ప్రభువు యొక్క అర్థం-2

బుధ, 04/06/2022 - 07:44

ఓ నా ఆరాధ్యదైవమా! నేను గర్వించడానికి నువ్వ నా ప్రభువు అన్న మాట చాలు. నా గౌరవం కోసం నేను నీ దాసుడని అన్న విషయం చాలు...

ప్రభువు యొక్క అర్థం-2

 

ఆరాధించబడేవాడే ప్రభువు
1. ఖుర్ఆన్ ఉపదేశం: “నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం(అని ఈసా – ఏసుక్రీస్తు – బోధించారు)”[సూరయె మర్యమ్, ఆయత్36; ఆలిఇమ్రాన్, ఆయత్51; జుఖ్రుఫ్, ఆయత్64]
2. ఖుర్ఆన్ ఉపదేశం: “ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి – తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు”.[సూరయె బఖరహ్, ఆయత్21]
3. ఖుర్ఆన్ ఉపదేశం: “నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చేవరకూ నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండి”.[సూరయె హిజ్ర్, ఆయత్99]

జీవన్మరణాలను ఇచ్చేవాడే ప్రభువు
1. ఖుర్ఆన్ ఉపదేశం: ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీమ్ అన్నప్పుడు...,[సూరయె బఖరహ్, ఆయత్258]
2. ఖుర్ఆన్ ఉపదేశం: “ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు”.[సూరయె దుఖాన్, ఆయత్8]

సృష్టికర్తయే ప్రభువు
1. ఖుర్ఆన్ ఉపదేశం: “నిశ్చయంగా నీ ప్రభువే (సర్వాన్నీ) సృష్టించినవాడు, (సర్వమూ) తెలిసినవాడు”.[అల్ హిజ్ర్, ఆయత్86]
2. ఖుర్ఆన్ ఉపదేశం: “ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి – తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు”.[సూరయె బఖరహ్, ఆయత్21]
3. ఖుర్ఆన్ ఉపదేశం: “ఈ అల్లాహ యే నీ (అందరికీ) ప్రభువు, ప్రతి వస్తువునూ సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు?[సూరయె ము.మిన్, ఆయత్61,62]

ఇతరులను ప్రభువుగా విశ్వసించడం అవిశ్వాసం
1. ఖుర్ఆన్ ఉపదేశం: “దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీక ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).[ఆలిఇమ్రాన్, ఆయత్80]

అల్లాహ్ ను ప్రభువుగా నమ్మేవారి పై దూతలు అవతరిస్తాయి
ఖుర్ఆన్ ఉపదేశం: “మా ప్రభువు అల్లాహ్ మాత్రమే” అని పలికి, దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): “మీరు భయపడకండి. దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి”.[సూరయె ఫుస్సిలత్, ఆయత్30]

ప్రభువు ఒక్కడే, అనేకులు కాలేరు
ఖుర్ఆన్ ఉపదేశం: “ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!)[సూరయె యూసుఫ్, ఆయత్39]
చరిత్రలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు “ఓ నా ఆరాధ్యదైవమా! నేను గర్వించడానికి నువ్వ నా ప్రభువు అన్న మాట చాలు. నా గౌరవం కోసం నేను నీ దాసుడని అన్న విషయం చాలు”[1] అల్లాహ్ ను తన ప్రభువుగా నమ్మీ తన ఈ నమ్మకాన్ని ఇలా వెల్లడిస్తున్నది మరెవరో కాదు దైవప్రవక్త(స.అ) మొదటి ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ(అ.స).
మరో హదీసులో హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఓ అల్లాహ్ నువ్వు తప్ప మరొకరు ప్రభువు అయ్యే అర్హత కలిగిలేడు”[2]
క్లుప్తంగా చెప్పాలంటే సర్వలోక సృష్టికర్తా అయిన ఆ అల్లాహ్ యే మన ప్రభువు.

రిఫరెన్స్
1. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం20, పేజీ255.
2. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం25, పేజీ242.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13