తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, షియాల దృష్టిలో-1

ఆది, 02/27/2022 - 15:39

“ముజ్తహిద్” కానటువంటి యువకుడు, అనగా షరీఅత్ యొక్క అహ్కాములను ఖుర్ఆన్ మరియు సున్నత్ నుండి మతపరమైన ఆదేశాలను అర్థం చేసుకునే సామర్థ్యం లేనివాడు తప్పకుండా జ్ఞానం, ధర్మనిష్ఠ మరియు న్యాయం మరియు సమగ్ర అర్హతలు(జామివుష్షరాయత్) గల ముజ్తహిద్ యొక్క తఖ్లీద్ చేయాలి...

తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, షియాల దృష్టిలో-1

“ముజ్తహిద్” కానటువంటి యువకుడు, అనగా షరీఅత్ యొక్క అహ్కాములను ఖుర్ఆన్ మరియు సున్నత్ నుండి మతపరమైన తీర్పులను తీసుకునే సామర్థ్యం లేకపోవడం. అతడు తప్పకుండా జ్ఞానం, ధర్మనిష్ఠ మరియు న్యాయం మరియు సమగ్ర అర్హతలు(జామివుష్షరాయత్) గల ముజ్తహిద్ యొక్క తఖ్లీద్ చేయాలి. అల్లాహ్ ఇలా ప్రవచించెను:
فَسۡ‍َٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ
అనువాదం: ఒకవేళ మీకు తెలియకపోతే (గ్రంథ) జ్ఞానంగల వారిని అడిగి తెలుసుకోండి.[నహ్ల్ సూరా:16, ఆయత్:43]
షియా ఇమామియాలు అప్
డేట్ అవుతూ ముందుకు సాగారు, కనుక వాళ్ళ వద్ద  “అఅలమియ్యత్ మరియు మర్జయియ్యత్” గొలుసు దైవప్రవక్త(స.అ) మరణాంతరం నుండి ఇప్పడి వరకు తెగిపోలేదు, అని తెలుస్తుంది.
షియాల తఖ్లీద్ యొక్క క్రమం, పన్నెండు ఇమాముల వరకు చేరుతుంది. వారి ఇమాముల క్రమం మూడు వందల సంవత్సరముల వరకు యేకరీతిగా ఉండింది. వారిలో ఎప్పుడు కూడా ఒకరు మరొకరి ప్రవచనాన్ని వ్యతిరేకించలేదు. ఎందుకంటే వారి దృష్టిలో ఖుర్ఆన్ మరియు సున్నతే అనుచరణకు అర్హతగలవి కాబట్టి. అందుకనే వారు ఎప్పుడు కూడా “ఖియాస్” మరియు “ఇజ్తిహాద్” పై అమలు చేయలేదు. ఒకవేళ వారు అలా గనుక చేసి ఉంటే ఎలాగైతే అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క ఇమాముల మధ్య వ్యతిరేకత తెలిసిపోయిందో అదేవిధంగా వారి మధ్య గల వ్యతిరేకత కూడా తెలిసిపోయేది.
ఈ మాటలతో ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, అందేమిటంటే, “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” వర్గం అది హనఫీ కానివ్వండి, లేదా మాలికీ కానివ్వండి, అది షాఫెయీ కానివ్వండి లేదా హంబలీ కానివ్వండి, దైవప్రవక్త(స.అ) కాలం నుండి చాలా కాలం తరువాత జన్మించినటువంటి మరియు దైవప్రవక్త(స.అ)తో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అభిప్రాయల పై ఆధారపడి ఉంది.

కాని “షియా ఇమామియా వర్గం”, దైవప్రవక్త(స.అ) యొక్క సంతానమైన పన్నెండు గురు ఇమాముల ద్వార తవాతుర్ ప్రకారంగా నిరూపితమైనది. వారిలో కుమారుడు, తండ్రి ద్వార రివాయత్
ను ఉల్లేఖిస్తారు. అందుకే ఒక ఇమామ్(అ.స) హదీస్
లో ఇలా ఉంది: నా హదీస్ నా తండ్రి హదీస్, నా తండ్రి హదీస్ నా తాతాగారి హదీస్, నా తాతాగారి హదీస్ అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) యొక్క హదీస్, అలీ(అ.స) యొక్క హదీస్ దైవప్రవక్త(స.అ) హదీస్, దైవప్రవక్త(స.అ) యొక్క హదీస్ జిబ్రయీల్ హదీస్ మరియు అది అల్లాహ్ యొక్క వచనం. అల్లాహ్ ఇలా ప్రవచించెను:
أَفَلَا يَتَدَبَّرُونَ ٱلۡقُرۡءَانَۚ وَلَوۡ كَانَ مِنۡ عِندِ غَيۡرِ ٱللَّهِ لَوَجَدُواْ فِيهِ ٱخۡتِلَٰفٗا كَثِيرٗا
అనువాదం: (ఏంటీ) వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరపు నుంచి గాక ఇంకొకరి తరపు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్ధ్యం కనబడేది.[సూరయె నిసా, ఆయత్:82]
పవిత్ర ఇమామ్ యొక్క గైబత్(అదృశ్య) కాలం నుండి ఇప్పటి వరకు సమగ్ర అర్హతలు గల ముజ్తహిద్ యొక్క తఖ్లీద్ చేస్తున్నారు. మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు స్థిరంగా ముజ్తహిద్
ల క్రమంగా సాగుతూనే ఉంది. ప్రతీ కాలంలో ఉమ్మత్
లో ఒకరు లేదా ఒకరి కన్నా ఎక్కువ షియా ముజ్తహిదీన్
లు పెరుగుతున్నారు. షియాలు, వారు ఖుర్ఆన్ మరియు సున్నత్ ద్వార తెలుసుకున్న ఆదేశాల ప్రకారం అమలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి! ఈ ముజ్తహిదీన్‌లు ఈ శతాబ్ధిలో జ్ఞాన పరంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల ముందుకు వచ్చిన కొత్త సమస్యలలో “ఇజ్తిహాద్” చేస్తారు. ఉదాహారణకు గండె మార్పిడి(Heart Transplant) లేదా అవయవ మార్పిడి (Organ transplant) లేదా వీర్యం మార్పిడి(Sperm swap) లేదా బ్యాంకు వ్యవహారములు మొ॥.
మరియు ముజ్తహిదీన్
ల మధ్య చాలా ఎక్కువగా తెలిసిన వాడు, ఉన్నత స్థాయిని సొంతం చేసుకుంటాడు. అతడే షియాల యొక్క “మర్జా” లేదా మత విశ్వవిద్యాలయాల పెద్ద అనబడతాడు.
షియాలు, ప్రతీ కాలంలో, ప్రజల అవసరాలను అర్ధం చేసుకునే మరియు వారి సమస్యలను ప్రాముఖ్యత ఇచ్చే, బ్రతికే ఉన్న ఫఖీహ్(ముజ్తహిద్) యొక్క తఖ్లీద్ చేస్తారు. కనుక వాళ్ళు అతనిని ప్రశ్నింస్తారు మరియు అతను వాళ్ళకి జవాబిస్తారు.

ఈ విధంగా, ప్రతీ కాలంలో షియాలు, ఇస్లామియా షరీఅత్ యొక్క రెండు మూలాధారాలు అనగా ఖుర్ఆన్ మరియు సున్నత్
లను కాపాడుకున్నారు. మరియు పన్నెండు ఇమాముల(అ.స) ద్వార ఉల్లేఖించబడ్డ స్పష్టమైన ఆదేశాలు షియా ఉలమాలను “ఖియాస్” మొదలగువాటి అవసరం లేకుండా చేశాయి. అంతేకాకుండా షియాలు హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) కాలం నుండే హదీస్ లేఖనాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు. స్వయంగా హజ్రత్ అలీ(అ.స) ప్రళయదినం వరకు ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు వ్రాసి ఉన్నటువంటి “అల్ జామిఆ” సహీఫా గ్రంథాన్ని భద్రంగా ఉంచారు. ఆ సహీఫా గ్రంథం తండ్రి నుండి కొడుకుకి వారసత్వంగా దక్కుతూ వచ్చింది. మరియు దానిని వారు ప్రజలు వెండీబంగారాన్ని ఎలా కాపాడుకుంటూ ఉంటారో అలా కాపాడుకునేవారు.
దీని గురించి మేము “షహీద్ ఆయతుల్లాహ్ బాఖిర్ అల్ సద్ర్” ఇలా అన్నారు: “మేము కేవలం ఖుర్ఆన్ మరియు సున్నత్‌నే నమ్ముతాము”
మేము కేవలం షహీద్ సద్ర్ వచనాన్ని ప్రదర్శించాము అంతే, నిజానికి షియా ముజ్తహిదీన్లందరి మాట ఇదే.

రిఫరెన్స్

అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10