నమాజ్ ప్రాముఖ్యత

శని, 04/09/2022 - 12:13

సూరయె లఖ్మాన్, ఆయత్17 లో హజ్రత్ లుఖ్మాన్ తన కుమారుడికి నమాజ్ గురించి సిఫార్సు చేశారు, దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం...

నమాజ్ ప్రాముఖ్యత

హజ్రత్ లుఖ్మాన్ తన కుమారుడితో ఇలా అనెను: “ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.[సూరయె లఖ్మాన్, ఆయత్17]
ఈ ఆయత్ లో హజ్రత్ లుఖ్మాన్ తన కుమారుడికి నమాజ్ మరియు అమ్ర్ బిల్ మారూఫ్ గురించి సిఫార్సు చేశారు, ఈ రెండు కర్తవ్యాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం:
నమాజ్, మనిషి మరియు తన ప్రభువు మధ్య సాధారణ, లోతైనా మరియు అందమైన బంధం.
నమాజ్ గురించి మాత్రమే సిఫార్సు చేయబడింది; దానికి ముందు మంచి స్వరం ఉన్న వ్యక్తి ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పెద్దగా “హయ్యా అల్లస్సలాహ్, హయ్యా అలల్ ఫలాహ్, హయ్యా అలా ఖైరిల్ అమల్” అని పిలవమని, తన ఆ అజాన్ పిలుపుతో నిశ్శబ్ధాన్ని చేదించమని, ఇస్లాం యొక్క ముఖ్యాంశాలను ప్రచారం చేయమని మరియు నిర్లక్ష్యంగా ఉన్నవారిని జాగురుతిని ఇవ్వమని.
నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే; హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స) తన భార్య మరియు కుమారుడ్ని నీళ్లు మరియు పచ్చదనం లేని మక్కా ఎడరిలో ఉంచడానికి కారణం నమాజ్ స్థాపన అన్నారు గాని హజ్ చేయడం అని అనలేదు.
ఇమామ్ హుసైన్(అ.స) ఆషూరా రోజు జోహ్ర్ సమయంలో రెండు రక్అతుల నమాజ్ ను నెలకోల్పడం కోసం, తన ఛాతీని శత్రువుల బాణాలకు కవచంగా పెట్టారు.
ఖుర్ఆన్ హజ్రత్ ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్(అ.స)ను ఇలా ఆదేశించింది.. మస్జిదుల్ హరామ్ ను నమాజీయుల కోసం సిద్ధం మరియు శుభ్రం చేయండి. నమాజ్ కు ఉన్న ప్రాముఖ్యత వలనే జనాబె జకర్రియా, మర్యమ్, ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్(అ.స) లు మస్జిద్ మరియు నమాజ్ చదువు ప్రదేశాలకు సేవకులుగా ఉండేవారు.
నమాజ్, పుట్టిన బిడ్డ చేవిలో అజాన్ మరియు ఇఖామత్ చెప్పడం నుండి మరణించిన తరువాత జనాజా నమాజ్ చదివే వరకు మనకు కనిపిస్తూనే ఉంటుంది.
నమాజ్, మనం చేసే పనులన్నీంటి స్వీకరణకు తాళం చెవి లాంటింది. అమీరుల్ మొమినీన్(అ.స) తన గవర్నర్లను ఇలా ఉపదేశించేవారు.. నీ ఉత్తమ సమయాన్ని నమాజ్ కోసం నిశ్చయించుకో. గుర్తుంచుకో నీ పనులన్నీ నీ నమాజ్ నీడలోననే స్వీకరించబడతాయి.
నమాజ్, అల్లాహ్ యొక్క స్మరణ మరి అల్లాహ్ యొక్క స్మరణ మాత్రమే మనశాంతి కారణం.
భూప్రమాధాలు సమయంలో ఉదాహారణకు భూకంపాలు, భయంకర గాలులు మరియు అలాగే ఆకాశ ప్రమాధాలు ఉదాహారణకు సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం లాంటివి సంభవించినప్పుడు “నమాజె ఆయాత్” వాజిబ్ అవుతుంది. చివరికి వర్షాలు కురవకపోయినా సరే నమాజ్ చదవాలి, దాని పేరు “నమాజె బారాన్”.
నమాజ్, చాలా దుష్టచర్యల నుండి మరియు నిషిద్ధాల నుండి ఆపుతుంది.
నమాజ్ లో చాలా విషయాలు కనిపిస్తాయి వాటి నుండి ఉదాహారణకు: పరిశుభ్రత, పళ్లు తోముకోవడం, ఉజూ, గుస్ల్ మరియు శరీరం మరియు బట్టల శుభ్రత.... ధైర్యం పెరుగుతుంది, వేదికలలో పాల్గొవడం మస్జిద్ ల నుండి నేర్చుకుంటాము. న్యాయాన్ని జమాత్ ఇమామ్ ఎన్నిక ద్వార నేర్చుకుంటాము. అర్హతలను మరియు పరిపూర్ణతను ముందు వరుసలో నిలబడే వ్యక్తుల ద్వారా తెలుసుకుంటాము. స్థిరత్వాన్ని కాబావైపు నమాజ్ చదవడం ద్వార గుర్తు చేసుకుంటాము. నమాజ్ చదివేటప్పుడు ఖబ్జా చేసిన ఒక్క దారం ముక్క కూడా ఉండకూడదు అన్న విషయంతో ఇతరుల హక్కులను గౌరవించడం మరియు క్రమశిక్షణను జమాత్ వరుసల ద్వార నేర్చుకుంటాము.
పూర్తి నమాజ్ లో “మాలికి యౌమిద్దీన్” అని ప్రళయదినాన్ని, “ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్” అని రుజమార్గాన్ని, “సిరాతల్లజీన అన్ అమ్త అలైహిమ్” అని సజ్జనుల సహవాసాన్ని, “గైరిల్ మగ్జూబి అలైహిమ్ వలజ్జాల్లీన్” అని మార్గభ్రష్టులు మరియు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన వారి నుండి దూరాన్ని, తషహ్హుద్ ద్వారా దైవప్రవక్త దౌత్యం మరియు వారి అహ్లే బైత్(అ.స)లను, “అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్” అని పవిత్రులు మరియు సజ్జనుల పట్ల శ్రద్ధ చూపుతాము.
భోజనం పట్ల శ్రద్ధ చూపడం అవసరం; అదెలా అంటే హదీసులనుసారం “ఒకవేళ ఎవరైనా మద్యం సేవిచినట్లైతే 40 రోజుల వరకు అతడి నమాజ్ స్వీకరించబడదు”
భార్యభర్తల మధ్య కలహాలు ఉంటే లేదా ఒకరినొకరు బాదిస్తుంటే, చెడుగా ప్రవర్తిస్తుంటే వారిద్దరి నమాజ్ స్వీకరించబడదు.
ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులలో “నమాజ్” మరియు “అమ్ర్ బిల్ మారూఫ్” ప్రక్క ప్రక్కనే వచ్చాయి. ఉదాహారణకు
1. إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ అన్కబూత్, ఆయత్45
2. إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ సూరయె హుద్, ఆయత్114
3. أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنْكَرِ  సూరయె లుఖ్మాన్, ఆయత్17
4. الَّذِينَ إِنْ مَكَّنَّاهُمْ فِي الْأَرْضِ أَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ وَأَمَرُوا بِالْمَعْرُوفِ وَنَهَوْا عَنِ الْمُنْكَرِ సూరయె హజ్, ఆయత్41

రిఫరెన్స
మొహ్సిన్ ఖిరాతీ, రమజాన్ బా ఖుర్ఆన్(సీ రూజ్, సీ దర్స్), ముతవస్సిలీ, అలీ మొహమ్మద్, మర్కజె ఫర్హంగీ దర్సహాయి అజ్ ఖుర్ఆన్, తెహ్రాన్, 1392.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27