హదీసె సఖ్లైన్, షియా దృష్టిలో

శని, 02/12/2022 - 18:54

హదీసె సఖ్లైన్ పై అమలు చేసేవారే దైవప్రవక్త(స.అ) యొక్క నిజమైన సున్నత్
ను అనుసరించరులు. ఆ హదీస్ గురించి షియా వర్గం వారు ఏమంటున్నారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

హదీసె సఖ్లైన్, షియా దృష్టిలో

“షియాలే దైవప్రవక్త(స.అ) యొక్క సరైన సున్నత్
ను అనుసరించేవారు” అని నిరూపించే దైవప్రవక్త(స.అ) యొక్క ఆ హదీస్, దానినే “హదీసె సఖ్లైన్” అంటారు. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “నేను మీ మధ్య రెండు విలువైన వాటిని విడిచి వెళ్తున్నాను, అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స), ఇత్రత్(అ.స). ఒకవేళ మీరు వాటిని ఆశ్రయించినట్లైతే నా తరువాత ఎప్పటికీ మార్గభ్రష్టతకు గురి కారు. వాటిని మించే ప్రయత్నం చేయకండి, లేకపోతే నాశనం అవుతారు. వాటిని నుండి దూరం కావద్దు, లేకపోతే నాశనం అవుతారు. (చూడండీ!) వారిని నేర్పే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వారు నీ కన్న ఎక్కువ జ్ఞానం కలిగిన ఉన్నవారు.[1]
కొన్ని రివాయతులలో ఇలా ఉంది: “నాకు, సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు(అయిన అల్లాహ్) ఈ రెండూ కౌసర్ సేలయేరు పై నా వద్దకు చేరే వరకు విడిపోవు, అని తెలియపరిచాడు”
సఖ్లైన్ హదీస్
ను “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”
లు తమ అనేక “సహ్హాహ్” మరియు “మసానీద్” గ్రంథాలలో ఉల్లేఖించారు. షియాలు తమ హదీస్
కు సంబంధించిన ప్రతీ పుస్తకంలో దీనిని ఉల్లేఖించారు.
“అహ్లెసున్నత్ వల్ జమాఅత్”
లు రుజుమార్గం నుండి మరలిపోయారు, అన్న విషయం స్పష్టమైనది. ఎందుకంటే వారు రెండింటిని (ఖుర్ఆన్ మరియు ఇత్రత్(అ.స)) కలిపి ఆశ్రయించలేదు. అందుకని నాశనం అయ్యారు. వారు అహ్లెబైత్(అ.స)ల పై అబూహనీఫా, మాలిక్, షాఫెయీ, హంబల్
లను ప్రాముఖ్యత ఇచ్చారు. వారిని  అనుచరించారు. మరియు పవిత్ర ఇత్రత్(అ.స)
ను వదిలేశారు.
వారిలో కొందరు “మేము ఖుర్ఆన్
ను ఆశ్రయించాము” అని అంటారు. అయితే దాని పై కూడా ఎటువంటి సాక్ష్యం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్
లో అన్ని విషయాలు సంహితముగా చెప్పబడి ఉన్నాయి. అందులో అహ్కాములు వివరంగా చెప్పబడిలేవు. అందులో ఎన్నో సంభవములు ఉన్నాయి. దానిని వివరించే మరియు వ్యాఖ్యతల అవసరం ఎంతైనా ఉంది. మరి దైవప్రవక్త(స.అ) సున్నత్
ల పరిస్తితి కూడా అదే. వాటికోసం కూడా నమ్మదగిన రావీ, వ్యాఖ్యాత మరియు ఉలమాల అవసరం ఉంది.
దానికోసం దైవప్రవక్త(స.అ) వసీయత్ చేసిన ఆ అహ్లెబైత్(అ.స)లను ఆశ్రయిం చడం తప్ప వేరే పరిష్కారం లేదు.
మరియు సైఖ్లైన్ హదీసుతో పాటు దాని భావన కలిగి ఉన్నటు వంటి హదీసులు, ఉదాహారణకు:
“అలీ(అ.స) ఖుర్ఆన్
తో పాటు ఉన్నారు మరియు ఖుర్ఆన్ అలీ(అ.స)తో, వీరిద్దరు కౌసర్ (సేలయేరు) వద్ద నాతో కలవనంత వరకు వేరుకాలేరు”[2]
మరి ఇలా కూడా ప్రవచించారు: “అలీ(అ.స) సత్యంతో పాటు ఉన్నారు మరియు సత్యం అలీ(అ.స)తో, మరియు వీరిద్దరు ప్రళయం నాడు కౌసర్ (సేలయేరు) వద్ద నాతో కలవనంత వరకు వేరుకాలేరు”[3]
ఈ అన్ని విషయాల ద్వార మనకు మరియు పరిశోధకులందరికీ, అలీ(అ.స)ని వదిలేసినవాడు ఖుర్ఆన్ యొక్క నిజమైన వ్యాఖ్యాతను వదిలేసినట్లు. మరియు అలీ(అ.స) పట్ల అశ్రద్ధ చూపించినవాడు సత్యం నుండి ముఖం త్రిప్పుకుని అసత్యాన్ని ఎంచుకున్నట్లే, అని తెలిస్తుంది. ఎందుకంటే సత్యం లేకుంటే ఇక మిగిలేది అసత్యం మాత్రమే.
మనకు, “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”
లు “ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్” రెండింటిని వదిలేశారు, అని కూడా రుజువు అవుతుంది. ఎందుకంటే వారు సత్యం అనగా అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ను వదిలేశారు.
ఉదాహరణార్థముగా దైవప్రవక్త(స.అ) ఈ హదీస్; నా ఉమ్మత్ 73 వర్గాలలో విడిపోతుంది మరియు అందులో ఒక వర్గం మాత్రమే విముక్తి చెందుతుంది. ఈ వర్గం ఇమామ్ అలీ(అ.స)ని అనుసరించి, సత్యం మరియు రుజుమార్గం పై స్థిరత్వం కలిగి ఉండేటువంటి వర్గం. ఆ వర్గం వారు అలీ(అ.స) యొక్క శత్రువులతో యుద్ధం మరియు అతని ఒప్పందం ప్రకారం సంధి చేస్తారు. అతని జ్ఞానాన్ని వారు అనుచరిస్తారు. మరియు అతని సంతతి నుండి ఇమాములను విశ్యసిస్తారు. ఆయత్:
أُوْلَٰٓئِكَ هُمۡ خَيۡرُ ٱلۡبَرِيَّةِ جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُ
అనువాదం: నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. (ఈ అనుగ్రహ భాగ్యం) తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే.[సూరయె బయ్యినహ్, ఆయత్:7-8.]   
వీరే సృష్టిలో అందరి కన్నా ఉత్తములు. వారి ప్రతిఫలం, అల్లాహ్ వద్ద ఎల్లప్పుడూ ఉండేందుకు ఉద్యానవనం, దాని క్రింద నుండి జలప్రవాహనం మరియు అల్లాహ్ వారితో రాజీ, మరియు వారు  ఆయనతో సంతోషం.

రిఫరెన్స్
1. సహీ తిర్మిజీ, సహీ ముస్లిం, ముస్తద్రికుల్ హాకిం, ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, కన్జూల్ ఉమ్మాల్, ఖసాయిన్ అన్నిసాయి, తబఖాతె ఇబ్నె సఅద్, తబరాని, సీవ్తీ, ఇబ్నె హజర్, ఇబ్నె అసీర్ మొ॥ ఇంకా వివరాల కోసం అల్ మురాజిఆత్ పేజీ 820 ను తిలకించ వచ్చు.
2. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ 124.
3. మున్తఖబు కన్జిల్ ఉమ్మాల్, భాగం5, పేజీ30. తారీఖు ఇబ్ని అసాకిర్, భాగం3, పేజీ119. తారీఖె బగ్దాది, భాగం14, పేజీ121. తారీఖుల్ ఖులఫా, ఇబ్నె ఖుతైబహ్, భాగం1, పేజీ73.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16