అహ్లెసున్నత్‌ల సలవాత్-1

శని, 03/26/2022 - 16:30

అహ్లెసున్నత్‌ల సలవాత్
లో ప్రక్షిప్తం జరిగింది అన్న విషయం పై కొన్ని నిదర్శనలు...

అహ్లెసున్నత్‌ల సలవాత్-1

అల్లాహ్ మీకు మంచిగా ఉంచుగాక! అహ్లెసున్నత్‌ల గూడరహస్యాలు తెలుసుకోవాలంటే మరియు వారి దైవప్రవక్త(స.అ) ఇత్రత్(అ.స) పట్ల ఎంత ద్వేషం, వైరం కలిగి ఉన్నారంటే వారు దైవప్రవక్త(స.అ)కు సంబంధించినటువంటి ప్రతీ శ్రేష్ఠతను ప్రక్షిప్తం చేశారు, అని తెలుసుకోవాలని అనుకుంటే ఈ అధ్యాయాన్ని పరిశీలనగా చదవిండి.
ఆ పక్షిప్తానికి బలి అయిన వాటి నుండి ఒకటి; “దైవప్రవక్త(స.అ) మరియు అతని సంతానం పై దురూద్” పంపడం. ఖుర్ఆన్
లో అల్లాహ్ దైవప్రవక్త(స.అ) ముహమ్మద్ మరియు అతని సంతానం పై దురూద్ పంపమని ఆదేశించాడు. అహ్లెసున్నత్ యొక్క ముహద్దిసీనులందరూ ముఖ్యంగా “బుఖారీ” మరియు “ముస్లిం”లు రివాయత్
ను ఇలా ఉల్లేఖించారు;إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِيِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ صَلُّواْ عَلَيۡهِ وَسَلِّمُواْ تَسۡلِيمًا ఈ ఆయత్ అవతరించబడినప్పుడు సహాబీయులు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఇలా అడిగారు: ఓ దైవప్రవక్తా! మేము మీపై ఎలా దురూద్ పంపాలి? మాకు మీపై దురూద్ పంపే విధానం తెలియదు.
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: اللّھم صلّی علیٰ محمّد و آلِ محمّد کما صلّیت علی ابراھیم و علیٰ آلِ ابراھیم انّک حمید مجید  [1]

మరి కొందరైతే దైవప్రవక్త(స.అ) యొక్క ఈ వచనాన్ని కూడా వెల్లడించారు “మీరు నా పై లోపముగల దురూద్
ను పంపకండి”. సహాబీయులు “ఈ లోపముగల దురూద్ ఏమిటి? ఓ దైవప్రవక్తా!” అని అడగగా, దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: మీరు “అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మద్” అని ఆగిపోతారు, అల్లాహ్ సంపూర్ణుడు మరియు ఆయన సంపూర్ణమైన వాటినే అంగీకరిస్తాడు.
“ఇమామ్ షాఫెయీ” దీనిని వివరిస్తూ ఇలా అన్నారు: “ఎవరైతే ముహమ్మద్ (స.అ) మరియు ఆయన అహ్లెబైత్(అ.స)ల పై దురూద్ పంపరో, అల్లాహ్ అతని నమాజ్
ను అంగీకరించడు”.
“సునను దారు ఖుత్నీ”లో “అబీ మస్వూదె అన్సారీ” యొక్క రావీయుల క్రమం ద్వార ఇలా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: ఎవరైతే నమాజ్
లో నా పై మరియు నా అహ్లెబైత్(అ.స) పై దురూద్ పంపరో, అల్లాహ్ అతడి నమాజ్
ను అంగీకరించడు.[2]
“ఇబ్నె హజర్”, “సవాయిఖుల్ ముహ్రిఖహ్
”లో ఇలా లిఖించారు; దైలమీ ఇలా రివాయత్
ను ఉల్లేఖించారు: దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “నా పై మరియు నా అహ్లెబైత్(అ.స)ల పై దురూద్ పంపనంత వరకు దుఆ కప్పబడే ఉంటుంది”.[3]
“తబరానీ”, “మోజముల్ ఔసత్”
లో హజ్రత్ అలీ(అ.స) రివాయత్
ను ఇలా ఉల్లేఖించారు. అతను ఇలా అన్నారు: ప్రతీ దుఆ కప్పబడే ఉంటుంది ముహమ్మద్(స.అ) మరియు ఆలె ముహమ్మద్(ముహమ్మద్ కుటుంబీకులు) పై దురూద్ పంపనంతవరకు.[4]

రిఫరెన్స్
1. సహీబుఖారీ, భాగం4, పేజీ118.
2. సునను దారు ఖుత్నీ, పేజీ136.
3. సవాయిఖుల్ ముహ్రిఖహ్, పేజీ88.
4. ఫైజుల్ ఖదీర్, భాగం5, పేజీ19. కన్జూల్ ఉమ్మాల్, భాగం1, పేజీ173.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20