తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో-1

బుధ, 03/16/2022 - 17:05

.“తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో” ఈ టాపిక్ పై చర్చించినప్పుడు, ఆశ్చర్యానికి గురి అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే...

తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో-1

“తఖ్లీద్ మరియు మర్జయియ్యత్, అహ్లెసున్నత్ దృష్టిలో” ఈ టాపిక్ పై చర్చించినప్పుడు, ఆశ్చర్యానికి గురి అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే వారు తమ క్రమాన్ని దైవప్రవక్త(స.అ) తో జోడిస్తారు. నిజానికి మనందరికి తెలుసు అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు నాలుగు ఇమాములు అనగా అబూహనీఫా, మాలిక్, షాఫెయీ మరియు ఇబ్నె హంబల్ యొక్క తఖ్లీద్ చేస్తారని. మరి ఈ నలుగురు కూడా దైవప్రవక్త(స.అ) ను చూడలేదు, మరి అతనిని కలవలేదు.
మరి షియాలు, ఎల్లప్పుడూ దైవప్రవక్త(స.అ) సన్నిధి లో ఉండే అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క తఖ్లీద్ చేస్తారు. హజ్రత అలీ(అ.స) తరువాత దైవప్రవక్త(స.అ) సంతానం మరియు స్వర్గయువకుల నాయకులైన ఇమామ్ హసన్(అ.స) మరియు ఇమామ్ హుసైన్(అ.స) ల తఖ్లీద్ చేస్తారు. ఆ తురువాత ఇమామ్ అలీ ఇబ్నె హుసైన్(అ.స), ఆ తరువాత అతని కుమారుడు బాఖిర్(అ.స), ఆ తరువాత అతని సుకుమారుడు జాఫర్(అ.స) యొక్క తఖ్లీద్ చేస్తారు. ఆ కాలం లో అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క అస్తిత్వమే లేదు. అలాగే చరిత్ర కూడా అప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? అని వివరించదు. మరియు వాళ్ళు తఖ్లీద్ చేసే ఇమామ్ ఎవరు?, దైవప్రవక్త(స.అ) మరణాంతరం నాలుగు వర్గాలు వెలుగులోకి వచ్చే వరకు షరీఅత్ యొక్క “హలాల్” మరియు “హరామ్” అహ్కాములలో వాళ్ళు ఎవరిని ఆశ్రయించేవారు? అన్న విషయాలను కూడా వివరించదు.

ఆ తరువాత నాలుగు వర్గాల ఇమాములు ఒకరి తరువాత ఒకరు వెలుగులోకి వచ్చారు. బనీఅబ్బాస్ పాలకుల ఇచ్చాపూర్వకంగా-ఇంతకు ముందు చెప్పిన విధంగా- ఆకర్షనియులయ్యారు.
ఆ తరువాత ఆ నాలుగు వర్గాలవారు వినడానికి మంచిగా ఉండే “అహ్లె సున్నత్ వల్ జమాఅత్” అన్న దాని క్రిందకు చేరారు, అని కూడా తెలుస్తుంది. హజ్రత్ అలీ(అ.స) పట్ల శత్రుత్వంగల ప్రతీవాడు అందులో చేరాడు. మరియు అలాగే “ఖులఫాయే సలాసహ్”, బనీఉమయ్యాహ్ మరియు బనీఅబ్బాస్
ల పట్ల ఇష్టం గలవారు కూడా వాళ్ళతో కలిసిపోయాడు. కనుక ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో, ఇష్టంలేకపోయిన ఈ వర్గపు సంకేళ్ళు తమ మెడలో వేసుకున్నారు. ఎందుకంటే అధికారులు ఆశ చూపి, భయపెట్టి ఈ వర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రజలు తమ చక్రవర్తుల మతాన్నే విశ్వసిస్తారు, మరియు దాని పైనే నడుస్తారు కూడానూ.
ఆ తరువాత మేము, అహ్లెసున్నత్
లను ఆ నాలుగు నాయకుల మరణాంతరం తమ ఉలమాలు ఇజ్తిహాద్ చేయకుండా, ఇజ్తిహాద్ తలుపులు మూసేయడాన్ని చూశాము. అంటే వారు చనిపోయిన వారి తఖ్లీదే చేయగలరన్నమాట.
బహుశ వారి నాయకులు మరియు అధికారులే వారి కోసం ఇజ్తిహాద్ ద్వారాన్ని “ప్రజలు ఆలోచన స్వచ్ఛ పొంది మన రాజ్యానికి ఛాలెంజ్
గా ఎక్కడ మారుతారో” అనే భయంతో మూసేసి ఉంటారు. అందుకని వాళ్ళు, ఉలమాలకు చర్చించే మరియు సంభాషించే హక్కు కూడా ఇవ్వలేదు.

ఈ విధంగా, అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు, వారు చూడని, ఎరగని మరియు అజీవవ్యక్తి యొక్క తఖ్లీద్
కు పరిమితమై ఉండిపోయారు. వారిని చూసే, కలిసే అవకాసం ఉంటే కలిసీ, చూసీ వారి జ్ఞానం, ధర్మనిష్ఠ మరియు ధర్మం పట్ల తృప్తి చెందేవారు. వారు, వారి పూర్వీకుల విషయంలో కేవలం మంచి భావన కలిగి ఉంటారు. వారిలో ప్రతీ వర్గం తమ ఇమామ్ పట్ల భావనాశ్రేష్టతలను ప్రవచిస్తూ ఉంటారు. వాస్తవానికి వారి ఇమాముల శ్రేష్టతలు కల్పితాలు లేదా ఊహ నుండి పుట్టుకొచ్చినవి. ప్రతీ వర్గం తమలో తాము సంతోషంగా ఉన్నారు.
ఒకవేళ ఈనాడు, అహ్లె సున్నత వల్ జమాఅత్
కు చెందిన నిపుణులు, వివేకులు వారి పెద్దలు చెప్పిన ఆజ్ఞానపు మాటలను చూస్తే, లేదా ఒకరిని ఒకరు అవిశ్వాసులని నిందించుకోవడం వల్ల యుద్ధాలు, గొడవలు మొదలయ్యేటువంటి వారి ప్రవచనంలో ఉన్న భిన్నత్వాన్ని చూస్తే, వారు తప్పకుండా ఆ ఇమాములను వదిలి, రుజుమార్గాన్ని పొందుతారు.

ఈనాటి ఒక ముస్లిం, ఈనాటి పరిస్థితుల గురించి, అభివృద్ధి గురించి తెలియనటువంటి వ్యక్తి మరియు అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తఖ్లీద్ ఎలా చేస్తాడు?.
ఖచ్చితంగా మాలిక్, అబూహనీఫా మరియు మిగతా వారు ప్రళయంరోజున “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అసహ్యాన్ని వ్యక్తంచేసి ఇలా అంటారు: “ప్రభువా! మేము వారిని చూడలేదు, మరియు వారు మమ్మల్ని చూడలేదు వారు చేసిన పనులకు, మమ్మల్ని ఖండించకు. మేము వాళ్ళతో చెప్పలేదు మా తఖ్లీద్ విధి అని.

రిఫరెన్స్
అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9