జమల్ యుద్ధం

ఆది, 01/21/2018 - 06:28

.ఆయిషా మరియు ఆమె అనుచరులు ఉస్మాన్ అన్యాయంగా చంపబడ్డారు దాని ప్రతీకారం తీర్చుకోవాలనే క్రమంలో జరిగిన యుద్ధం, జమల్ యుద్ధం.

జమల్ యుద్దం

జుమాదల్ అవ్వల్ మాసం, 10వ తారీఖు, హిజ్రీ యొక్క 36వ సంవత్సరంలో “జమల్” యుద్ధం జరిగింది. జమల్ యుద్ధం ఉస్మాన్ హతమార్చబడిన తరువాత ప్రజలు హజ్రత్ అలీ[అ.స]ను ఖలీఫాగా నియమించారు. ఆయిషాకు ఈ వార్త తెలిసినప్పుడు చాలా నిరాశ చెంది ఉస్మాన్ అన్యాయంగా చంపబడ్డారని ఇమామ్ నుండి ప్రతీకారం తీర్చుకోవాలని మక్కాలో ప్రచారం చేశారు. తల్హా మరియు జుబైర్లు హజ్రత్ అలీ[అ.స] అధికారంలో మంచి స్థానం తమకు దక్కదని ఎప్పుడైతే తెలుసుకున్నారో “ఉమ్రాహ్” వంకతో మదీనహ్ నుండి బయటికి వచ్చి ఆయిషాతో కలిసిపోయారు.
అందరు కలిసి “బస్రా” వైపుకు వెళ్దాం, అచటి ప్రజలు ఆమెను చూడగానే ఆమెకు తోడవుతారు అని అన్నారు. ఆయిషా వారి ఉపాయాన్ని అంగీకరించి “బస్రా” తరపు ప్రయాణం సాగించారు. బస్రా చేరగానే “బస్రా”లో ఉన్న హజ్రత్ అలీ[అ.స] యొక్క ప్రతినిధి ఇంటి పై దాడి చేసి వారిని చాలా కష్టపెట్టారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వారి గడ్డాన్ని చర్మం నుండి పీకేశారు. ఆ తరువాత “బైతుల్ మాల్”(ఇస్లాం ధనాగారం) పై దాడి చేసి చాలా సంరక్షకులను హతమార్చారు, “బైతుల్ మాల్”ను నాశనం చేశారు.
ఈ వార్త మదీనహ్ లో ఉన్న హజ్రత్ అలీ[అ.స]కు చేరగానే, వారు “సహల్ ఇబ్నె హునైఫ్”ను తన స్థానంలో ఉంచి దైవప్రవక్త[స.అ] సహాబీయులతో మరియు ఇతర మదీనహ్ వాసులతో కూడిన చాలా పెద్ద బృందంతో చాలా వేగంగా ఇరాఖు చేరుకున్నారు.
హజ్రత్ అలీ[అ.స] ఎట్టి పరిస్థితిలో ఈ యుద్ధం జరగకూడదు అని అనుకున్నారు. అందకనే బస్రాకు చేరిన తరువాత మూడు రోజుల పాటు వారికి ఈ అల్లకల్లోలాన్ని ఆపివేయండి అని రాయబారిని పంపారు కాని వాళ్ళు అంగీకరించలేదు. చివరికి జుమాదల్ అవ్వల్ 10 తారీఖున యుద్ధం మొదలయ్యింది మధ్యాహ్నం నుండి సాయత్రం వరకు యుద్ధం సాగుతూనే ఉంది.
చివరికి హజ్రత్ అలీ[అ.స] సైన్యానికే విజయం దక్కింది. అప్పుడు హజ్రత్ అలీ[అ.స] ఆయిషా అంబారీ వద్దకు ఇలా అన్నారు: “ఓ హుమైరహ్! దైవప్రవక్త [స.అ] నిన్ను యుద్ధం కోసం బయటకు వెళ్ళమని ఆదేశించారా!?, నిన్ను ఇంట్లోనే కూర్చోని ఉండు బయటకు రాకు అని ఆదేశించలేదా!?, అల్లాహ్ సాక్షిగా! తమ భార్యలను పరదాల వెనక ఉంచి నిన్ను బయటకు తీసుకొచ్చిన వారు న్యాయం చేయలేదు”
“ముహమ్మద్ ఇబ్నె అబీబక్ర్” తన చెల్లెలు ఆయిషాను అంబారీ నుండి బయటకు పిలిచి హజ్రత్ అలీ[అ.స] ఆదేశానుసారం గౌరవంగా మదీనహ్కు పంపారు. ఈ యుద్ధంలో చాలా ముస్లిముల రక్తం చిందింది.[షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, తతిమ్మతు ముంతహల్ ఆమాల్]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, తతిమ్మతు ముంతహల్ ఆమాల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meerja on

Mashaallah bohut acha bataye....
Isi tarh baqi islamic jung k bare me bhi bataiye....

Submitted by zaheer on

Shukriya aap k msg ka .. aap k msgs se hamari himmat afzaaei hoti hai.
Inshallah har mahine k lehaaz se chal rahe hain is liye us mahine k hisaab se us me jo jang waqe huwi ho usk baare me bataaya jaa raha hai ...

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15