సఖ్లైన్ హదీస్ పట్ల జ్ఞానం

ఆది, 02/13/2022 - 15:34

హదీసె సఖ్లైన్ ను అహ్లెసున్నత్
 వారు తమ ఇరువై కన్న ఎక్కువ ప్రముఖ మూల గ్రంథాలలో ఉల్లేఖించారు. మరియు అది “సరైన హదీస్” అనీ కూడా అంగీకరిస్తారు... 

సఖ్లైన్ హదీస్ పట్ల జ్ఞానం

హదీసె సఖ్లైన్
దైవప్రవక్త(స.అ) ఉపదేశం: “నేను మీ మధ్య రెండు విలువైన వాటిని విడిచి వెళ్తున్నాను, అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స), ఇత్రత్(అ.స). ఒకవేళ మీరు వాటిని ఆశ్రయించినట్లైతే నా తరువాత ఎప్పటికీ మార్గభ్రష్టతకు గురి కారు. వాటిని మించే ప్రయత్నం చేయకండి, లేకపోతే నాశనం అవుతారు. వాటిని నుండి దూరం కావద్దు, లేకపోతే నాశనం అవుతారు. (చూడండీ!) వారిని నేర్పే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే వారు నీ కన్న ఎక్కువ జ్ఞానం కలిగిన ఉన్నవారు.[1]
ఈ హదీసును అహ్లెసున్నత్
లు తమ ఇరవై కన్న ఎక్కువ ప్రముఖ మూల గ్రంథాల నుండి అలీ(అ.స) ద్వార ఉల్లేఖించారు. మరియు అది “సరైన హదీస్” అనీ కూడా అంగీకరిస్తారు.
ఎప్పుడైతే వారు ఈ హదీస్
ను సరైనది అని అంగీకరించారో, నిస్సందేహంగా తాము మార్గభ్రష్టులయ్యాము, అని కూడా ఒప్పుకున్నట్లే. వారు అహ్లెబైత్(అ.స) యొక్క ఇమాములతో ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మరియు తమ పనికిరాని వర్గాల దండను తమ మెడలో వేసుకున్నారు. వాటి పై అల్లాహ్ తరపు నుండి సాక్ష్యం లేదు. అలాగే దైవప్రవక్త(స.అ) హదీస్
లో వాటి ప్రస్తావన కూడా లేదు.
ఆశ్చర్య పడవలసింది, ఈనాటి అహ్లెసున్నత్ ఉలమాల పై. వారు విజ్ఞాన పరిశోధన చేసేందుకు లెక్కలేనివన్ని సాధనాలు ఉన్నటువంటి కాలంలో ఉన్నారు. మరియు బనీఉమయ్యాలు చనిపోయి కూడా చాలా సమయం గడిచిపోయింది. అయినా సరే వారు ఇప్పుడు కూడా తౌబా చేయరు. మరియు అల్లాహ్
ను ఆశ్రయించరు, కనీసం అల్లాహ్ యొక్క దయా వాళ్ళ పై పడేది.
وَإِنِّي لَغَفَّارٞ لِّمَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَٰلِحٗا ثُمَّ ٱهۡتَدَىٰ
అనువాదం: నిస్సందేహముగా నేను అమితంగా మన్నించేవాణ్ణి. ఎవడైతే పశ్చాత్తాపపడతాడో మరియు విశ్వసిస్తాడో. మంచిపనులు చేస్తాడో, ఆ తరువాత మార్గం పొందుతాడు.[తాహా సూరా:20, ఆయత్:82.] 
మరియు ఈనాడు, ప్రజలు జీవిస్తున్న ఈ కాలంలో బలవంతంగా రాజు గారిని అనుసరించమని చెప్పే ఖిలాఫత్ కూడా లేదు. అయితే మరి సత్యాన్ని అంగీకరించేందుకు, ఏది అడ్డు పడుతుంది?. మరియు ఏ దేశపు రాజు అయినా సరే దీన్
కు సంబంధించిన వ్యవహారములలో అతడి కూర్చీకు ఆపద రానంత వరకు ఎటువంటి జోక్యం చేసుకోడు. అతడికి డెమోక్రసీ మరియు వాళ్ళ హక్కులు బాగా తెలుసు. విశ్వాసం మరియు ఆలోచన స్వేచ్ఛ కూడా అందులో భాగమే.

రిఫరెన్స్
1. సహీ తిర్మిజీ, సహీ ముస్లిం, ముస్తద్రికుల్ హాకిం, ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, కన్జూల్ ఉమ్మాల్, ఖసాయిన్ అన్నిసాయి, తబఖాతె ఇబ్నె సఅద్, తబరాని, సీవ్తీ, ఇబ్నె హజర్, ఇబ్నె అసీర్ మొ॥ ఇంకా వివరాల కోసం అల్ మురాజిఆత్ పేజీ 820 ను తిలకించ వచ్చు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16