కూడా ఇలా ప్రవచిస్తుంది:
وَلَوۡ كُنتُ أَعۡلَمُ ٱلۡغَيۡبَ لَٱسۡتَكۡثَرۡتُ مِنَ ٱلۡخَيۡرِ وَمَا مَسَّنِيَ ٱلسُّوٓءُ
అనువాదం: ఒకవేళ నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాడిని. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు.[అల్ ఆరాఫ్ సూరా:7, ఆయత్:188]

వాళ్ళ ఈ అభ్యంతరం పై మా జవాబు;
ఈ ఆయత్ దైవప్రవక్త(స.అ) యొక్క దివ్యదృష్టిని నిరాకరించడం లేదు. ఈ ఆయత్ దైవప్రవక్త(స.అ)తో ప్రళయం ఎప్పుడు వస్తుంది, అని ప్రశ్నించే ఆ ముష్రికులకు జవాబుగా దాని సమయం అల్లాహ్‌కే తెలుసు అని అవతరించబడింది.
ఖుర్ఆన్‌లో ఇలా ప్రవచించబడి ఉంది: عَٰلِمُ ٱلۡغَيۡبِ فَلَا يُظۡهِرُ عَلَىٰ غَيۡبِهِۦٓ أَحَدًا إِلَّا مَنِ ٱرۡتَضَىٰ مِن رَّسُولٖ
అనువాదం: ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు తాను ఎన్నుకున్న ప్రవక్తకు తప్ప.[జిన్ సూరా:72, ఆయత్:26,27]
ఈ ఆయత్ ద్వార స్పష్టంగా తెలుస్తుంది, అల్లాహ్ తన ప్రవక్తలలో ఇష్టం వచ్చిన వారిని అగోచర జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలా తోటి ఖైదీయులతో జనాబె యూసుఫ్ యొక్క ప్రచనమే దీనికి మంచి ఉదాహారణ. ఆయత్:
لَا يَأۡتِيكُمَا طَعَامٞ تُرۡزَقَانِهِۦٓ إِلَّا نَبَّأۡتُكُمَا بِتَأۡوِيلِهِۦ قَبۡلَ أَن يَأۡتِيَكُمَاۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّيٓ
అనువాదం: “ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీవద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను; ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన జ్ఞానమే.[బఖరా సూరా:12, ఆయత్:37]

మరో చోట ఇలా ప్రవచించెను:
فَوَجَدَا عَبۡدٗا مِّنۡ عِبَادِنَآ ءَاتَيۡنَٰهُ رَحۡمَةٗ مِّنۡ عِندِنَا وَعَلَّمۡنَٰهُ مِن لَّدُنَّا عِلۡمٗا
అనువాదం: అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము.[కహఫ్ సూరా:18, ఆయత్:65]
సున్నీ, షియా ముస్లిముల మధ్య “దైవప్రవక్త(స.అ)కు అగోచర జ్ఞానం ఉంది” అన్న విషయం పై ఎటువంటి అభిప్రాయభేదం లేదు. చరిత్రకారులు అగోచర జ్ఞానానికి సంబంధించిన సంఘటనలు వ్రాశారు. వాటి నుండి కొన్ని ఇవి:
అమ్మార్ నిన్ను విద్రోహ సమూహం చంపుతుంది.
హజ్రత్ అలీ(అ.స)తో ఇలా అన్నారు: “దౌర్భాగ్యపు వ్యక్తి నీ తల పై కత్తితో దాడిచేస్తాడు, మరియు నీ గడ్డం రక్తంతో ఎరుపైపోతుంది”
ఇమామ్ హసన్(అ.స) గురించి ఇల అన్నారు: “నిస్సందేహంగా నా కుమారుడు హసన్(అ.స) ద్వార అల్లాహ్ ముస్లిముల రెండు పెద్ద సమూహాల మధ్య సంధి చేయిస్తాడు”
అబూజర్ గురించి ఇలా ప్రవచించారు: తొందరలోనే దీనత్వములో అతని మరణం సంభవిస్తుంది.
ఇవే కాకుండా మరెన్నో సంఘటనాలు మరియు రివాయత్
లు ఉన్నాయి. “బుఖారీ మరియు ముస్లిం”లు మరియు వేరే ముహద్దిసీన్‌లు ఒక ప్రత్యేక హదీస్
ను ఉల్లేఖించినట్లు. అందులో దైవప్రవక్త(స.అ) తన తరువాత 12 ఇమాము గురించి శుభవార్తను ఇచ్చారు. దైవప్రవక్త(స.అ) ప్రవచనం: “నా తరువాత 12 ఇమాములు ఉంటారు అందరు ఖురైషీయులు అయి ఉంటారు”
కొన్ని రివాయత్‌లలో “ఖురైషీయుల”కు బదులు “బనీ హాషిం” అన్న పదం వచ్చంది. అనగా ఆ ఇమాములందరూ “బనీ హాషిం”కు చెందిన వారు అని.
అహ్లెసున్నత్‌లు తమ “సహాహ్” మరియు “మసానీద్” గ్రంథాలలో ఇలాంటి హదీసులు ఉల్లేఖించారు. మరియు 12 ఇమాముల ఇమామత్ పదవి పై స్పష్టమైన సాక్ష్యం ఉన్నటువంటి ఆ హదీసులను సరైనవిగా అంగీకరించారు. చాలా ఉలమాలు వాటిని నిరూపించారు కూడా.

రిఫరెన్స్
అహ్లె సున్నతె వాఖెయీ, తీజానీ సమావీ, పేజీ109، 110.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24