మక్కీ మదనీ

గురు, 01/18/2018 - 06:49

.దైవప్రవక్త[స.అ] మక్కాలో ఉన్నప్పుడు అవతరించబడిన సూరహ్ మరియు ఆయత్ లను “మక్కీ”, మదీనహ్ లో ఉన్నప్పుడు అవతరించబడిన వాటిని “మదనీ” అని అంటారు. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాల సంక్షిప్త వివరణ.

మక్కీ మదనీ

హజ్రత్ ముహమ్మద్[స.అ] దైవప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత 23 సంవత్సరాల వరకు దైవవాణి వస్తూనే ఉంది. ఆ 23 సంవత్సరములలో దైవప్రవక్త[స.అ] కొంత కాలం మక్కాలో మరి కొంత కాలం మదీనహ్లో గడిపారు. ఆ విధంగా దైవప్రవక్త[స.అ] మక్కాలో ఉన్నప్పుడు అవతరించబడిన సూరహ్ మరియు ఆయత్లను “మక్కీ” సూరహ్ మరియు ఆయత్లు అనీ, మదీనహ్ లో ఉన్నప్పుడు అవతరించబడిన సూరహ్ మరియు ఆయత్ లను “మదనీ” సూరహ్ మరియు ఆయత్ లు అని అంటారు.
ఖుర్ఆన్ గురించి తెలుసుకొనే సంభాషణలలో ఆకర్షణియమైన సంభాషణ “మక్కీ మదనీ” సూరహ్ మరియు ఆయత్ లను గుర్తించే సంభాషణ. అలాగే మదీనహ్ వాసుల గురించి మక్కాలో అవతరించబడిన ఆయత్లను లేదా మక్కా వాసుల గురించి మదీనహ్ లో అవతరించబడిన ఆయత్లను తెలుసుకోవడం, లేదా మక్కా మరియు మదీనహ్ పట్టణాలలో కాకుండా వేరే ప్రదేశాలలో అవతరించబడిన వాటి గురించి తెలుసుకోవడం, లేదా మదనీ సూరహ్ లలో మక్కాలో అవతరించబడిన ఆయత్ లు లేదా మక్కీ సూరహ్ లలో మదీనహ్ లో ఆవతరించబడిన ఆయత్ ల గురించి తెలుసుకోవడం.
ఈ సూరహ్ లేదా ఆయత్ మక్కాలో అవతరించబడిందా లేక మదీనహ్ లో అవతరించబడిందా అని తెలుసుకోవాలనుకుంటే కొందరు కాలాన్ని మరియు కొందరు ప్రదేశాన్ని సూచనగా నిర్ధారించారు. అంటే కాలాన్ని నమ్మే వారు హిజ్రత్కు ముందు అవతరించబడ్డ సూరహ్ మరియు ఆయత్ లను “మక్కీ” అనీ, హిజ్రత్ తరువాత అవతరించబడిన సూరహ్ మరియు ఆయత్లను “మదనీ” అని భావిస్తారు. కాని ప్రదేశాన్ని నమ్మేవారు సూరహ్ లేదా ఆయత్ అవతరించబడేటప్పుడు దైవప్రవక్త[స.అ]  ఎక్కడ ఉన్నారు మక్కాలో ఉంటే “మక్కీ”, మదీనహ్ లో ఉంటే “మదనీ” అని భావిస్తారు.[ఉలూమే ఖుర్ఆన్, మక్కీ మదనీ సూరహ్ల వివరణ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మారెఫత్, ఉలూమే ఖుర్ఆన్, మక్కీ మదనీ సూరహ్ల వివరణ అధ్యాయంలో

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19