దైవప్రవక్త(స.అ), అహ్లెసున్నత్ 
ల ఫిఖా
ను అంగీకరించరు

ఆది, 03/20/2022 - 15:22

దైవప్రవక్త(స.అ), అహ్లెసున్నత్ 
వల్ జమాఅత్ ల ఫిఖా
ను అంగీకరించరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త(స.అ), అహ్లెసున్నత్ 
ల ఫిఖా
ను అంగీకరించరు

ఇంతకు ముందు వివరించబడిన కొన్ని వ్యాసాల పరంగా తెలిసే విషయం ఏమిటంటే, షియాలు అహ్లెబైత్(అ.స)లకు విధేయులు. స్వయఅభిప్రాయాల పై, ఖియాస్ పై అమలు చేయరు, అంతేకాదు ఆ రెండింటిని హరామ్
గా భావిస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో దైవప్రవక్త(స.అ) నస్స్ ప్రకారం స్వయఅభిప్రాయం మరియు ఖియాస్ హరామ్ కాబట్టి. మరి ఇదే ఆలోచన వారిలో తరతరాలుగా వస్తూనే ఉంది. ఇంతకు ముందు “అల్ జామిఅహ్ సహీఫా” గురించి చెప్పడం జరిగింది. దాని పొడవు 70 గజాలు, మరియు అందులో ప్రళయదినం వరకు ముస్లిములకు అవసరం వచ్చే విషయాలన్నీ లిఖించబడి ఉన్నాయి, అని.
మరి అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు, ప్రతీ కార్యములో స్వయఅభిప్రాయం మరియు ఖియాస్
ను ఆశ్రయిస్తారు, అన్న విషయం స్పష్టమైయ్యింది. ఎందుకంటే వారి వద్ద దైవప్రవక్త(స.అ) నుసూస్(ఆదేశాలు) లేవు కాని వారికి వాటి అవసరం ఉంది. మరి వారి గొప్ప నాయకులే దైవప్రవక్త(స.అ) యొక్క నుసూస్(సున్నత్)ను నిరాకరించారు. వాటిని నిప్పంటించి నాశనం చేశారు. ప్రజలను వ్రాయనివ్వకుండా, దానిని సమకూర్చకుండా ఆపివేశారు.
ఆ తరువాత ఇజ్తిహాద్ మరియు స్వయఅభిప్రాయాలను అంగీకరించేవారు, తన వర్గాన్ని నమ్మించడానికి మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తెలియకుండా చేసేందుకు దైవప్రవక్త(స.అ) పేరుతో నకిలీ హదీసులు తయారు చేసి ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ), “మఆజ్ ఇబ్నె జబల్‌”ను “యమన్‌”కు పంపించి నప్పుడు అతనితో నీవు ఎలా సమస్యలను తీర్మానిస్తావు? అని ప్రశ్నించినప్పుడు మఆజ్ ఇలా అన్నారు: నేను అల్లాహ్ గ్రంథం ద్వార తీర్మానిస్తాను.
దైవప్రవక్త(స.అ): ఖుర్ఆన్
లో దాని ఆదేశం లేకుంటే?
మఆజ్: అప్పుడు దైవప్రవక్త(స.అ) సున్నత్ ద్వార తీర్మానిస్తాను.
దైవప్రవక్త(స.అ): ఒకవేళ దైవప్రవక్త(స.అ) సున్నత్ కూడా లేకుంటే?
మఆజ్: అప్పుడు నేను నా అభిప్రాయం ద్వార ఇజ్తిహాద్ చేస్తాను.
అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: అల్ హందులిల్లాహ్!, ఆయన దైవప్రవక్త(స.అ) యొక్క ప్రతినిధికి అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) ఇష్టానుసారం అమలు చేసే సామర్థ్యం ప్రసాదించినందుకు.
ఈ హదీస్ తప్పుడు మరియు నకిలీ హదీస్. దైవప్రవక్త(స.అ) నుండి ఇలాంటి ప్రస్తావన అసాధ్యం. దైవప్రవక్త(స.అ) మఆజ్‌తో ఎందుకని చెబుతారు! “ఒకవేళ నీకు ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లో, దాని ఆదేశం లేకుంటే” అని. వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తతో ఇలా ప్రవచించాడు:
وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ
అనువాదం: మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అది ప్రతీ విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది.[1. నహ్ల్ సూరా: 16, ఆయత్:89.]
مَّا فَرَّطۡنَا فِي ٱلۡكِتَٰبِ مِن شَيۡءٖ
అనువాదం: మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదిలిపెట్టలేదు.[2. అన్ఆమ్ సూరా:6, ఆయత్:38]
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْ
అనువాదం: దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దానిని వదిలి పెట్టండి.[హష్ర్ సూరా:59, ఆయత్:7]
ఇంకా అల్లాహ్ తన దైవప్రవక్త(స.అ)తో ఇలా కూడా ప్రవచించెను:
إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُ
అనువాదం: (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధాంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి గాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.[నిసా సూరా:4, ఆయత్:105]
ఈ ఆయత్
లు ఉండగా దైవప్రవక్త(స.అ) “మఆజ్”
తో “ఒకవేళ అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లో పరిష్కారం లేకుంటే?” అని ఎందుకు అడుగుతారు. ఈ ప్రశ్న, అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
లు లోపముగలవని, అంగీకారానికి నిదర్శనం కాదా!?. మరి రెండు కూడా మన సమస్యలను పరిష్కరించవు.

ఎవరైనా “మఆజ్ ఇబ్నె జబల్”
తో ఈ మాట దైవప్రవక్త(స.అ)గా ఎన్నుకొబడ్డ మొదటి రోజుల్లో చెప్పబడినది, అప్పటికి ఖుర్ఆన్ ఇంకా పూర్తిగా అవతరించబడలేదు” అని అడగవచ్చు.
వారికి మేమిచ్చే జావాబు: మీ ఈ వాదన కొన్ని కారణాల వల్ల సరైనది కాదు:
మొదటిది: స్వయంగా మఆజ్, “నేను అల్లాహ్ గ్రంథం ద్వార తీర్మానిస్తాను” అని చెప్పిన ఈ మాట “అతని వద్ద పూర్తి ఖుర్ఆన్ ఉంది” అన్న మాటను నిరూపిస్తుంది. ఆ తరువాత అతని ఈ మాట “నేను దైవప్రవక్త(స.అ) సున్నత్ ద్వార తీర్మానిస్తాను” ద్వార అర్ధమయ్యే విషయమేమిటంటే ఈ హదీస్ చాలా కాలం తరువాత ఎప్పుడైతే నస్స్
కు వ్యతిరేకంగా ఇజ్తిహాద్ చేయువారి ప్రవచనాలు ఎక్కువయ్యాయో అప్పుడు తయారు చేయబడినదని. ఎందుకంటే దైవప్రవక్త(స.అ) తరువాత అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ పదాలు ఎల్లప్పుడూ వాడుకలో ఉండేవి.

రెండవది: ఇది అల్లాహ్ యొక్క ఆదేశాలు తెలియని ప్రతీ మనిషి కోసం ఒక సాక్ష్యంగా మారిపోయేది. మరియు మనిషి స్వయఅభిప్రాయం ద్వార ఇజ్తిహాద్ చేస్తాడు మరియు తనకు నుసూస్
ను వెతికే కష్టాన్ని ఇవ్వడు. ఆ మాట ఈ విధంగా సరైనది కాదు.

మూడవది: అల్లాహ్ చెప్పిన ఈ ప్రవచనాల వల్ల సరైనది కాదు:
وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَٰفِرُونَ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ
అనువాదం: ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యారో వారే అవిశ్వాసులు. అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపత్ములు.[మాయిదహ్ సూరా:5, ఆయత్:44,45,47]  

నాలుగోవది: ఎందుకు సరైనది కాదంటే, అల్లాహ్ అహ్కాములు తెలియని వ్యక్తికి, అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) ఆదేశాలు తెలుసుకొకపోయేంత వరకు తీర్పు మరియు ఫత్వాలు ఇచ్చే హక్కులేదు. మరి అల్లాహ్ తన ప్రవక్తకు షరీఅత్ హక్కును ఇచ్చాడు. దాని గురించి అల్లాహ్ ప్రవచనం ఇలా ఉంది:
وَمَا كَانَ لِمُؤۡمِنٖ وَلَا مُؤۡمِنَةٍ إِذَا قَضَى ٱللَّهُ وَرَسُولُهُۥٓ أَمۡرًا أَن يَكُونَ لَهُمُ ٱلۡخِيَرَةُ مِنۡ أَمۡرِهِمۡ
అనువాదం: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనైనా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు.[అహ్జాబ్ సూరా:33, ఆయత్:36] అయినప్పటికీ దైవప్రవక్త(స.అ) తన జీవితాంతం ఎప్పుడు కూడా తన అభిప్రాయం మరియు ఇజ్తిహాద్ ద్వార దేన్ని పరిష్కరించలేదు. అంతేకాదు దైవప్రవక్త(స.అ) ఎల్లప్పుడూ జిబ్రయీల్ ద్వార అవతరించబడే అల్లాహ్ నుసూస్
కు కట్టుబడి ఉండేవారు. ఈ యదార్థాన్ని వ్యతిరేకించేటు వంటి రివాయతులన్నీ నకిలీ హదీసులే.

రిఫరెన్స్
అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13