ప్రభువు యొక్క అర్థం-1

మంగళ, 04/05/2022 - 14:15

మన ప్రభువు యొక్క సంకేతాలు మరియు విశిష్టతలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ప్రభువు యొక్క అర్థం-1

ప్రభువు సంకేతాలు
1. ఖుర్ఆన్ ఉపదేశం: “అల్లాహ్ మీ కొరకు రాత్రిని చేశాడు – అందులో మీరు విశ్రాంతి పొందటానికి! మరి ఆయనే పగటిని (మీరు) చూడగలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు గలవాడు. కాని ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు. ఈ అల్లాహ యే నీ (అందరికీ) ప్రభువు, ప్రతి వస్తువునూ సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు?”[సూరయె ము’మిన్, ఆయత్61,62]
2. ఖుర్ఆన్ ఉపదేశం: “అల్లాహ్ యే మీ కోసం భూమిని నివాసస్థలంగా చేశాడు. ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాలా అందమైన రూపాన్నిచ్చాడు. తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ప్రసాదించాడు. ఈ అల్లాహ్ యే మీ ప్రభువు. మరి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ శుభాలు కలవాడు”[సూరయె ము.మిన్, ఆయత్64]
3. ఖుర్ఆన్ ఉపదేశం: “ఆయన రాత్రిని పగటిలోనికి జోప్పిస్తున్నాడు, పగటిని రాత్రిలోనికి జోప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను (తన శాసన) నిబద్ధుల్ని చేశాడు – ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్ యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు”.[సూరయె ఫాతిర్, ఆయత్13]
4. ఖుర్ఆన్ ఉపదేశం: “ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండీ, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికితీసేవాడెవడు? సమస్త కార్యల నిర్వహణకర్త ఎవరు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ యే” అని వారు తప్పకుండా చెబుతారు. “మరలాంటప్పుడు మీర (దేవుని శిక్షకు) ఎందుకు భయపడరు? ఆ అల్లాహ్ యే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుందీ? మరి మీరు ఎటు మరలిపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.[సూరయె యూనుస్, ఆయత్31,32]
5. ఖుర్ఆన్ ఉపదేశం: “ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్ కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు. ఆయనే అల్లాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే”.[సూరయె అన్ఆమ్, ఆయత్101,102]

ఆయన మీ ప్రభువు
1. ఖుర్ఆన్ ఉపదేశం: మీ కోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని. నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు.[సూరయె ఇస్రా, ఆయత్66]
2. ఖుర్ఆన్ ఉపదేశం: అతను ఇలా చెప్పాడు: “కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేనూ ఒకణ్ణి”.[సూరయె అంబియా, ఆయత్56]
3. ఖుర్ఆన్ ఉపదేశం: “నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలను, భూమినీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షంలో) సిఫారసు చేయగల వాడెవడూలేడు. అటువంటి అల్లాహ్ యే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా (ఇంత చెప్పినా) మీరు గుణపాఠం గ్రహించరా?”[సూరయె యూనుస్, ఆయత్3]
4. ఖుర్ఆన్ ఉపదేశం: “నిస్సందేహంగా అల్లాహ్ యే నీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్ పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన సొంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు”.[సూరయె అఅరాఫ్, ఆయత్54]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17