అమీరుల్ మొమినీన్(అ.స) ప్రతిష్టతలు

గురు, 04/21/2022 - 23:40

అమీరుల్ మొమినీన్(అ.స) ప్రతిష్టతలను ముఆవీయ ఒప్పుకొన్నాడు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అమీరుల్ మొమినీన్(అ.స) ప్రతిష్టతలు

ధర్మనిష్ఠుల నాయకుడు, విశ్వాసుల పాలకుడు అయిన హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రత్యేకతలలో ఒకటి; వారి శత్రువులే వారి యొక్క స్థాయీ, గొప్పతనం మరియు ఉత్తమత్వం గురించి తమ నోళ్లను విప్పడం మరియు ఇమామ్ అలీ(అ.స) యొక్క ప్రతిష్టతలను వెల్లడించడం. ఇలాంటి వ్యక్తులలో ఒకడు ఇమామ్ అలీ(అ.స) ను దూషించడం మొదలు పెట్టిన మరియు దాదాపు 60 సంవత్సరాల వరకు ప్రజలను ఆ పని చేయడం పై శిక్షణ ఇచ్చిన వాడు. ఇతడు అహ్లె సున్నత్ లలో దైవవాణి లేఖి (కాతిబె వహీ) అని ప్రఖ్యాతి చెందినవాడు, ఇతడి ప్రతిష్టపై చాలా తప్పుడు హదీసులు తయారు చేయబడ్డాయి[1]. ఇతడు మరెవరో కాదు మూడవ ఖలీఫా మరణానంతరం అల్లకల్లోలం సృష్టించిన ముఆవిహ్ ఇబ్నె అబీ సుఫ్యాన్. ఇలాంటి వ్యక్తి హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రతిష్టతలను ఒప్పుకున్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం:
చరిత్రలో ఇలా లిఖించబడి ఉంది; ఒక వ్యక్తి ముఆవియహ్ వద్దకు వెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగాడు, అప్పుడు ముఆవియహ్ అతడితో ఇలా అన్నాడు: అలీ ను ప్రశ్నించు, అతడు నా కన్నా ఎక్కువ తెలిసినవాడు.
ఆ వ్యక్తి ముఆవియహ్ తో ఇలా అన్నాడు.. నా ప్రశ్నలకు అలీ సమాధానం ఇవ్వడం కన్నా మీరు సమాధానమివ్వడమే నాకు ఇష్టం.
ముఆవియహ్ ఇలా అన్నాడు: నువ్వు తప్పు చెబుతున్నావు, నీ ప్రేరణ తప్పు(నువ్వు నన్ను సంతోషపరచాడనికి వచ్చావు) నువ్వు దైవప్రవక్త(స.అ) ఒక పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించినట్లు తన జ్ఞానంతో నింపిన వ్యక్తిని అసహ్యించుకుంటున్నావు. దైవప్రవక్త(స.అ) వారి గురించి ఇలా అన్నారు: “ఓ అలీ(స.అ) నా దృష్టిలో నీ స్థానం, మూసా దృష్టిలో హారూన్ యొక్క స్థానం వంటిది, కేవలం తేడా ఏమిటంటే నువ్వు నా తరువాత ప్రవక్తవు కావు”[2]
ముఆవియహ్ కు హజ్రత్ అలీ(స.అ) అవసరం గురించి ఇలా ఉల్లేఖించబడి ఉంది; అతడు ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఇరుక్కుపోయినప్పుడు, తనకు తెలిసినవారికి ఉత్తరం వ్రాసి ఈ ప్రశ్నలు అమీరుల్ మొమినీన్(అ.స)ను అడిగి తెలుసుకో మని కోరేవాడు.[3]
అందుకనే హజ్రత్ అలీ(అ.స) యొక్క మరణ వార్త విన్నప్పుడు, ముఆవియహ్ బాధ పడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిన్నటి వరకు నువ్వు వారిని దూషించావు, లఅనత్ చేశావు, మరి ఈరోజు వారి మరణం పై కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి అని ప్రశ్నించినప్పుడు, అతడు దాని సమాధానంగా ఇలా అన్నాడు: “అయ్యో, నీకు అతడి జ్ఞానం మరియు ప్రతిష్టత గురించి, అందరి కన్నా ముందు ఇస్లాంను స్వీకరించడం గురించి తెలియదు. నీకు తెలియడం లేదు ప్రజలు ఏది పోగొట్టుకున్నారో[4]
కొన్ని ఉల్లేఖనల ప్రకారం ముఆవియహ్ హజ్రత్ అలీ(అ.స) మరణ వార్త విన్న తరువాత ఇలా అన్నాడు: “అబూతాలిబ్ కుమారుడు పోవడంతో ఫిఖా మరియు జ్ఞానం కూడా నాశనమయ్యాయి”[5]
చరిత్రలో ఈ టాపిక్ పై చాలా విషయాలు ఉల్లేఖించబడి ఉన్నాయి; వాటిని ఇక్కడ ప్రదర్శించడం కష్టం, అయితే సాధారణగా అహ్లె సున్నత్ గ్రంధాలలో ఉల్లేఖించబడిన[6] వాటి ద్వార తెలిసే యదార్థమేమిటంటే నిజం అమీరుల్ మొమినీన్ పక్షాన ఉంది అని తెలిసి కూడా ముఆవియహ్ వారికి వ్యతిరేకంగా నిలబడి నిజాన్ని కప్పిపెట్టాడు. మరి ఇలాంటి చర్యను అల్లాహ్ పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో నిషేధించాడు. దాని గురించి ఇలా ఉపదేశించాడు: “అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.[బఖరహ్, ఆయత్174][7].
యదార్థాన్ని కప్పిపెట్టడం, నిజానికి అల్లాహ్ న్యాయస్థానంలో మార్గభ్రష్టతకు కారణం, ఎందుకంటే ఇలాంటి చర్య సమాజంలో ఉన్న ఇతర ప్రజల మార్గభ్రష్టతకు దారి తీస్తుంది, దీని స్పష్టమైన నిదర్శనం “సిఫ్పీన్” యుద్ధంలో చూడవచ్చు.

రిఫరెన్స్
1. తారీఖుల్ ఇస్లాం, జహబీ, భాగం2, పేజీ310.
2. ఫజాయిలుస్సహాబహ్, అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం2, పేజీ657; మనాఖిబె అలీ ఇబ్నె అబీతాలిబ్, పేజీ34; ఫత్హుల్ బారీ, ఇబ్నె హజరె అస్ఖలానీ, భాగం7, పేజీ74.
3. ఇస్తిఆబ్, ఇబ్నె అబ్దుల్ బిర్ర్ ఖుర్తుబీ, భాగం2, పేజీ463.
4. తారీఖె దమిష్ఖ్, ఇబ్నె అసాకిర్ దమిష్ఖీ, భాగం3, పేజీ406-409; ఫరాయిదుల్ మస్తైన్, ఇబ్రాహీమ్ హమువైనీ, భాగం1, పైజీ372.
5. అల్ షరఫుల్ ముఅయ్యద్, నిభానీ, పేజీ95.
6. ముస్నదె షాఫెయీ, పేజీ204., సీరయె హలబీ, భాగం3, పేజీ149.

7. إِنَّ الَّذينَ يَكْتُمُونَ ما أَنْزَلَ اللَّهُ مِنَ الْكِتابِ وَ يَشْتَرُونَ بِهِ ثَمَناً قَليلاً أُولئِكَ ما يَأْكُلُونَ في‏ بُطُونِهِمْ إِلاَّ النَّارَ وَ لا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيامَةِ وَ لا يُزَكِّيهِمْ وَ لَهُمْ عَذابٌ أَليمٌ   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18