ఖులఫా-ఎ-రాషిదీన్
ల సున్నత్

సోమ, 02/21/2022 - 03:43

అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారాలలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: ఖులఫాయే రాషిదీన్ ల సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా ...

ఖులఫా-ఎ-రాషిదీన్
ల సున్నత్

అహ్లెసున్నత్
లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారాలలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: ఖులఫాయే రాషిదీన్ ల సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా

ఖులఫాయే రాషిదీన్
ల సున్నత్
“ఖులఫాయే రాషిదీన్”
ల సున్నత్
ను “అహ్లెసున్నత్”లు ఈ హదీస్ ద్వార నిరూపిస్తారు: “علیکم بسنتی و سنه الخلفاء المھدیین الراشدین تمسّکوا بھا و عضو بالنواجذ”
అనువాదం: మీ పై నా మరియు ఖులఫాయే రాషిదీన్
ల సున్నత్
ను అనుసరించడం వాజిబ్, వారి(ఖులఫా) సున్నత్
ను ఆశ్రయించండి మరియు దానిని గట్టిగా పట్టుకోండి.[1]

ఈ హదీస్
లో “ఖులఫాయే రాషిదీన్” అనగా అహ్లెబైత్(అ.స)కు చెందిన ఇమాములు. దీనిపై కొన్ని సాక్ష్యాలు.
“బుఖారీ” మరియు “ముస్లిం” అంతేకాకుండా ముహద్దిసీన్‌లందరూ ఉల్లేఖించారు, దైవప్రవక్త(స.అ) తమ ఖులఫాల సంఖ్య 12 అని చెప్పారు, అని. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “الخلفاء من بعدی اثنا عشر کلھم من قریش; అనువాదం: నా తరువాత 12 ఖలీఫాలు ఉంటారు, వారందరూ ఖురైషీయులై ఉంటారు” ఈ హదీస్ నిరూపిస్తున్న విషయం ఏమిటంటే; “దైవప్రవక్త(స.అ) చెప్పింది అహ్లెబైత్‌(అ.స)కు చెందిన ఇమాముల గురించి, ఖిలాఫత్‌ను అన్యాయంగా స్వాహాచేసుకున్నటువంటి అదికారుల గురించి కాదు” అని.
ఎవరైనా ఇలా అనవచ్చు: ఈ హదీస్, షియాలు చెప్పే విధంగా అహ్లెబైత్(అ.స)ల ఇమాములకు సంబంధించి కానివ్వండి లేదా అహ్లెసున్నత్
లు చెప్పే విధంగా నాలుగు ఖులఫాయే రాషిదీన్లకు సంబంధించింది కానివ్వండి; షరా యొక్క మూలాధారాలు మూడు: ఖుర్ఆన్, సున్నత్ మరియు ఖులఫాల సున్నత్.
అహ్లెసున్నత్ దృష్టకోణంతో ఈ మాట సరైనదే, కాని షియా దృష్టకోణంతో సరైనది కాదు. ఎందుకంటే ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స) తమ అభిప్రాయం మరియు ఇజ్తిహాద్ ద్వార షరీఅత్
ను తయారు చేయరు. ఇంతకు ముందు దాని గురించి వివరంగా చెప్పబడం కూడా జరిగింది. వారు తమ పితామహులైన దైవప్రవక్త(స.అ) సున్నత్ నుండే చెబుతూ ఉంటారు. వారు వాటిని అవసరమైన సమయంకోసం సురక్షితంగా ఉంచారు.
కాని అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క గ్రంథాలు అబూబక్ర్ మరియు ఉమర్
ల తీర్మానాలతో నిండి ఉన్నాయి. మరి అవి ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
కు వ్యతిరేకం అయినా సరే. దానినే ఇస్లామీయ మూలాధారంగా భావిస్తున్నారు.

మరియు మన ఈ నమ్మకాన్ని ఇంకా బలపరిచే విషయం ఏమిటంటే; దైవప్రవక్త(స.అ) ఉద్దేశించి చెప్పిన వారిలో అబూబక్ర్ మరియు ఉమర్
 లేరు. అదెలాగంటే, సహాబీయులు ఖిలాఫత్
ను హజ్రత్ అలీ(అ.స) ముందు ఉంచి ఒకవేళ మీరు షేఖైన్(అబూబక్ర్ మరియు ఉమర్)
ల సున్నత్ పై అమలు చేస్తాను, అని ప్రమాణం చేస్తే, మేము ఖిలాఫత్ మీకు ఇచ్చేస్తాము, అని అన్నప్పుడు హజ్రత్ అలీ(అ.స) వారి సున్నత్ పై అమలు చేయనని నిరాకరించారు.
ఒకవేళ దైవప్రవక్త(స.అ) దృష్టిలో ఖులఫాయే రాషిదీన్ అనగా అబూబక్ర్ మరియు ఉమర్ అయి ఉంటే అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) మాటను రద్దుచేసేవారు కాదు. అబూబక్ర్ మరియు ఉమర్ల సున్నత్
పై అమలు చేయడాన్ని నిరాకరించే వారు కాదు. అంటే ఈ హదీస్ వారిద్దరూ “ఖులఫాయే రాషిదీన్”లలో లేరు అన్న విషయాన్ని నిరూపిస్తుంది.

వాస్తవానికి అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్
లనే “ఖులఫాయే రాషిదీన్” అని అనేవారు. ఎందుకంటే వారు మొదట్లో అలీ(అ.స)ను ఖలీఫా అని అంగీకరించేవారు కాదు. చాలా కాలం తరువాత అలీ(అ.స)ను ఖులఫాలలో చేర్చారు. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పిఠాల నుండి అలీ(అ.స)పై లఅనత్ చేయించేవారు, అలీ(అ.స) యొక్క సున్నత్
ను ఎలా అనుసరించగరు!?
మేము “జలాలుద్దీన్ సీవ్తీ” యొక్క “తారీఖుల్ ఖులఫా”లో ఉన్న మాటను చదివితే మన మార్గం, వర్గం, తెగ సరైనది అన్న విషయం ఇంకా బాగా స్పష్టమౌతుంది.

“సీవ్తీ”, “హాజిబ్ ఇబ్నె ఖలీఫా” ద్వార ఉల్లేఖించారు, నేను “ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్”
ను తన ఖిలాఫత్ కాలంలో ఉపన్యాసం ఇస్తుండగా చూశాను. అతను తన ఉపన్యాసంలో ఇలా అన్నారు: “తెలుసుకో! దైవప్రవక్త(స.అ) మరియు అతని మిత్రుల సున్నత్, అదే దీన్. మరి మేము దానినే అమలు చేస్తాము. దానిని మించము. ఆ ఇద్దరి సున్నత్ తప్ప వేరే వాటిని నమ్మము”[2]
వాస్తవం ఏమిటంటే చాలా సహాబీయులు మరియు అమవీ, అబ్బాసీ అధికారులు అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్ సున్నతే దీన్, అని ఆచరించారు. దానినే అమలు చేశారు. దానికే పరిమితమయ్యారు. మరియు ఇంతకు ముందు పేజీలలో మేము చెప్పిన విధంగా “ఖలఫాయే సలాసహ్”, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను నిరోధించినప్పుడు ఇక ఆ తరువాత వారు తయారు చేసిన సున్నతే మిగిలి ఉంటుంది. ఏవైతే వారు ఆదేశించేవారో, దాని పైనే అమలు జరుగేది, ఆ అహ్కాములే అనుసరించడేవి.

రిఫరెన్స్
1. తిర్మజీ, ఇబ్నె మాజా, బైహఖీ మరియు అహ్మద్ ఇబ్నె హంబల్.
2. తారీఖుల్ ఖులఫా, పేజీ160.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15