తైరె మష్వీ హదీస్

శుక్ర, 04/22/2022 - 07:30

అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలలో “తైరె మష్వీ” హదీస్ ప్రస్తావనం ఉందా అన్న విషయం పై సంక్షిప్త పరిశోధన...

తైరె మష్వీ హదీస్

హజ్రత్ అలీ(అ.స) ఇతర సహాబీయుల పై ప్రతిష్టత గలవారు అన్న విషయాన్ని నిదర్శించే సాక్ష్యాలలో “తైరె మష్వీ” (కాల్చిన పక్షి) హదీస్ ఒకటి. ఉమర్ తన తరువాత ఖలీఫాను నియమించడానికి నిశ్చయించిన షూరా(సలహా మండలి) సభ్యులు ఏకమైన రోజున హజ్రత్ అలీ(అ.స) తన కొన్ని ప్రతిష్టతలను వెల్లడిస్తూ వివరించిన సంఘటనలలో ఒకటి “తైరె మష్వీ” సంఘటన ఒకటి.[1] ఇతర ఉల్లేఖనల ప్రకారం ప్రజలు ఉస్మాన్ తో బైఅత్ చేసిన తరువాత వారు ప్రజలకు ఈ ప్రతిష్టతను గుర్తు చేశారు.[2]
ఏదైతేనేంద “తైరె మష్వీ” యొక్క సంఘటన అహ్లె సున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడిన విధంగా సంఘటన ఇలా ఉంది: ఒకరోజు ఉమ్మె ఐమన్ పక్షిని కబాబ్ చేసి దైవప్రవక్త(స.అ) కోసం తీసుకొచ్చింది.[3] అయితే దైవప్రవక్త(స.అ) దాన్ని తినడం మొదలు పెట్టడానికి ముందు అల్లాహ్ ను “నాతో ఈ భోజనం తినడానికి సృష్టితాల నుండి అత్యుత్తమ సృష్టిని నా వద్దుకు పంపించు” కోరారు.[4]
అక్కడే ఉన్న ఆయిషా దైవప్రవక్త(స.అ)తో కలిసి తినేందుకు ఆమె తండ్రి(అబూబక్ర్) రావాలి అని అల్లాహ్ ను కోరింది. మరియు హఫ్సా కూడా తన తండ్రి(ఉమర్) రావాలి అని అల్లాహ్ ను కోరింది. సఅద్ ఇలా అనెను: నేను కూడా అల్లాహ్ ను .సఅద్ ఇబ్నె ఇబాదహ్. రావాలీ అని కోరాను. కాని ఆ సమయంలో ఇమామ్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) ఇంటి తలుపు వద్దకు వచ్చి లోపల వెళ్లాలని కోరారు; నేను అతడితో ప్రస్తతం దైవప్రవక్త(స.అ) ఏదో పనిలో ఉన్నారు అని చెప్పి అనుమతివ్వలేదు. ఇమామ్(అ.స) వెళ్లిపోయారు. కాసేపటి తరువాత ఇమామ్ తిరిగి రెండవ సారి వచ్చారు, అనుమతి కోరారు అలాగే మూడవ సారి వచ్చినప్పుడు, దైవప్రవక్త(సఅ) తలుపు వెనక శబ్ధాలన్ని విని ఎవరున్నారక్కడ అని అడిగారు. ఇక్కడ అలీ(అ.స) ఉన్నారు అని చెప్పాను. దైవప్రవక్త(స.అ) లోపల రావడానికి అనుమతి ఇవ్వమని ఆదేశించారు. ఆ తరువాత అలీ(అ.స) ప్రవేశించారు, దైవప్రవక్త(స.అ)తో కలిసి భోజనం చేశారు. భోజనం తిన్న తరువాత దైవప్రవక్త(స.అ) ఇలా దుఆ చేశారు: “అల్లాహుమ్మ వాలె మన్ వాలాహ్”[5]
అహ్లె సున్నత్ యొక్క చాలా గ్రంథాలలో వివిధ రకాలుగా ఈ సంఘటన ఉల్లేఖించబడి ఉంది.[6] సయ్యద్ మొహ్సిన్ అమీన్ ఆ గ్రంథాల లిస్టును కూడా సిద్థం చేశారు.[7]
అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ ముద్దిసులలో ఒకరైన హాకిమె నైషాబూరీ ఈ రివాయత్ ను ఇల్లేఖించిన తరువాత ఇలా రచించెను; ఈ హదీస్ ముస్లిం మరియు బుఖారీల రివాయత్ స్వీకరణ సూత్రాలనుసారం సరైన హదీస్ అయితే దీనిని ముస్లిం మరియు బుఖారీలు తన గ్రంథాలలో(సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం)లో (ఏ కారణం చేతనో) ఉల్లేఖించలేదు.[8]

రిఫరెన్స్
1. తబరీ ఆములీ, ఇమాదుద్దీన్ మొహమ్మద్, బషారతుల్ ముస్తఫా లి షిఅతుల్ ముర్తజా, భాగం2, పేజీ23, నజఫ్, అల్ మక్తబతుల్ హైదరియహ్, చాప్2, 1383ఖ.
2. షేఖ్ హుర్రె ఆములి, ఇస్బాతుల్ హుదాతి బిన్నుసూసి వల్ మొజిజాత్, భాగం3, పేజీ49, బీరూత్, అఅలమీ, చాప్1, 1425ఖ.
3. ఇబ్నె అసాకిర్, అబుల్ ఖాసిమ్ అలీ ఇబ్నె హసన్, తారీఖు మదీనహ్ దమిష్క్, భాగం42, పేజీ256, బీరూత్, దారుల్ ఫిక్ర్, 1415ఖ.
4. ఇబ్నె ఉఖ్దహ్ కూఫీ, అహ్మద్ ఇబ్నె మొహమ్మద్, ఫజాయిలు అమీరిల్ మొమినీన్(అ.స), పేజీ74, ఖుమ్, దలీలె మా, చాప్1, 1424ఖ.
5. అబ్నె కసీర్ దమిష్ఖీ, ఇస్మాయీన్ ఇబ్నె ఉమర్, అల్ బిదాయతు వన్నిహాయహ్, భాగం7, పేజీ350-351, బీరూత్, దారుల్ ఫిక్ర్, 1407ఖ.
6. నిసాయి, అబూ అబ్దిర్రహ్మాన్ అహ్మద్ ఇబ్నె షుఐబ్, అల్ సునన్ అల్ కుబ్రా, మొహఖ్ఖిఖ్: షిబ్లీ, హసన్ అబ్దుల్ మున్ఇమ్, భాగం7, పేజీ410, బీరూత, ముఅస్ససతుర్రిసాలహ్, చాప్1, 1421ఖ; తిర్మిజీ, మొహమ్మద్ ఇబ్నె ఈసా, సుననె తిర్మిజీ, తహ్ఖీఖ్ వ తాలీఖ్: షాకిర్, అహ్మద్ మొహమ్మద్, అబ్దుల్ బాఖీ, మొహమ్మద్ ఫుఆద్, భాగం5, పేజీ636, మిస్ర్, షిర్కతు మక్తబహ్ వ మత్బఅతు ముస్తఫా అల్ బానీ అల్ హలబీ, చాప్2, 1395ఖ; ఇబ్నె అసీర్ జజరీ, అలీ ఇబ్నె అబీల్ కరమ్, ఉస్దుల్ గాబహ్ ఫీ మఅరిఫతిస్సహాబహ్, మొహఖ్ఖిఖ్ వ ముఅవ్విజ్: అలీ మొహమ్మద్, అబ్దుల్ మౌజూద్, ఆదిల్ అహ్మద్, భాగం3, పేజీ633, బీరూత్, దారుల్ కితాబ్ అల్ అరబీ, చాప్2, 1409ఖ; సాలెహీ దమిష్ఖీ, మొహమ్మద్ బిన్ యూసుఫ్, సుబులుల్ హుదా వర్రిషాద్ ఫీ సీరతి ఖైరిల్ ఇబాద్, భాగం7, పేజీ191, బీరూత్, దారుల్ కుతుబిల్ ఇల్మియహ్, చాప్1, పేజీ1414ఖ.
7. అమీన్ ఆములీ, సయ్యద్ మొహ్సిన్, అఅయానుష్ షియా, భాగం1, పేజీ353, బీరూత్, దారుత్తఆరుఫ్ లిలమత్ బూఆత్, 1406ఖ.
8. హాకిమె నైషాబూరీ, మొహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్, అల్ ముస్తద్రక్ అలస్ సహీహైన్, తహ్ఖీఖ్: అతా, ముస్తఫా అబ్దుల్ ఖాదిర్, భాగం3, పేజీ141, బీరూత్, దారుల్ కుతుబిల్ ఇల్మియహ్, చాప్1, పేజీ1411ఖ.

https://btid.org/fa/news/181739

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17