అహ్లెబైత్(అ.స) పట్ల అహ్లెసున్నత్‌ల వ్యతిరేకత వివరణ కొన్ని చారిత్రాత్మిక రచనల మరియు ముహద్దిసీనుల ఉల్లేఖనల ద్వార...

మనకు అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల యొక్క “సహ్హాహ్”
ల యొక్క దురూద్ విధానం అర్ధం అయ్యిందంటే అల్లాహ్, ముహమ్మద్(స.అ) మరియు ఆలె ముహమ్మద్(స.అ) పై దురూద్ పంపకుండా చదివిన ఆ దాసుని నమాజ్‌ను కూడా అంగీకరించడు, అని కూడా అర్ధం అవుతుంది. మరియు అలాగే ముహమ్మద్ (స.అ) మరియు ఆలె ముహమ్మద్(స.అ) పై దురూద్ పంపకుండా చేసిన ముస్లిము యొక్క దుఆ కూడా కప్పబడే ఉంటుంది. నా ఆత్మసాక్షిగా ఇది ముహమ్మద్(స.అ) మరియు అలె ముహమ్మద్
(స.అ)కు సమస్త మానవుల పై ప్రసాదించబడిన అతిపెద్ద ప్రతిష్టత మరియు స్పష్టమైన కీర్తి. కనుక ముస్లిములు వారి ద్వారానే అల్లాహ్
కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.
కాని అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు అహ్లెబైత్(అ.స)ల ఈ ప్రతిష్టతను సహించలేరు. మరియు వారు, వాటి యొక్క భయంకరమైన ఫలితాలు అనుభవించారు. ఎందుకంటే అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియు సహాబీయు లందరి కొరకు తప్పుడు ప్రతిష్టతలు మరియు భావకీర్తి సృష్టించుకున్నప్పటికీ కూడా వారు ఆ స్థాయికి చేరలేకపోయారు. మరియు ఆ స్థానం పొందలేక పోయారు. ఎందుకంటే అల్లాహ్ వారి మరియు వారి బృందం యొక్క నమాజును అంగీకరించడు ఎందుకంటే వారు ముహమ్మద్ తరువాత ఇత్రత్(అ.స) యొక్క ప్రముఖులైన అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) పై దురూద్ పంపరు కాబట్టి.
అందుకని అహ్లెసున్నత్‌లు దురూద్‌లో ప్రక్షిప్తం చేసి తమ ప్రియమైన ఖలీఫాల పేర్లను జోడించారు, వారి ఘనత పెరగాలని.
వాస్తవానికి దైవప్రవక్త(స.అ) అలా చేయమని ఆదేశించలేదు. కనుక వారు మొదటి శతాబ్దినుండే లోపముగల దురూద్
నే పంపుతూ వచ్చారు. మీరు గమనించే ఉంటారు వారి గ్రంథాలలో లోపముగల దురూదే వ్రాయబడి ఉంటుంది. వారు కేవలం ముహమ్మద్(స.అ) పేరును “నబీ” లేదా “రసూల్” అని వ్రాస్తారు మరియు “ఆలె ముహమ్మద్” ప్రస్తావన లేకుండా “స్వల్లల్లాహు అలైహి వసల్లమ్” అని వ్రాసేస్తారు.
ఈ కాలంలో ఒకవేళ మీరు వారి నుండి ఎవరితోనైనా సంభాషించి వారితో దైవప్రవక్త(స.అ) ముహమ్మద్(స.అ) పై దురూద్ పంపమని చెప్పండి వారు “ఆలె ముహమ్మద్” ప్రస్తావన లేకుండా “స్వల్లల్లాహు అలైహి వసల్లమ్” అని జవాబిస్తారు. వారిలో కొందరైతే అస్పష్టమైన దురూద్
ను పంపుతారు. కనుక వారు “స్వల్లె వ సల్లమ్” తప్ప ఏది అర్ధం చేసుకోలేకపోయారు.
కాని మీరు “అరబీ” లేదా “అజమీ” షియాను దురూద్ పంపమని చెబితేవారు “అల్లాహుమ్మ స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్” అని పూర్తి దురూద్
ను చదువుతారు.
వాస్తవానికి అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క గ్రంథాలలో దైవప్రవక్త(స.అ) యొక్క వచనం ఇలా ఇల్లేఖించబడి ఉంది: “قولوا اللّھم صلّ علیٰ محمّد و آل محمّد” ఇది ప్రస్తుత కాలం మరియు భవిష్యత్తు కాలానికి సంబంధించే వ్యాకరణము రూపంలో ఉంది. మరియు అందులో అల్లాహ్‌తో వేడుక ఉంది.
కాని అహ్లెసున్నత్ “صلّی اللہ علیه و سلّم” వరకే చదివి సరిపెట్టుకుంటారు. మరి ఇది భూతకాలానికి సంబంధించిన వ్యాకరణము ఇది కేవలం వార్తను అందిస్తుంది.
అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌ల నాయకుడు ముఆవియా ఇబ్నె అబీ సుఫ్యాన్ “అజాన్” నుండి కూడా దైవప్రవక్త(స.అ) పేరును తొలగించాలని చాలా ప్రయత్నించాడు.[1]
అతడి అనుచరుల కొరకు దురూద్
లో ప్రక్షిప్తం చేయడం, అదేమి అపూర్వమైన విషయంకాదు. అంతేకాదు ఒకవేళ వారిలో దురూద్
ను తొలగించే శక్తే గనక ఉంటే వారు తప్పకుండా తొలగించేసే వారు. కాని ఇక ఇప్పుడు వారికి కేవలం శోకంతో కూడిన పశ్చాత్తాపమే మిగిలింది.
ఈనాడు మీరు వారి ప్రతీ పీఠం నుండి, ముఖ్యంగా వహాబీయుల పీఠాల నుండి ప్రక్షిప్తంగల దురూద్
ను వినగలరు. వారి లుప్త దురూదే నలువైపులు వినిపిస్తూ ఉంటుంది. కాని ఒకవేళ వారు విధిలేక పూర్తిగా దురూద్ చదావల్సి వస్తే అందులో “و علیٰ اصحابه اجمعین”(వ అలా అస్హాబిహి అజ్మయీన్) అని జోడించి చదువుతారు. లేదా అంతకు మించి కూడా చెబుతూ ఉంటారు “ و علیٰ اصحابه الطبیبین الطاھرین” (వ అలా అస్హాబిహిత్తయ్యబీనత్తాహిరీన్) ఇలా వారు “తత్హీర్ ఆయత్”, సహాబీయుల ప్రతిష్ఠతను వెల్లడిస్తూ అవతరించబడినది, అన్న విషయాన్ని నమ్మించాలని అనుకుంటున్నారు. ఈ విధంగా చూసినట్లైతే సహాబీయులు మరియు అహ్లెబైత్(అ.స)లు సమానం అన్న మాట.
ఈ మోసం మరియు ప్రక్షిప్తాన్ని వారు వారి ప్రముఖ ఫిఖాజ్ఞాని మరియు అధినాయకుడైన అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ నుండి పొందినది. అతడు అహ్లెబైత్(స.అ)ల కఠోరశత్రువు.
“మాలిక్” తన “మొఅత్తా”లో ఇలా వ్రాశారు: “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్, దైవప్రవక్త(స.అ) యొక్క సమాధి వద్దకు వచ్చి అతని పై దురూద్ పంపడంతో పాటు అబూబక్ర్ మరియు ఉమర్‌ల పై కూడా దురూద్ పంపేవారు”.[2]
గౌరవనీయులైన పాఠకులారా! మీరు ఉపయుక్తముగా పరిశీలిస్తే మీకు ఖుర్ఆన్
లోగాని లేదా సున్నత్
లోగాని “సహాబీయులు” అన్న పదం కనిపించదు.
అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్‌లో కేవలం ముహమ్మద్(స.అ) మరియు ఆలె ముహమ్మద్(స.అ) పై దురూద్ పంపమని ఆదేశించబడి ఉంది. మరియు (దురూద్ పంపే) ఈ ఆదేశం అందరి కన్న ముందు సహాబీయుల పైనే విధి.
దురూద్
లో సహాబీయులను జోడించడం. ఇది కేవలం అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లోనే ఉంది. మరియు ఇదేమీ కొత్త విషయం కాదు. వాళ్ళు ఇస్లాం ధర్మంలో ఎన్ని బిద్అత్‌లను సృష్టించి వాటిని సున్నత్‌గా మార్చేశారో తెలియదు. ఇవన్నీ చేయడానికి కారణమేమిటంటే ఈ విధంగా ప్రతిష్టతలను కప్పెట్టేయ్యాలి మరియు యదార్థాన్ని దాచేయాలి, అంతే.
يُرِيدُونَ لِيُطۡفُِٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَٱللَّهُ مُتِمُّ نُورِهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ
అనువాదం: వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది అర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగావిస్తాడు. అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!.[సఫ్ సూరా:61, ఆయత్:8]
“దీంతో మనకు వాస్తవానికి ఎవరు అహ్లెసున్నత్ లు అన్న విషయం స్పష్టమౌతుంది”.
రిఫరెన్స్
1. అహ్లె జిక్ర్, తీజానీ సమావీ.
2. తన్వీరుల్ హవాలిక్ ఫి షర్హె ముఅత్తయే మాలిక్, భాగం1, పేజీ180.
వ్యాఖ్యానించండి