అహ్లెసున్నత్‌ల ఇమాములు

ఆది, 03/27/2022 - 16:56

అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల ఇమాములు మరియు నాయకుల గురించి సంక్షిప్త వివరణ...

అహ్లెసున్నత్‌ల ఇమాములు

ఈ వ్యాసం ద్వార ప్రతీ వివేకం మరియు స్వేచ్ఛ, స్వమతపక్షపాతం లేని మనిషి కోసం అతని బాహ్య మరియు అంతర్ దృష్టి పై పడి ఉన్న ముసుగును తొలగించి దాంతో అతడు యదార్థాన్ని తెలుసుకొని రుజుమార్గం పొందాలనే మా అభిలాష. ఇలాంటి వారికి మేము చెప్పే విషయం ఇదే: అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క నాయకులందరూ, మరియు వారి ఇమాములందరూ దైవప్రవక్త(స.అ) సున్నత్
లను స్పష్టంగా వ్యతిరేకించారు, దానిని విడిచారు. మరియు ఉద్దేశపూర్వకంగానే దానిని వదిలేశారు.
ఏ ముస్లిమైనా సరే, వారూవీరు చెప్పుకునే వారి కీర్తి విని మోసపోకూడదు, ఎందుకంటే వారి మాటలు స్పష్టమైన సాక్ష్యాల పై ఆధారపడి లేవు.
మేము యదార్థాన్ని తెలియపరుస్తున్నాము, వారి పై నింద వేయడం లేదు. వారు తమ సహ్హాహ్, మసానీద్ మరియు చరిత్ర పుస్తకాలలో చెప్పిన విషయాలనే చెబుతున్నాము. రుజుమార్గదర్శపు సూర్యుడు ఉదయించాలని, మార్గభ్రష్టత మబ్బులు ప్రక్కకు పోవాలని మరియు చీకటి ఉన్న స్థానంలో వెలుగు చోటుచేసుకోవాలని, భావిస్తున్నాము.
మేము తరువాత వ్యాసాలలో ఆ నాయకుల మరియు ఇమాముల పరిస్థితులను, చరిత్రను మీ కోసం వివరిస్తాము. అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు వారిని నమ్ముతారు, వారిని ఫిఖా జ్ఞాన మూలంగా భావిస్తారు మరియు వారిని పవిత్ర ఇమాముల పై ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ జ్ఞానుల అజ్ఞానులదరికి తెలిసిన, దురాచారులు మరియు దుర్మార్గులుగా మరియు ఇస్లాంకు దూరమైనటువంటి సహాబీయులు, వారు; ముఆవీయా, అతడి కుమారుడు యజీద్, అమ్ర్ ఇబ్నె ఆస్, ఇబ్నె మర్వాన్ మరియు ఇబ్నె షఅబహ్ మొ॥ కాకుండా వేరే వారి గురించి చెబుతాము. వీరు చేసిన దుర్మార్గాలు అందరికి తెలిసినవే.[1]

ఒకవేళ మీరు అరేబియా యొక్క “అహ్లెసున్నత్ వల్ జమాఅత్”ల కొన్ని దేశాలకు ప్రయాణిస్తే అక్కడ వారి గురించి ఘనంగా ప్రస్తావనలు వింటారు. వారి పేరున రోడ్ల పేర్లు మరియు వారి ఖిలాఫత్ సరైనదని మరియు వారి పరిపాల మంచిదని ఎన్నో పుస్తకాలు చూడగలరు.
కాని మేము ఈ సంభాషణలో న్యాయధర్మాలలో, ధర్మనిష్టలో ప్రఖ్యాతి చెందిన వారి గురించి మరియు అహ్లెసున్నత్ దృష్టిలో నమ్మకం కలిగి ఉన్న వారి గురించి తప్పకుండా ఇక్కడ చర్చిస్తాము. దాని వల్ల ఈ కొన్ని విషయాలను పరిశీలించ వచ్చు; వారు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను ఏఏ విధాలుగా మార్చేశారు, ప్రక్షిప్తం చేశారు. ఈ ఉమ్మత్‌లో విబేధాలు ఏర్పడేటువంటి మరియు మార్గ భ్రష్టతను వ్యాపించేటువంటి బిద్అత్
లను సృష్టించారు. దైవప్రవక్త(స.అ) కట్టు కొచ్చిన గొప్ప కట్టడం యొక్క పునాదులను పీకి పారేశారు, నిజానికి దైవప్రవక్త(స.అ) దానిని బలపరచే మరియు కాపాడే క్రమంలో తన పూర్తి జీవితాన్ని ఖర్చు చేశారు.
అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క నాయకుల నుండి ఇస్లాం యొక్క నిషానీలను తుడిచివేయడం మరియు ఉమ్మత్
లో విభేదాలు సృష్టించడంలో హస్తం ఉన్న ఆ 12 వ్యక్తులనే ఎన్నుకున్నాము.

అహ్లెసున్నత్ వల్ జమాఅత్ల ఇమాములు మరియు నాయకులు
మొదటి ఖలీఫా అబూబక్ర్ ఇబ్నె అబూ ఖహాఫహ్
రెండవ ఖలీఫా ఉమర్ ఇబ్నె ఖత్తాబ్
మూడవ ఖలీఫా ఉస్మాన్ ఇబ్నె అఫ్వాన్
తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్
జబైర్ ఇబ్నె అల్ అవామ్
సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్
అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్
ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా బింతె అబీబక్ర్
ఖాలిద్ ఇబ్నె వలీద్
అబూ హురైరహ్ దువైసీ
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్
అబ్దుల్లాహ్ ఇబ్నె జుబైర్
పైనున్న వారినే అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క లెక్కలేనివన్ని నాయకుల నుండి ఎందుకు ఎంచుకోబడిందంటే, వీరి ప్రతిష్టతలే ఎక్కువగా ప్రవచించబడి ఉన్నాయి. లేదా ఎక్కువ రివాయత్
లు ఉల్లేఖించిన వారు ఉన్నారు. మరియు అహ్లెసున్నత్ ఆలోచన ప్రకారం వీరి నుండే జ్ఞానం పొంగుతుంది.
తరువాత వ్యాసాలలో ప్రతీ ఒక్కరి గురించి సంక్షిప్తంగా వివరిస్తాము. మరియు ప్రతీ ఒక్కరు తెలిసో లేక అజ్ఞానం వలనో దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించారు, అని చెబుతాము. దీని ద్వార పరిశోధకుడికి, అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు వాదించేది, వారి వద్ద లేదు అని తెలుస్తుంది. అంతేకాదు వారు కోరికలకు విధేయులై “మేమే సత్యమార్గం పై ఉన్నాము మిగిలిన వారందరూ మార్గభ్రష్టులు” అని భావిస్తారు. [2]

రిఫరెన్స్
1. ఇబ్నె సఅద్, తబఖాతుల్ కుబ్రా, భాగం1, పేజీ47లో అబ్దుల్లాహ్ ఇబ్నె హంజలా(గసీలుల్ మలాయికహ్) ఉల్లేఖనాన్ని ఇలా లిఖించారు: అతడు ఇలా అన్నాడు: అల్లాహ్ సాక్షిగా మేము యజీద్
ను వ్యతిరేకించలేదు, అందుకు మాకు భయంగా ఉండేది ఎక్కడ ఆకాశం నుండి మా పై రాళ్ళ వర్షం కురుస్తుందో అని, (ఎందుకంటే) అతడు అమ్మా, చెల్లెల్లు మరియు కూతుర్లతో నికాహ్ చేసుకునే వాడు, మధ్యం సేవించేవాడు, నమాజ్ చేసే వాడు కాదు, అల్లాహ్ సాక్షిగా నన్ను ఏ ఒక్కరు సహకరించకపోయినా సరే అల్లాహ్ కొరకు అతనిని అంతం చేసేవాడిని, అలా మంచి సాహసం చేసిన వాడినైయ్యేవాడిని.
అవును! దుర్మార్గుడైన ఈ యజీదే, దైవప్రవక్త(స.అ) యొక్క మనవడు మరియు అతని కుటుంబీకులను చంపాడు మరియు మదీనా వాసుల మానమర్యాదలను తన సైన్యం పై ముబాహ్
గా నిర్ధారించాడు. ఇలా ఉన్నప్పటికీ ఈనాడు మీరు ప్రముఖ ఇస్లామీయ అధికారం చూడగలరు, అది యజీద్ గురించి “హఖాయిఖు అన్ అమీరిల్ మొమినీన్ ఇబ్నె ముఆవియహ్” అను పుస్తకాన్ని రచిస్తుంది.
2. అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7