ఇస్లామీయ ప్రముఖ ముజ్తహిదీన్ లలో ఒకరైన ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ(ర.అ) గురించి సంక్షిప్తంగా...
ఆయతుల్లాహ్ లుత్ఫుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ 1918(లేదా 1919)లో జన్మించారు.
ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ తండ్రి: వారి తండ్రి గొప్ప ఆరిఫ్ మరియు పండితులు. వారి పేరు ఆయతుల్లాహ్ ఆఖుంద్ ముల్లా “మొహమ్మద్ జవాద్ సాఫీ”, వారు మంచి పరిశోధకులు, రచయిత మరియు ఉపాధ్యాయులే కాకుండా వివిధ ఇస్లామీయ విధ్యలలో నైపుణ్యం కలిగి ఉండేవారు ఉదా; ఫిఖా, ఉసూల్, కలామ్, అఖ్లాఖ్, హదీస్ మొ॥, అలాగే కొన్ని కళలలో కూడా నైపుణ్యం కలిగివుండేవారు ఉదా; కవిత్వం, ఖుష్ నవీసీ - ఖత్తాతీ(Calligraphy) మొ॥. వారు చాలా ప్రతిష్టతలు కలిగి ఉండేవారు. మంచిని ఆదేశించడం మరియు చెడు నుంచి ఆపడంలో ముందు ఉండేవారు. దుర్మార్గులకు ఎదురు తిరిగేవారు. గుల్ పాయెగాన్ ప్రజలు వారి మాటను పాటించేవారు. దౌర్జన్యులను తగిన విధంగా గుణపాఠం చెప్పేవారు. వారు షరా వ్యతిరేక చర్యల పట్ల మరియు బిద్అత్ లకు అడ్డుగా నిలిచేవారు. బ్రతికున్నంత కాలం ఇస్లాం గౌరవం రక్షణ మరియు అల్లాహ్ పట్ల భయభక్తులతో ఉన్నారు. వారు రజబ్ మాసం 25వ తేదీ, హిజ్రీ యొక్క 1378వ సంవత్సరంలో మరణించారు.
ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ తల్లి: వారి తల్లి కూడా ఆదర్శకరమైన స్ర్తీ, కవి మరియు అహ్లె బైత్(అ.స) విలాయత్ కోసం తనను అర్పించుకున్న స్ర్తీ. ఆమె మర్హూమ్ ఆయతుల్లాహ్ ఆఖుంద్ ముల్లా మొహమ్మద్ అలీ కుమార్తె. ఆమె లో ఉండే ఉత్తమ గుణాలు., ఆరాధన, స్వచ్చత, ధర్మనిష్ట, అల్లాహ్ పట్ల మంచి జ్ఞానం, ధైర్యం, మాటలో స్పష్టత, భర్త పట్ల బాధ్యత నిర్వర్తనం, పిల్లల శిక్షణ పట్ల శ్రద్ధ, అల్లాహ్ స్మరణ, దుఆ మరియు నమాజె షబ్ మొ॥ అని చెప్పవచ్చు.
విద్య
ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ, అదబియాత్, తఫ్సీరె ఖుర్ఆన్, హదీస్ మరియు సత్హ్(మకాసిబ్ మరియు కిఫాయా) గుల్ పాయెగాన్ లో ముందుగా ఆఖుంద్ ముల్లా అబుల్ ఖాసిమ్ (ఖుతుబ్ గా ప్రఖ్యాతి చెందిన వారు) ఆ తరువాత వారి తండ్రి వద్ద విద్యాభ్యాసం చేశారు. హిజ్రీ యొక్క1360వ సంవత్సరంలో ఖుమ్ కు వచ్చారు.
గొప్ప గొప్ప ఉపాధ్యాయుల విజ్ఞాన సభలలో హాజరు అయ్యేవారు. పరిశోధన, విద్యాబోధన మరియు పుస్తకాలు చదవడం ద్వార తన జ్ఞానాన్ని పెంచుకొని అగ్ర స్థానానికి చేరారు. వారు కొంత కాలం జ్ఞాన ద్వారం(బాబె మదీనతుల్ ఇల్మ్)గా బిరుదు కలిగివున్న హజ్రత్ అలీ(అ.స) యొక్క పవిత్ర హరమ్(సమాధి) వున్న నజఫె అష్రఫ్(ఇరాఖ్)లో ఐదుగురు గొప్ప ఫుఖా మరియు మరాజె సన్నిధిలో గడిపారు.
ఖుమ్ లో వారి ఉపాధ్యాయులు
1. హాజ్ సయ్యద్ మొహమ్మద్ తఖీ ఖాన్సారీ
2. హజ్ సయ్యద్ మొహమ్మద్ హుజ్జత్ కూహ్ కుమ్రయీ
3. హజ్ సయ్యద్ సద్రూద్దీన్ సద్ర్ ఆములీ
4. హాజ్ సయ్యద్ మొహమ్మద్ మూసవీ గుల్ పాయెగానీ
నజఫె అష్రఫ్ లో
1. హాజ్ షేఖ్ మొహమ్మద్ కాజిమ్ షీరాజీ
2. హాజ్ సయ్యద్ జమాలుద్దీన్ హాషిమీ గుల్ పాయెగానీ
3. హాజ్ షేఖ్ మొహమ్మద్ అలీ కాజిమీ ఖురాసానీ
అయితే వారిలో జ్ఞాన మరియు ఆలోచన పరంగా ఉనికి నిర్మాణం అవ్వడానికీ కారణం మరియు అలాగే వారి జ్ఞాన ఉనికి ఆయనతో పూర్తిగా సంబంధం కలిగివుండేది, వారు మరెవరో కాదు., తన కాలపు షియా వర్గం నాయకుడు ఆయతుల్లాహ్ అల్ ఉజ్మా “బురుజర్దీ”. వారి వద్ద ఆయతుల్లాహ్ సాఫీ గుల్ఫాయెగానీ, 17 సంవత్సరాలు వివిధ రూపాలలో, వివిధ సందర్బాలలో విద్యను పొందారు. ఆయతుల్లాహ్ సాఫీ గుల్ఫాయెగానీ, వారి యొక్క ప్రత్యేక ఫత్వా ఇచ్చేవారి అనుచరులలో ఒక్కరిగా ఉండేవారు. చాలా అహ్కాముల మరియు పరిశోధనలలో ఆయతుల్లాహ్ బురుజర్దీ, ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ ని అడిగి తెలుసుకోమని పంపెవారు.
ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ చాలా కాలం వరకు దర్సె ఖారిజ్(ఇజ్తెహాద్ క్రమంలో జరిగే క్లాసెస్) విద్యార్ధుల పరీక్షలు నిర్వర్తించేవారు.
1979క్రీ.లో ఆయతుల్లాహ్ గుల్ పాయెగానీ మరియు ఆయతుల్లాహ్ హాజ్ షేక్ ముర్తజా హాయెరీ(ర.అ) కేంద్ర రాష్ట్రం నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చట్టం వ్యవస్థాపన కోసం మజ్లిసె ఖిబ్రగాన్(నిపుణుల మండలి) ప్రాతినిథ్యులుగా నియమించబడ్డారు. అన్ని రంగాలలో అవి మతపరమైనవైనగా గానీ లేదా రాజకీయ పరమైనగానీ నిత్యం తోటి నిపుణుల మండలి సభ్యులు వారి మాటను గౌరవించేవారు. ఒకసారి ఆయతుల్లాహ్ హాయెరీ(ర.అ) కొన్ని కారణాల వల్ల రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు వారు బహిరంగంగా ఇలా ప్రకటించారు: “ఆయతుల్లాహ్ సాఫీ మాటే నా మాట”
ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయిన ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), వారిని షూరా-ఎ-నిగహ్బానీ(Guardian Council) గా నిర్ధారించారు. కొంతకాలం ఆ మండలి కార్యదర్శి బాధ్యతలు వహించారు. ఇస్లాం ఉనికి రక్షణ, అల్లాహ్ ఆదేశాల పట్ల జాగ్రత లాంటి అంశాలలో వారి ప్రయత్నాలు మరియు వారి మాటలు ప్రఖ్యాతి చెందినవి.
వారి రచనలు
వారి రచనలు 150 సంపుటలకు మించినవి. వాటిలో ముఖ్యమైనవి:
1. ముంతఖబుల్ అసర్ ఫిల్ ఇమామిస్సాని అషర్(అ.స) – 3 సంపుటములు
2. మఅల్ ఖతీబ్ ఫీ ఖుతూతిహిల్ అరీజహ్
3. సౌతుల్ హఖ్ఖి వ దఅవతుస్సిద్ఖి
4. లమహాతున్ ఫిల్ కితాబి వల్ హదీసి వల్ మజ్హబి – 3 సంపుటములు
5. బయానుల్ ఉసూలి – 3 సంపుటములు
6. అమానుల్ ఉమ్మతి మినజ్జలాలి వల్ ఇఖ్తిలాఫ్
7. అల్ అఖీదతు బిల్ మహ్దియహ్
8. జిలావుల్ బసర్ లిమన్ యతవల్లా అల్ ఆయిమతు అల్ ఇస్న అషర్
9. అల్ ఖుర్ఆన్ మసూను అనిత్ తహ్రీఫ్
10. రిసాతలు ఖయ్యిమహ్ హౌల ఇస్మతిల్ అంబియాయి వల్ అయిమ్మహ్
11. ఉన్వాను సహీఫతిల్ మొమిన్
12. సిబ్తుల్ ముస్తఫా
13. ఇర్సుజ్ జౌజహ్
14. అల్ తఅజీజ్; అహ్కాముహు వ ముల్హఖాతుహు
15. అల్ అహ్కాముష్ షర్ఇయహ్ సాబితతున్ లా తతగయ్యర్
16. మఅష్ షేఖ్ జాదల్ హఖ్ ఫీ ఇర్సిల్ ఉస్బహ్
17. ఇరాన్ తస్మఅ ఫ తుజీబు
18. రిసాలతు ఫీ హుక్మి నకూల్ అల్ ముద్దయీ అలైహి అనిల్ యమీన్
19. రిసాతలు ఫీ తఫ్సీరి ఆయతిత్ తత్హీర్
20. రిసాలతు ఫిల్ బదఅ
ఆయతుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ ఆరోగ్యం బాగు లేకపోవడంతో వారిని జనవరి 27వ తేది 2022 గురువారం రోజు ఖుమ్ యొక్క ఒక ఆసుపత్రిలో చేర్చారు. ఫిబ్రవరీ 1వ తేది 2022 న ఆసుపత్రిలో మరణించారు.
రిఫరెన్స్
https://btid.org/fa/news/199273
https://www.hawzahnews.com/news/1005303/زندگی-نامه-حضرت-آیت-الله-صافی-گلپایگانی
వ్యాఖ్యలు
Jazakallah
Thanks for brief about Ayatullah.
వ్యాఖ్యానించండి