అబూబక్ర్ ఇబ్నె అబీ ఖహాఫహ్-2

మంగళ, 03/29/2022 - 17:05

అహ్లె సున్నత్ వారు విశ్వసించే 12 మంది నాయకులలో మొదటి నాయకుని గురించి మరియు వారు చేసిన పనుల గురించి సంక్షిప్తం వివరణ...

అబూబక్ర్ సిద్దీఖ్ ఇబ్నె అబీ ఖహాఫహ్-2

అబూబక్ర్ ఇలా అంటూ ఉండేవారు: “నన్ను మన దైవప్రవక్త(స.అ) సున్నత్
పై బలవంతంగా నడిపించకండి ఎందుకంటే నాలో అంత శక్తి లేదు”.
అంటే అబూబక్ర్
లో దైవప్రవక్త(స.అ) సున్నత్
పై నిలకడగా ఉండే శక్తి లేనప్పుడు ఇక అతని అన్సారులు, అనుచరులు మేము “అహ్లెసున్నత్
లం” అని ఎలా వాదిస్తున్నారు.
బహుశ అబూబక్ర్, దైవప్రవక్త(స.అ) సున్నత్
ను అనుసరించకపోవడానికి గల కారణం, సున్నత్ అతనికి అతను చేసే పని మరియు దైవప్రవక్త(స.అ) చేసే పని పూర్తిగా వైరు అని చూపిస్తుందేమో. వాస్తవం చూసినట్లైతే అల్లాహ్ ఇలా ప్రవచించెను:
وَمَا جَعَلَ عَلَيۡكُمۡ فِي ٱلدِّينِ مِنۡ حَرَجٖ
అనువాదం: ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు.[ హజ్ సూరా:22, ఆయత్:78.]   
يُرِيدُ ٱللَّهُ بِكُمُ ٱلۡيُسۡرَ وَلَا يُرِيدُ بِكُمُ ٱلۡعُسۡرَ       
అనువాదం: అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు.[ బఖరా సూరా:2, ఆయత్:185.]
لَا يُكَلِّفُ ٱللَّهُ نَفۡسًا إِلَّا وُسۡعَهَا
అనువాదం: అల్లాహ్ ఏ ప్రాణపైనా దాని శక్తిని మించిన భారం వేయడు.[ బఖరా సూరా:2, ఆయత్:286.]   
وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ
అనువాదం: దైవప్రవక్త(స.అ) మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దానిని వదిలి పెట్టండి.[ హష్ర్ సూరా:59, ఆయత్:7.]
“నాలో దైవప్రవక్త(స.అ) సున్నత్
పై నడిచే శక్తి లేదు” అన్న అబూబక్ర్ యొక్క ఈ వచనం ఖుర్ఆన్ ఆయత్
లను నిరాకరిస్తుంది. దైవప్రవక్త(స.అ) అనంతరం మొదటి ఖలీఫా అయిన అబూబక్ర్ ఆ కాలంలోనే దైవప్రవక్త(స.అ) సున్నత్ పై అమలు చేసే శక్తిలేకపోతే ఇక ఈ కాలపు ముస్లిములను ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ పైనే అమలు చేయమని ఎలా కోరగలరు?

నిజానికి మేము అబూబక్ర్
ను బలహీనుడు మరియు అజ్ఞాని కూడా అమలు చేయగల సులభమైన కార్యములలో కూడా దైవప్రవక్త(స.అ) సున్నత్
ను వ్యతిరేకించడాన్ని చూశాము.
దైవప్రవక్త(స.అ) స్వయంగా కుర్బానీ చేసేవారు, దాని పై అమలు చేయమని తాకీదు చేసే వారు. కాని అబూబక్ర్ కుర్బాని బలిని వదిలేశారు. నిజానికి ముస్లిములందరికి కూడా తెలుసు కుర్బానీ మిక్కిలి పుణ్యం గలదని. మరి ముస్లిముల ఖలీఫా దానిని ఎందుకు వదిలేసినట్లూ?
“ఇమామ్ షాఫెయీ”, “కితాబుల్ ఉమ్మ్”లో మరియు ఇతర ముహద్దిసీన్‌లు ఇలా ప్రవచించారు[1]: అబూబక్ర్ మరియు ఉమర్(రజియల్లాహు అన్హుమా) ఇద్దరు కూడా కుర్బానీ చేసేవారు కాదు. మరియు వారు, ప్రజలు మా అడుగుజాడలో నడిచి దానిని ఎక్కడ వాజిబ్ అనుకుంటారో అని భావించేవారు”.
ఈ కారణం అసత్యం. దీని పై ఎటువంటి సాక్ష్యం లేదు. ఎందుకంటే సహాబీయులందరికి తెలుసు “కుర్బానీ ముస్తహబ్,  వాజిబ్ కాదు” అని.
ఒకవేళ ప్రజలు కుర్బానీ వాజిబ్ అని బావించేవారనే అనుకుందాం. అయితే అందులో తప్పేముంది. ఉమర్ తరావీహ్ నమాజ్ యొక్క బిద్అత్
ను సృష్టించారు. అది ముస్తహబూ కాదు మరియు వాజిబూ కాదు, అంతేకాదు దానికి వ్యతిరేకమైనది కూడానూ, ఎందుకంటే దైవప్రవక్త(స.అ) దానిని నిషేధించారు. మరి ఈనాడు చాలా మంది అహ్లెసున్నత్
లు తరావీహ్ నమాజ్
ను “వాజిబ్” అని అనుకుంటారు.
బహుశ అబూబక్ర్, ఉమర్
లు కుర్బానీ చేయకుండా మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
ను అనుసరించకుండా “దైవప్రవక్త(స.అ) చేసిన ప్రతీ పని వాజిబ్ కాదు అందుకని దానిని వదిలి పెట్ట వచ్చు” అన్న సందేహంలో ప్రజలను పడేయాలని అనుకున్నారేమో.
మరియు దీని ద్వార వారి “మాకు అల్లాహ్ గ్రంథమే చాలు” అన్న వచన బలం పెరుగుతుంది. మరియు అబూబక్ర్ చెప్పిన “దైవప్రవక్త(స.అ) ఏ హదీస్
ను కూడా ఉల్లేఖించకండి అంతేకాదు; మా మరియు మీ మధ్య అల్లాహ్ గ్రంథం ఉంది దాని హలాల్‌ను హలాల్ మరియు దాని హరామ్‌ను హరామ్, అని భావించండి” అన్న ఈ మాటకు కూడా సహాయపడుతుంది.
ఇక ఇప్పుడు ఒక పరిశోధకుడు చాలా బాగా అర్ధం చేసుకోగలడు అహ్లెసున్నత్
లలో దైవప్రవక్త(స.అ) సున్నత్ ఎందుకని త్యజింపబడినదిగా, తెలియకుండా ఉండిపోయింది, అని. మరియు వారు స్వయఅభిప్రాయాల, ఖియాస్ మరియు ఇస్తిహ్సాన్ ద్వార ఎలా అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) అహ్కాములను మార్చేశారు, అని.
నేను ఈ ఉదాహారణాలను అబూబక్ర్ దైవప్రవక్త(స.అ) సున్నత్ క్రమంలో చేసిన పనుల నుండి తీశాను. ఉదాహారణకు; దైవప్రవక్త(స.అ) సున్నత్
ను తిరస్కరించడం, హదీసులను కాల్చివేయడం, దానిని చూడనట్లు వదిలేయడం. మేము అనుకుంటే ఈ టాపిక్ పై ప్రత్యేకంగా ఒక పుస్తకం వ్రాసేస్తాము.
ఇంత తక్కువ జ్ఞానంగల మనిషితో ఒక ముస్లిం ఎలా సంతృప్తి చెందగలడు. అతడి జ్ఞానం చూస్తే ఇది, దైవప్రవక్త(స.అ) సున్నత్ విషయంలో అతడి ప్రవర్తన అది. మరి ఇతనిని అనుచరించే వారు ఎలా “అహ్లెసున్నత్‌లు” అని పిలవబడతారు!?. (చెప్పండి!)

అహ్లెసున్నత్
లు దానిని(సున్నత్)ను వదలలేరు మరియు దానిని నిప్పంటించి నాశనం చేయనూ లేరు. ఎంతమాత్రం ఇలా చేయరు, అంతే కాదు అహ్లెసున్నత్
లు దానిని అనుచరిస్తారు మరియు దానిని పవిత్రంగా భావిస్తారు.
قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡكَٰفِرِينَ
అనువాదం: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు” వారికి చెప్పు: “మీరు అల్లాహ్
కూ, ప్రవక్తకూ విధేయులై ఉండండి.” ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారలను ఏమాత్రం ఇష్టపడడు.[ఆలి ఇమ్రాన్ సూరా:3, ఆయత్:31-32]

రిఫరెన్స్
1. సుననుల్ కుబ్రా, బైహఖీ, భాగం9, పేజీ265. జమ్ఉల్ జవామే, సీవ్తీ, భాగం3, పేజీ45.
 అల్ షియా, హుమ్ అహ్లుస్సున్నహ్, సమావీ తీజానీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13