.ఖుర్ఆన్ ఉపదేశాలు మానవ సమాజంలో ఆచరణలో తీసుకొస్తే ఆ సమాజమే ఇక తిరుగులేని సమాజంగా మారుతుంది.
ఖుర్ఆన్ ను పఠించడం, దానిని అర్ధం చేసుకోవడం, దాని ఉపదేశాల పై అమలు చేయడం ప్రతి ముస్లిం చేయవలసిన పని. ఖుర్ఆన్ ఉపదేశాలు తెలుసుకొని వాటిని సమాజంలో ఆచరణలో తీసుకొస్తే ఆ సమాజమే ఇక తిరుగులేని సమాజంగా మారుతుంది.
ఖుర్ఆన్ యొక్క వివరణ మరియు దాని యదార్ధ సముద్రపు అలల భావార్ధాల కైఫీయత్తు మరియు దాని స్వచ్చమైన, కల్పితం లేని జ్ఞాన నీళ్ళతో అజ్ఞాన దాహాన్ని దూరం చేసుకోవడానికి వ్యాఖ్యగ్రంథాలు ఉన్నాయి. కాని మొత్తానికి ఎంతో కంతా పూర్తి ఖుర్ఆన్ నుండి ముఖ్యవిషయాలు సంక్షిప్తంగానైనా ప్రతీ ముస్లిముకు తెలిసి ఉండడం అవసరం. మీలో ఎవరికైనా “మేము ఖుర్ఆన్ గురించి సంక్షిప్తంగానే తెలుసుకోవాలని అనుకుంటున్నాము కాని ఎక్కడ నుండి మొదలు పెట్టాలి” అనే ప్రశ్న రావచ్చు. అందుకు మనకు మనమే కొన్ని ప్రశ్నలు సృష్టించుకోవాలి ఉదాహారణకు: ఈ ఖుర్ఆన్ ఏమిటి?, దీని లక్ష్యం ఏమిటి?, దాని కార్యక్రమపట్టిక ఏమిటి?, ఇది ఎందకు పనికొస్తుంది?, ఇందులో ఏ ఏ విషయాలున్నాయి? అన్న కొన్ని ప్రశ్నలు సృష్టించుకొని వాటి జవాబులు తెలుకునేందుకు ఒక్కొక్కటిగా ముందుకు వెళ్ళాలి. అప్పడు మనకు వాటి జవాబులు తెలుస్తాయి దాంతో ఖుర్ఆన్ గురించి మనకు తెలుస్తుంది.
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya...
Mashaallah
Mashaallah
Mashaallah
Mashaallah
Mashaallah
Jazakallah...
వ్యాఖ్యానించండి