దహె ఫజ్ర్

శని, 02/05/2022 - 19:57

ఇరాన్ దేశం యొక్క ప్రత్యేక క్యాలండర్ ప్రకారం 11వ మాసం అయిన “బహ్మన్” యొక్క 12వ తేదీ 1357వ సంవత్సరం ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ఇరాన్ దేశానికి తిరిగి వచ్చిన రోజు...

దహె ఫజ్ర్

ఇరాన్ దేశం యొక్క ప్రత్యేక క్యాలండర్ ప్రకారం 11వ మాసం అయిన “బహ్మన్” యొక్క 12వ తేదీ 1357వ సంవత్సరం ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) ఇరాన్ దేశానికి తిరిగి వచ్చిన రోజు. వారు వారి దేశబహిష్కరణ యొక్క 14 సంవత్సరాల తరువాత ప్రజలు అపూర్వ స్వాగతం ద్వారా తిరిగి ఇరాన్ తిరిగి రావడంతో ఇరాన్ ఇస్లామీయ రిపబ్లిక్ యొక్క “దహె ఫజ్ర్” మొదలయ్యింది.

బహ్మన్ నెల 12వ తేదీ విశ్వాసాల అంకురార్పణ దినం
పహ్లవీ మరియు దౌర్జన్య అధికారుల అధికారం సుధీర్ఘ కాలం వరకు ఉండడంతో, మెల్ల మెల్లగా విశ్వాసం యొక్క కాంతి ప్రజల హృదయాల నుంచి తొలగిపోయింది. దీన్ కేలవం నోటి మాట వరకు మాత్రమే ఉండి పోయింది. ఇస్లాం ఆదేశాలు సమాజంలో కనిపించేవి కావు.
ఒకవేళ ఇస్లాం ఆదేశాల పట్ల అమలు ఉన్నా అది కేవలం గుప్త చర్యగా ఉండిపోయింది. కాని బహ్మన్ 12వ తేదీ ఇస్లామీయ విప్లవం ద్వార ప్రజలలో ఆశల మెరుపులు ముఖ్యంగా యువకులలో ప్రాణం పోసుకుంది. అందరు కలిసి కట్టుగా ఇస్లామీయ విప్లవం కోసం పోరాడారు.
విదేశీయులు కొంతమంది స్వదేశ అధికారులతో చేతులు కలిసి ఇరాన్ ముస్లిముల పై అధికారం చేయడం మొదలు పెట్టారు. వారిని భయానికి గురి చేసి వారి నుంచి ఆత్మనమ్మకం పోయేటట్లు చేశారు. వారి నుంచే ఒక గొప్ప వ్యక్తి ద్వార మెల్లమెల్లగా ఆ నమ్మకం తిరిగి రావడం మొదలయ్యింది. అతడు గర్వం మరియు గౌరవం ఇరాన్ వాసులకు కానుకగా తీసుకొచ్చారు. విదేశీయుల చేతులను ముస్లిములకు చేరుకోకుండా నరికి స్థిరత్వం యొక్క రుచిని చూపించాడు.
బహ్మన్ యొక్క 12వ తేదీన, దేశంలోని అవినీతి మూలాలపై తొలి అక్షతలు పడ్డాయి. విప్లవ రైలు బయలుదేరింది; అయితే కపటవాదులను, అక్రమార్కులను తెరపైకి తేవడానికి ఇంకా సమయం పడుతుంది.

బహ్మన్ 12వ తేదీ ఇస్లాం యొక్క శక్తి ఆరంభం అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “చూడండి! ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. మరి అల్లాహ్ తప్ప మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మీకు సహాయమూ అందదు.”[సూరయె హూద్, ఆయత్113]
పహ్లవీ అధికారం విధేశీయుల చేతుల్లో కీలుబొమ్మగా మారింది. పూర్తిగా వాళ్లపై ఆధరాపడిపోయారు. ఇదే ఇరాన్ యొక్క ప్రజల వ్యక్తిగత అవమానానికి గురి అయ్యారు. వాళ్లలో పిరికితనం మరియు అధైర్యం ఏర్పడింది. స్వీయ నిరాశకు గురి అయ్యారు.
స్వీయ నిరాశ ఒక రకమైన మానసిక రోగం. దాంతో మనిషి తన శక్తి మరియు ప్రతిష్టతను కోల్పోతాడు. అలాగే తన స్థిరత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కూడా కోల్పోతాడు. అది మెల్లమెల్లగా అవమానానికి దారి తీస్తుంది[1]
సుప్రీమ్ లీడర్ ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ.హు) ఇలా అన్నారు: “12వ తేదీ ఒక విధంగా, ఇస్లాం శక్తి యొక్క ఆరంభం”[2]

శత్రువుల నిత్య ప్రయత్నం
ఇస్లామీయ విప్లవ విజయం అనంతరం షియా అధికారం వచ్చిన తరువాత, ఇస్లామీయ శత్రువులు వారితో యుద్ధం మొదలు పెట్టారు. శత్రువులు ఏకమయ్యారు. ఖుర్ఆన్ ఇలాంటి శత్రుత్వం గురించి ఇలా సూచించెను: “నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం (అంటే మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటువేసి) కూర్చుంటాను.[సూరయె అఅరాఫ్, ఆయత్16]
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా అన్నారు.. సిరాత్ అనగా అహ్లెబైత్(సఅ) యొక్క మార్గం.[3] ఆ తరువాత ఆయత్ లో షైతాన్ యొక్క చొరబడే మార్గలను సూచించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఈ ఆయత్ యొక్క అర్థం ఇలా అవుతుంది: ఎప్పటివరకు అయితే మానవులు రుజుమార్గం(అహ్లెబైత్ విలాయత్ మార్గం)లో నడవరో శత్రువులు వాళ్లని ఏమీ చేయరు కాని ఇస్లామీయ అధికారం రావాలని అనుకున్న వెంటనే షైతాన్ మరియు శత్రువుల పని మొదలవుతుంది.
ఈ ఇస్లామీయ అధికారం అన్ని ఒడిదుడుకులను దాటుకుంటూ 12వ తేదీన మొదలయ్యింది. అల్లాహ్ దయతో ఈ అధికారం దైవప్రవక్త(స.అ) పన్నెండవ ఉత్తరాధికారి అధికారంతో కలిసిపోవాలని ఆయనను కోరి ప్రార్థిస్తున్నాను.  

రిఫరెన్స్
1. చూడండి; ఫజూహిష్ హాయె దీనీ, సాల్2, షుమార్4, 1385, మిఖాలయె ఉఖ్దయె హిఖారత్, తాహిరీ, పేజీ7.
2. బయానాతె రహ్బర్ దర్ ఖుత్బయె నమాజె జుమా తెహ్రాన్, 12/11/1375.
3. తఫ్సీరె అయాషీ, భాగం2, పేజీ9.

https://btid.org/fa/news/198097

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10