మక్కీ మదనీలను తెలుసుకొనే విధానం

గురు, 01/18/2018 - 07:18

.ఖుర్ఆన్ యొక్క మక్కీ మదనీ సూరహ్ లను తెలుసుకొనే మార్గల సంక్షిప్తం వివరణ.

 మక్కీ మదనీలను తెలుసుకొనే విధానం

ఏ సూరహ్ మరియు ఆయత్ మక్కాలో అవతరించబడింది లేదా మదీనహ్ లో అవతరించబడింది అని ఈ క్రింది రెండు మార్గాలనుండి ఒక దాని ద్వార తెలుస్తుంది. అవి:
1. అహ్లెబైత్[అ.స]ల హదీస్ ల ద్వార తెలుకోవడం.
2. అందులో ఉన్న భావాన్నీ మరియు కంటెంటు పరిశీలనతో తెలుసుకోవడం.
సాధారణంగా మక్కీ సూరహ్ మరియు ఆయత్ లు ఈ క్రింది ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అవి:
1. మూల విశ్వాసాల ఆహ్వానం; అల్లాహ్, ఖియామత్, స్వర్గం, నరకం మొ॥.
2. సద్గుణ వైపుకు ఆహ్వానం(అజ్ఞానంలో కలిగి ఉండే చెడు గుణాలకు సంబంధించి ఉండటం)
3. చిన్న చిన్న ఆయత్ లు మరియు సూరహ్ లు.
4. ప్రమాణాలు ఎక్కువగా ఉండడం లేదా ప్రమాణంతో మొదలయ్యే సూరహ్ లు.
5. ముష్రికీనులతో చర్చలు, సంభాషణాలు మరియు వారి నమ్మకాలను రద్దు చేయడం.
6. ఆయత్ మొదట్లో “యా అయ్యుహన్నాస్” అని ఎక్కువగా ఉండడం, “యా అయ్యుహల్లజీన ఆమను” అని తక్కువగా ఉండడం.
7. దైవప్రవక్తల, ఉమ్మత్ ల, సమూహాల అనుగుణ మరియు వ్యతిరేకత సంఘటనాలు
మదనీ సూరహ్ మరియు ఆయత్ లు ఈ క్రింది ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అవి:
1. సూరహ్ మరియు ఆయత్ లు పొడవుగా ఉండడం.
2. యూదులు మరియు క్రైస్తవులతో చర్చల ప్రస్తావన మరియు వారికి ఏకేశ్వరవాద ఆహ్వానం.
3. జిహాద్ మరియు దానికి సంబంధించిన అంశాల ప్రస్తావన.
4. సామాజిక చట్టం, అహ్కాముల వివరణ ఉదా: నమాజ్, ఉపవాసం, జకాత్, ఖుమ్స్, పరిహార ప్రస్తావనం, ఆస్తి పంపకానికి సంబంధించిన అహ్కాములు మొ॥ 
గమనిక: ఈ సూచనలు మరియు ప్రత్యేకతలు ఉలమాలు తమ పరిశీలనతో తెలుసుకున్నవి. తప్పకుండా ఇవే అని మాత్రం అని అనలేము.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4