ఇమామ్ అలీ(అ.స) అబూబక్ర్ కాలంలో

శని, 02/19/2022 - 17:45

యూధుడు, ఇస్లాం ను స్వీకరించి ఇలా అన్నాడు: నువ్వే దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారానికి అర్హుడవు, వేరే వారు కాదు”

ఇమామ్ అలీ(అ.స) అబూబక్ర్ కాలంలో

యూధుల నుంచి కొంత మంది శాస్ర్తాజ్ఞులు అబూబక్ర్ వద్దకు వచ్చి వారితో ఇలా అన్నారు: ఒకవేళ మీరు ఈ ఉమ్మత్ దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారి అయి ఉన్నట్లైతే, మేము మా తౌరాత్ లో దైవప్రవక్త యొక్క ఉత్తరాధికారి ప్రజలందరిలో జ్ఞాని అయి ఉంటాడు అని చదివాము. అయితే మీరు మా ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి: అల్లాహ్ ఆకాశంలో ఉన్నాడా లేక భూమిలో ఉన్నాడా?
అబూబక్ర్ ఇలా సమాధానమిచ్చారు: ఆయన ఆకాశంలో అర్ష్ పై ఉన్నాడు.
వారు ఇలా అన్నారు: అంటే భూమిపై ఆయన లేనట్టే కదా; దీంతో తెలిసే విషయమేమిటంటే అల్లాహ్ ఒక చోట ఉంటే మరో చోట లేడు అన్నమాట...!
అబూబక్ర్ ఇలా అన్నారు: ఈ మాటలు అవిశ్వాసుల మాటలు, ఇక్కడ నుండి వెళ్లండి, లేకపోతే మిమ్మల్ని చంపమని ఆదేశిస్తాను.
వాళ్లు అక్కడ నుండి తిరిగి వెళ్లి ఇస్లాం ను హెళన చేశారు; హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), వారిలో ఒకరిని పిలిచి అతడితో ఇలా అన్నారు: నాకు తెలుసు నువ్వు ఏమి అడిగావో మరియు ఏది విన్నావో; అయితే గుర్తుంచుకో ఇస్లాం ఏమని చెబుతుందో: అల్లాహ్ యే స్వయంగా ప్రదేశాన్ని సృష్టించాడు, అంటే ఆయన ఒకే ప్రదేశానికి చెందినవాడు కాదు ఒక ప్రదేశం ఆయన్ని తనలో తీసుకోలేదు, ఆయన ఒక దానిని తాకకుండానే ప్రతీ చోట ఉన్నాడు; ప్రతీదీ ఆయన జ్ఞానానికి లోబడి ఉంది...”
ఆ యూధుడు, ఇస్లాం ను స్వీకరించి ఇలా అన్నాడు: నువ్వే దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారానికి అర్హుడవు, వేరే వారు కాదు”

రిఫరెన్స్
అల్ ఎహ్తెజాజ్, తబర్సీ, చాప్ జదీద్, భాగం1, పేజీ312.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6