అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత-2

శుక్ర, 03/25/2022 - 13:05

దైవప్రవక్త(స.అ), అహ్లెసున్నత్ 
వల్ జమాఅత్ ల ఫిఖా
ను అంగీకరించరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత-2

“ముతవక్కిల్”ని చూడండి, ఇతన్ని అహ్లె హదీస్‌లు “ముహ్‌యుస్సున్నహ్” అంటారు. ఇతన్ని, “అహ్మద్ ఇబ్నె హంబల్” చాలా గౌరవిస్తారు. న్యాయమూర్తుల ఎన్నికలో అతని ఆదేశాన్ని అనుచరిస్తారు. ముతవక్కిల్, అలీ(అ.స) మరియు అహ్లెబైత్(అ.స)
ల యొక్క బద్దశత్రువు. అతడి శత్రుత్వానికి హద్దేమిటంటే, అతడు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధిని నిర్మానుషం చేశాడు. మరియు సమాధి దర్శనాన్ని వెళ్ళకుండా నిబంధించాడు. అలీ(అ.స)తో సంబంధం కలిగి ఉన్న వారిని చంపేసేవాడు. “ఖారజ్మీ” తన పుస్తకం “రసాయల్”లో దినిని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: “ముతవక్కిల్, అబూ తాలిబ్ సంతానాన్ని దూషించే వారినే ధనం ఇచ్చేవాడు. మరియు అతడు నాజీబీల వర్గానికే సహకరించే వాడు”.[1]
గుర్తుంచుకోండి! నాసిబీయుల వర్గం, అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల వర్గమే. “ముతవక్కిల్” వారి వర్గాన్ని సహాయం చేశాడు. అందుకనే అతడు “ముహ్యుస్సున్నహ్” అయ్యాడు!, ఆలోచించండి.
“ఇబ్నె కసీర్”, “అల్ బిదాయతు వన్నిహాయహ్”లో ఇలా వ్రాశారు: అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు అఅమష్ నుండి హజ్రత్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) యొక్క శ్రేష్ఠత గురించి ఉన్న “తైర్” హదీస్
ను విన్నప్పుడల్లా అతడిని మసీదు నుండి బయటకు పంపించేసే వారు. మరియు అతడు కూర్చున్న చోటును నీళ్ళతో సుభ్రపరిచే వారు.[2]

మరి అలాగే అతను “తఫ్సీరె కబీర్” రచయిత మరియు గొప్ప చరిత్రకారుడైన “ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె జురైరె తబరీ” గదీర్ హదీస్ “من کنت مولاہ فھذا علی مولاہ” ను సరైనది అని అన్నారు. దానిని ఎన్నో రావీయుల క్రమం ద్వార సంగ్రాహించారు. అది తవాతుర్ రివాయత్ హద్దుకు చేరింది, అందుకని అతనిని సమాధిలో పూడ్చనివ్వకుండా ఆపివేశాడు.
“ఇబ్నె కసీర్” ఇలా అన్నారు: అతను “గదీర్ హదీస్” గురించి సంగ్రహించి వ్రాసిన దానిని నేను చూశాను. ఈ పుస్తకం రెండు పెద్ద పెద్ద భాగాలలో ఉంది. ఇంకో పుస్తకం ఉంది అందులో అతను “హదీసె తైర్ మష్వీ” రివాయత్
లను సంగ్రహించారు.[3]
ఇదే విషయాన్ని “ఇబ్నె హజర్” కూడా “లిసానుల్ మీజాన్”
లో వ్రాశారు: “జురైరె తబరీ”; గొప్ప వ్యాఖి, నమ్మకస్తుడు, సత్యవంతుడు, అతనిలో షియాఇజం ప్రవేసించింది మరియు దాని ద్వార హాని లేదు.[4]
“ఆరు సహీ గ్రంథాల” రచయితలలో ఒకరైన “ఇమామ్ నిసాయి”. అతను అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) యొక్క శ్రేష్ఠల గురించి ఒక పుస్తకం వ్రాసినప్పుడు, జనం అతనితో ముఆవియా శ్రేష్ఠతల గురించి ప్రశ్నించినప్పుడు, అతను ఇలా జవాబిచ్చారు: “నాకు (దైవప్రవక్త(స.అ) చెప్పిన) ముఆవియా యొక్క ఒక్క శ్రేష్ఠతే తెలుసు, అదేమిటంటే, అల్లాహ్! అతని పొట్టను ఎన్నటికి నింపకూ”. ఇది విని ప్రజలు అతని అంగం పై దాడి చేశారు. దానితో అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకో రివాయత్ ప్రకారం అతను ఆ దెబ్బ వలన చనిపోయారు.

“ఇబ్నె కసీర్” తాను వ్రాసిన చరిత్ర పుస్తకంలో, హిజ్రీ శకం363 సంఘటన క్రమంలో బగ్దాద్
లో షియా మరియు సున్నీయుల మధ్య ఆషూరా రోజు సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలను రచించారు.
అహ్లెసున్నత్‌ల ఒక బృందం, ఆయిషా అనుచరణ చేస్తూ, మరి కొందరు తల్హా అనుచరణ చేస్తూ అని అన్నారు, కొందరు జుబైర్ అనుచరణ చేస్తూ అని అన్నారు. వారు ఇలా అన్నారు: “మేము అలీ(అ.స) యొక్క సహాబీయులతో యుద్ధం చేస్తాము” దాని వల్ల చాలా మంది చనిపోయారు.[5]

ఈనాడు ఇండియాలో షియాల పట్ల అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల ప్రవర్తన ఇదే విధంగా ఉంది. ఆషూరా నాడు వారు సంతాప ఊరేగింపులకు భంగం కలిపించడానికై వారి పై దాడి చేస్తారు. ఆ కారణంగా మంచి ముస్లిముల రక్తం చిందుతుంది.  
ఈ సంఘటనల తరువాత ఒక విషయం అర్ధమౌతుంది, అదేమిటంటే; హజ్రత్ అలీ(అ.స) యొక్క శత్రువులు మరియు అహ్లెబైత్(అ.స)ల రక్తదాహము గలవారు తమ పేరు “అహ్లెసున్నత్ వల్ జమాఅత్” అని పెట్టుకున్నారు అని. మరియు వారి దృష్టిలో సున్నత్
కు అర్ధమేమిటో మరియు జమాఅత్
కు అర్ధమేమిటో కూడా తెలిసిందే.
దైవప్రవక్త(స.అ) ఇత్రత్(అ.స) యొక్క విరోధి, వారి పితామహులైన దైవప్రవక్త (స.అ) యొక్క విరోధి కూడానూ, మరి దైవప్రవక్త(స.అ) యొక్క విరోధి అల్లాహ్
కు విరోధి అన్న విషయం పై సాక్ష్యం అవసరం లేదు.
అలాగే అల్లాహ్, దైవప్రవక్త(స.అ) మరియ అహ్లెబైత్(అ.స) యొక్క విరోధి, కరుణామయుని దాసుడు కాడు. మరియు అతడికి సున్నత్
తో సంబంధం లేదు. అంతేకాదు అతడు “ఇబ్లీస్ సున్నత్” పై నడిచేవాడు, అని కూడా స్పష్టమౌతుంది.
ఎందుకంటే అల్లాహ్ యొక్క సున్నత్ అనగా దైవప్రవక్త(స.అ) మరియు అహ్లెబైత్(అ.స)ల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండడం. మరియు వారి మార్గం పై నడవటం. అల్లాహ్ ఇలా ప్రవచించెను.
قُل لَّآ أَسۡ‍َٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰ
అనువాదం: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: మీ నుండి (దౌత్యానికిగాను) ఎలాంటి ప్రతిఫలాన్నీ కోరను, బంధు (పట్ల) ప్రేమను తప్ప.[షూరా సూరా:42, ఆయత్:23]

ఆ తరువాత ముఆవియహ్
కు అలీ(అ.స)తో సంబంధమేమిటీ, మార్గభ్రష్ట ఇమాములకు రుజుమార్గదర్శక ఇమాములతో సంబంధమేమిటీ. మరియు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
కు షియాలతో సంబంధమేమిటీ!?
هَٰذَا بَيَانٞ لِّلنَّاسِ وَهُدٗى وَمَوۡعِظَةٞ لِّلۡمُتَّقِينَ
అనువాదం: సామాన్య ప్రజానీకం కోసం ఇది(ఈ ఖుర్ఆన్) ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హతోపదేశం.[ఆలి ఇమ్రన్ సూరా:3, ఆయత్:138]

రిఫరెన్స్
1. రసాయిల్, ఖారజ్మీ, పేజీ135.
2,3. అల్ బిదాయతు వన్నిహాయహ్, భాగం11, పేజీ147.
4. లిసానుల్ మీజాన్, ఇబ్నె హజర్, భాగం5, పేజీ103, ఇబ్నె హజర్ జీవిత చరిత్రలో.
5. అల్ బిదాయతు వన్నిహాయహ్, భాగం11, పేజీ274.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16