షియా దృష్టిలో ఫిఖా మూలాధారాలు-1

మంగళ, 02/15/2022 - 16:46

“షరా” యొక్క మూలాధారాలు షియాల దృష్టిలో కేవలం రెండే రెండు మూలాధారాలు, మూడవది లేదు: గ్రంథం(అల్లాహ్), సున్నత్(దైవప్రవక్త(స.అ)) అనగా మొదటిది “ఖుర్ఆను మజీద్” రెండవది “దైవప్రవక్త(స.అ) సున్నత్”

షియా దృష్టిలో ఫిఖా మూలాధారాలు-1

షియా ఇమామీయుల “ఫిఖా”ను చదివే మరియు పరిశోధించేవారికి తెలుసు, షియాలు ఫిఖా అహ్కాములన్నీంటిలో “కొత్త సమస్యలు కాకుండా” పన్నెండు ఇమాముల ద్వార దైవప్రవక్త(స.అ)ను ఆశ్రయిస్తారు, అని.
“షరా” యొక్క మూలాధారాలు షియాల దృష్టిలో కేవలం రెండే రెండు మూలాధారాలు, మూడవది లేదు: గ్రంథం(అల్లాహ్), సున్నత్(దైవప్రవక్త(స.అ)) అనగా మొదటిది “ఖుర్ఆను మజీద్” రెండవది “దైవప్రవక్త(స.అ) సున్నత్”
ఇవీ గంతించిన మరియు ఇప్పుడు ఉన్న షియా ఉలమాల అభిప్రాయాలు. అంతేకాకుండా అహ్లెబైత్(అ.స) అభిప్రాయాలు కూడా ఇవే. వారిలో ఏ ఒక్కరు కూడా స్వయపరియాలోచన పై అమలు చేశాను లేదా నేను స్వయంగా ఆదేశాన్ని ఇస్తున్నాను అని వాదించలేదు.
దీని ప్రకారం, మొదటి ఇమామ్ హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) వద్దకు ప్రజలు ఖిలాఫత్ పదవిని తీసుకొని వచ్చినప్పుడు, వారి ముందు “ఒకవేళ మీరు ఉమ్మత్
లో అబూబక్ర్ సున్నత్ మరియు ఉమర్ సున్నత్ ప్రకారం అమలు చేస్తే ఖిలాఫత్ మీకు దక్కుతుంది” అని షరత్తు పెట్టారు. అప్పుడు ఇమామ్ ఇలా అన్నారు: “నేను అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ ప్రకారంగా అమలు చేస్తాను”.
“అలీ(అ.స) ఎల్లప్పుడూ దైవప్రవక్త(స.అ) సున్నత్ పై కట్టుబడి ఉండే వారు. దానిని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రజలను దైవప్రవక్త(స.అ) సున్నత్ వైపుకు మరలించాలని పూర్తిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివిరికి ఖులఫాలు అతనితో నిరాశ చెందారు. అల్లాహ్ కోసం అతను పడ్డ కష్టం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను జారీ చేసిన వాటికి ఫలితంగా ప్రజల మద్దత్తు అతనికి లభించింది.(వీటి గురించి ఇంతకు ముందు చాలా సార్లు వివరించడం జరిగింది). 
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం:
“ఒకవేళ మేము మా అభిప్రాయాలతో మీకు అహ్కాములు చెప్పి ఉంటే మనకు ముందువారు మార్గభ్రష్టులు అయిన విధంగా మీరు కూడా మార్గభ్రష్టులు అయ్యి ఉండేవారు. మేము మీకు చెప్పే వాటి పై అల్లాహ్ యొక్క స్పష్టమైన సాక్ష్యం ఉంది, అది ఆయన తన ప్రవక్తకు ప్రవచించాడు, మరియు దైవప్రవక్త(స.అ) మమ్మల్ని బోధించారు”.
మరో చోట ఇలా ప్రవచించారు: “ఓ జాబిర్! ఒకవేళ మేము మీకు మా అభిప్రాయం మరియు కోరిక ప్రకారం ఒక్కమాట చెప్పినా నిస్సహాయులయ్యే వారము. మేము దైవప్రవక్త(స.అ) హదీసుల నుండి సేకరించినదే చెబుతాము, మరియు మేము (వాటిని) ప్రజలు వెండీబంగారాలను సంగ్రహించినట్లు, సంగ్రహించాము”
ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “అల్లాహ్ ప్రమాణంగా! మేము మా అభిప్రాయం మరియు మనోవాంఛ ద్వారా ఎటువంటి విషయాన్ని చెప్పము. అంతేకాదు ఏదైతే చెబుతామో అది అల్లాహ్ ప్రవచనం అయి ఉంటుంది. మేము మీకు ఏదైన జవాబు ఇస్తే అది మా అభిప్రాయం కాదు అది దైవప్రవక్త(స.అ) ప్రవచనం అయి ఉంటుంది”

అహ్లెబైత్(అ.స)కు చెందిన ఇమాముల ఈ స్వభావం గురించి జ్ఞానులకు మరియు పరిశోధకులకు తెలుసు. అందుకనే వారు ఒక్క ఇమామ్ గురించి కూడా “ఇతను స్వయఅభిప్రాయాన్ని నమ్మేవారనీ, లేదా ఖుర్ఆన్ మరియు సున్నత్ కాకుండా ఖియాస్, ఇస్తెహ్సాన్ మొ॥, వాటిని నమ్మేవారనీ” వ్రాయలేదు.
“షహీద్ ఆయతుల్లాహ్ ముహమ్మద్ బాఖిర్ అల్ సద్ర్(ర.అ)” ద్వార లిఖించబడ్డ “రిసాలయే అమలియా”(పుస్తకం)లో ఇబాదాత్(ప్రార్ధనలు) మరియు మఆమెలాత్ (వ్యవహారాల)కు సంబంధించి స్పష్టమైన ఫత్వాలను చూడగలము. అతను ఇలా లిఖించారు: “మేము చివరిలో సంక్షిప్తముగా ఈ మాటను చెప్పడం అవసరం అని భావిస్తున్నాము, అదేమిటంటే, ఈ స్పష్టమైన ఫత్వాలను పొందడానికి మేము నమ్మిన మూలాధారాలు; ఖుర్ఆను మజీద్ మరియు హదీస్, అది కూడా ధర్మ నిష్ఠగల మరియు నమ్మకమైన వారి నుండి మన వరకు చేరినటువంటి హదీస్, వారు ఏ వర్గానికి చెందివారైన సరే.”

రిఫరెన్స్
1. కొన్ని రివాయత్‌లలో ఇలా ఉంది ఇమామ్ ఇలా ప్రవచించారు: “అవి కాకుండా నేను నా అభిప్రాయం ద్వార చేసిన ఇజ్తిహాద్ పై అమలు చేస్తాను” ఇది ఇజ్తిహాద్
కు నమ్మేవారి తరపు నుండు పెంచబడినది. ఎందుకంటే ఇమామ్ అలీ(అ.స) ఒక్కరోజు కూడా “నేను నా సొంత అభిప్రాయం ద్వార ఇజ్తిహాద్ చేస్తాను” అని వాదించలేదు, అంతేకాకుండా వారు ఎల్లప్పుడూ అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త సున్నత్ పరిశీలించి దాని నుండి అహ్కాములను పొందేవారు. లేదా ఇలా అనేవారు: మా వద్ద “అల్ జామిఅహ్” ఉంది అందులో ప్రజలకు అవసరం వచ్చే విషయాలన్నీ లిఖించబడి ఉన్నాయి. చివరికిత అందులో “చిన్న గీరుటకు సంబంధించింది” కూడా లిఖించబడి ఉంది. “అల్ జామిఅహ్” దైవప్రవక్త(స.అ) చెబుతూ ఉంటే అలీ(అ.స) దానిని వ్రాసినటువంటి పుస్తకం. ఈ “అల్ జామిఅహ్ సహీఫా” గురించి మేము “అహ్లెసున్నత్
లే సున్నత్
ను నిషేదించినవారు”లో వివరంగా చర్చించడం జరిగింది.
2. అల్ ఫతావల్ వాజిహహ్, అల్ షహీద్ బాఖిర్ అల్ సద్ర్, ఫేజీ97.

షియా హుమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10