జౌషన్ కబీర్ ప్రతిష్టత

ఆది, 04/10/2022 - 19:19

రమజాన్ మాసంలో చదవడం మరియు కఫన్ పై వ్రాయడం పై తాకీదు చేయబడ్డ జౌషనె కబీర్ దుఆ యొక్క ప్రతిష్టత సంక్షిప్తంగా...

జౌషన్ కబీర్ ప్రతిష్టత

జౌషనె కబీర్ దుఆ “బలదుల్ అమీన్” మరియు “మిస్బాహ్” కఫ్అమీ పుస్తకాలలో ఉల్లేఖించబడి ఉంది; హజ్రత్ ఇమామ్ సజ్జాద్(అ.స), తన పితామహుల నుండి మరియు వారి దైవప్రవక్త(స.అ) నుండి రివాయత్ ఉల్లేఖించబడింది:
ఈ దుఆ జిబ్రయీల్ దైవప్రవక్త(స.అ) కోసం వారు ఒక యుద్ధంలో ఉండగా తీసుకొచ్చారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) భారీ కవచాన్ని ధరించి ఉన్నారు, ఆ కవచం వల్ల వారి శరీరం బాధకు గురి అయ్యింది. జిబ్రయీల్ ఇలా అన్నారు: యా ముహమ్మద్! నీ ప్రభువు నీకు సలాములు తెలిపెను మరియు ఇలా ప్రవచించెను: ఈ జౌషన్(కవచం) నీ నుండి దూరం చేయి మరియు ఈ దుఆ ను పఠించు, ఈ దుఆ నీ మరియు నీ ఉమ్మత్ కు రక్షణ కలిపిస్తుంది.

ఆ తరువాత ఈ దుఆ యొక్క ప్రతిష్టత గురించి వివరించారు. ఇక్కడ కేవలం కొన్నింటి గురంచి మాత్రమే చెప్పుకుందాం:
ఎవరైతే ఈ దుఆను తన కఫన్ పై లిఖించుకుంటాడో, అల్లాహ్ ఆ దుఆకు ఉన్న గౌరవం వల్ల అతడిని నరకాగ్నిలో వేయడు. మరి అలాగే ఎవరైతే రమాజన్ మాసంలో మొదట్లో స్వచ్ఛమైన నియ్యత్తుతో మరియు పవిత్ర హృదయంతో చిదివితే అల్లాహ్ (ఇహపరలోకాల మంచి) ప్రయోజనాలను అతడి భాగ్యంగా నిర్ధారిస్తాడు. అతడి కోసం 70 దైవదూతలను అల్లాహ్ యొక్క తస్బీహ్ మరియు తఖ్దీస్ చేసి దాని పుణ్యన్ని అతడి కోసం నిర్ధారించడానికై సృష్టిస్తాడు.

ఎవరైతే ఈ దుఆను రమజాన్ మాసంలో మూడు సార్లు చదువతాడో అల్లాహ్ అతడి శరీరం పై నరకాగ్నిని హరామ్ చేస్తాడు మరియు అతడి కోసం స్వర్గాన్ని వాజిబ్ గా నిశ్చయిస్తాడు. రెండు దైవదూతలను అతడిని పాపముల నుండి కాపాడుతూ ఉండడానికి మరియు జీవితాంతం అల్లాహ్ సురక్షణలో ఉండడానికై నిర్ధారిస్తాడు.
ఈ రివాయత్ చివరిలో ఇలా ఉంది: ఇమామ్ హుసైన్(అ.స) ఇలా ఉపదేశించారు: నా తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్ ఈ దుఆను కంఠస్తం చేయమని కోరారు. అలాగే వారు దీనిని వారి కఫన్ పై వ్రాయమన్నారు మరియు కుటుంబ సభ్యులకు నేర్పమన్నారు మరియు వారిని ఈ దుఆ పఠించడం పై ప్రోత్సహించమని అన్నారు.
ఈ దుఆ అల్లాహ్ యొక్క వెయ్యి పేర్లపై ఆధారపడి ఉంది. ఆ పేర్లలోనే “ఇస్మె ఆజమ్”(ఉత్తమ పేరు) కూడా ఉంది.

ఫఖీర్(రచయిత పేరు) ఇలా అనెను: ఈ రివాయత్ ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి:
1. కఫన్ పై ఈ దుఆను వ్రాయడం. ఎందుకంటే అల్లామా బహ్రుల్ ఉలూమ్(ర.అ) “అల్ దుర్రహ్” లో దీని గురించి ఇలా సూచించారు:
وَسُنَّ أَنْ يُكْتَبَ بِالْأَ كْفانِ‌
شَهادَةُ الإِسْلامِ وَالإِيمانِ
దానిని కఫన్ పై వ్రాయడం ముస్తహబ్ గా నిర్ధారించబడింది
ఇది ఇస్లాం మరియు అలాగే విశ్వాసం పై సాక్ష్యం
وَهَكَذا كِتابَةُ الْقُرْآنِ‌
وَالْجَوْشَنِ الْمَنْعُوتِ بِالْأَمانِ
ఖుర్ఆన్ గ్రంథాన్ని వ్రాయడం తో పాటు
దుఆయె జౌషన్ సురక్షితం మరియు భద్రతతో కూడినవి
2. రమజాన్ మొదటి రోజు చదవడం సమ్మతమైనది మరియు ముస్తహబ్.

రిఫరెన్స్
https://www.erfan.ir/mafatih48/دعای-جوشن-کبیر-کلیات-مفاتیح-الجنان-با-ترجمه-استاد-حسین-انصاریان

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 1