షియా దృష్టిలో ఫిఖా మూలాధారాలు-2

బుధ, 02/16/2022 - 17:06

షరా పరమైన ఆదేశం కోసం ఖియాస్ మరియు ఇస్తిహ్సాన్
 పై అమలు చేయడం, షియా వర్గం వారి షరా దృష్టి కోణంగా సమ్మతించదగినది కాదు, అని వారు భావిస్తారు...

షియా దృష్టిలో ఫిఖా మూలాధారాలు-2

షరా పరమైన ఆదేశం కోసం ఖియాస్ మరియు ఇస్తిహ్సాన్
 పై అమలు చేయడం, షియా వర్గం వారి షరా దృష్టి కోణంగా సమ్మతించదగినది కాదు, అని వారు భావిస్తారు.
అవును, వివేకమైన సాక్ష్యంలో ముజ్తహిదీన్ మరియు ముహద్దిసీన్
ల మధ్య విభేదం ఉంది, అదేమిటంటే దాని పై అమలు చేయడం సమ్మతించబడినదేనా లేదా? అని.
అయితే షియాలు దాని పై అమలు చేయడం జాయిజ్ అని మాటను అంగీకరిస్తారు. కాని మాకు బుద్ధి మరియు వివేక సాక్ష్యాల పై ఆధారపడి ఉన్నటువంటి అహ్కాములు దొరకలేదు. అంతేకాకుండా వివేకం ఆధారంగా నిరూపించబడ్డ ఆదేశమే అల్లాహ్ గ్రంథం మరియు సున్నత్ ద్వార నిరూపించబడి ఉంటుంది.

“ఇజ్మా”, ఖుర్ఆన్ మరియు హదీస్ వలే మూలాధారం కాదు. అలాగే దానిని నమ్మలేము. కాని కొన్ని సందర్భాలలో “ఇజ్మా” దేనినైనా నిరూపించడానికి సహాయ పడుతుంది.
ఈ విధంగా గ్రంథం(అల్లాహ్) మరియు సున్నత్(దైవప్రవక్త(స.అ))లే మూల ఆధారాలు. నిస్సందేహముగా ఎవరైతే వారిని ఆశ్రయించారో అతను నష్టంలేని “ఉర్వతుల్ ఉస్ఖా”ను పట్టుకున్నారు. అల్లాహ్ సర్వమూ వింటాడు మరియు సమాస్తమూ తెలిసినవాడు.
పూర్వపు మరియు ఇప్పటి షియాలలో ఇదే లక్షణం కనిపిస్తుంది. వారు ఖుర్ఆన్ మరియు సున్నత్
పై అమలు చేస్తారు. మీకు వారిలో ఏ ఒక్కరి ఫత్వా కూడా ఖియాస్ లేదా ఇస్తిహ్సాన్
ల ద్వార కనబడదు.
ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స) మరియు అబూ హనీఫా యొక్క సంఘటన కూడా అందరికి తెలిసినదే. ఇమామ్ సాదిఖ్(అ.స) అబూహనీఫా
ను ఖియాస్ నుండి ఆపివేశారు. మరియు ఇలా అన్నారు: అల్లాహ్ ధర్మం
లో నీవు ఖియాస్ చేయకు. ఎందుకంటే షరాలో ఖియాస్ జ్యోక్యంతో అది నాశనం అయిపోతుంది. అందరి కన్న ముందు ఇబ్లీస్ “నేను ఇతడి(ఆదమ్) కన్న మంచివాడిని మరియు ప్రతిష్ట గలవాడిని ఎందుకంటే నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతడిని మట్టితో సృష్టించావు” అని చెప్పి ఖియాస్ చేశాడు.
హజ్రత్ అలీ(అ.స) కాలం నుండి ఈనాటి వరకు ఇవే షియాల దృష్టిలో షరా యొక్క మూలాధారాలు.

రిఫరెన్స్
షియా హుమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17