ఈ రోజు సమాజంలో ఏర్పడే సమస్యలన్నింటికి కారణం వారికి మంచి శిక్షణ లేకపోవటమే అందుకే ఒక మంచి సమాజం యొక్క నిర్మాణానికి బాల్యంలోనే మంచి శిక్షణ మరియు విధ్యాబుధ్ధి అందించటం చాలా అవసరం.
పిల్లలను పెంచడం మరియు పొషించడం తల్లితండ్రుల కర్తవ్యం కానీ దాని కన్నా ముఖ్యమైనది వారికి మంచి అలవాట్లను మరియు మంచి తీరును అలవర్చడం،ఎలగైతే పువ్వుకు అది పూసే సమయంలో దాని రక్షణ ఎంత అవసరమో అలాగే బాల్య స్థితిలోనే ఈ పిల్లలను చెడు అలవాట్ల బారిన పడకుండా సం రక్షించడం కూడా అంతే అవసరం.
ప్రతీ చిన్న విషయంలో శ్రధ్ధ వహించే మానవుడు అతి గాఢాభంగా మరియు ప్రాణానికి ప్రాణంగా పెంచుకొనే తన పిల్లల విషయంలో అశ్రధ్ధగా లేదా నిర్లక్ష్యంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది,ఇస్లాంలో పిల్లల పోషణ,శిక్షణ గురించి చాల ప్రాముఖ్యత ఉంది,మహప్రవక్త ఆ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా ఉల్లేఖించారు:
"اکرموا اولادکم و احسنوا آدابھم یغفرلکم"
“మీ పిల్లలను గౌరవించండి మరియు వారికి మంచి శిక్షణ ఇవ్వండి తద్వార మీరు ఆ దేవుని క్షమాభిక్షకు అర్హులు అవుతారు”[మీజానుల్ హిక్మహ్,1వ భాగం,పేజీ నం:103].
మంచి శిక్షణ అంటే వారిని ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ఏదో నాలుగు మంచి మాటలు మరియు నాలుగు ఆచారాలను వారికి అలవాటు చేయడం కాదు వారికి స్వేచ్చను కలిపించి వారు అడిగే ప్రతీ ప్రశ్నకు విసుగుకోకుండా సమాధానం చెప్పాలి,మహనీయ ప్రవక్త(స.అ.వ) ఈ విధంగా సెలవిచ్చారు:
"کل مولود یولد علی الفطرۃ حتی یکون ابواہ یھودانه و ینصرانه"
"జన్మించే ప్రతి సిశువు స్వాభావికంగా ఎకేశ్వరవాదిగా జన్మిస్తాడు కాని వారి తల్లి తండ్రులు వారిని యహూదీగానో మరియు ఒక క్రైస్తవునిగానో మార్చేస్తారు"[అల్-హదీస్,2వ భాగం,పేజీ నం:377].
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
"యుక్త వయస్సుకు సమీపించిన పిల్లల హ్రుదయాలు ఖాళీ భూమి (పంటకు సహకరించే భూమి) లాంటివి వాటిలో ఏ విత్తనాన్ని నాటినా దానిని అవి స్వీకరిస్తాయి"[తొహ్ఫుల్ ఉఖూల్,పేజీ నం:67].
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు:
"మీరు మీ పిల్లలకు ఇచ్చే సర్వోత్తమమైన ఆస్తి మీ డబ్బు లేదా మీ సంపద కాదు!ఎందుకంటే సంపద కొంత కాలం తరువాత నసించిపొయేదే కానీ మంచి శిక్షణ ఎప్పటికి నిలిచిపోతుంది"[మీజానుల్ హిక్మహ్,1వ భాగం,పేజీ నం:101].
వ్యాఖ్యలు
Mashallah good explanation, it's very very useful
Jazakallah......
వ్యాఖ్యానించండి