జ్ఞాన మరియు ప్రతిష్టత పరంగా ప్రజల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఇమామ్ పట్ల విధేయత కలిగి ఉండమని అల్లాహ్ ఆదేశించాడు అన్న మాట బుద్ధివివేకాలు అంగీకరిస్తాయా...?

ఇప్పటి వరకు ఎప్పుడైనా దైవప్రవక్త(స.అ) యొక్క ఈ హదీసును విన్నారా: “తన కాలపు ఇమామ్ పట్ల ఎరుక లేకుండా మరణించినవాడు అజ్ఞానపు కాలపు మృత్యువును పొందినట్లు”[1]
ఇదే శీర్షకతో అహ్లె సున్నత్ గ్రంథాలలో కూడా చాలా రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఈ రివాయత్ ఆధారంగా సఅదుద్దీన్ తఫ్తాజానీ “షర్హె మఖాసిద్” గ్రంథంలో[2] మరియు ముల్లా అలీ ఖారీ “షర్హె ఫిఖ్హె అక్బర్” గ్రంథంలో [3] ఇమామత్ అవసరం పై సాక్ష్యంగా భావించారు.
ఫలితం:
1. ఇమామ్ తప్పకుండా సమాజ ప్రజలలో ఉత్తముడు అయి ఉండాలి అన్న సూత్రం వివేకం మరియు ప్రజలు నమ్మే ఒక సూత్రం. ఎందుకంటే ప్రజల కన్నా తక్కువ మరియు అప్రతిష్టత గల ఇమామ్ మరియు ఖలీఫా పట్ల ఎలా విధేయత చూపగలము అదీ కూడా ఆజ్ఞపాలన వాజిబ్ మరియు విధిగా నిర్ధారించబడినదై ఉంటే. అల్లాహ్ ఇలాంటి ఇమామ్ పట్ల విధేయత కలిగి ఉండమని ఆదేశించాడు అన్న మాట బుద్ధివివేకాలు అంగీకరిస్తాయా?
2. ఒక ఉమ్మత్ యొక్క ఖలీఫా అది కూడా అతడి ఆజ్ఞపాలన విధిగా నిర్ధారించబడినటువంటి ఖలీఫా అజ్ఞానుడు అయి ఉండడం మరియు చట్టాన్ని అమలు పరచడానికి ఇతరుల సహాయం తీసుకునేవాడు అయి ఉండడం; దీన్ని బుద్దిమంతులు అంగీకరిస్తారా?
3. ఇతరుల సహాయం పొందడం అవసరమైన ఒక ఖలీఫా నిస్సందేహంగా అల్లాహ్ తరపు నుండి అతడి ఆజ్ఞపాలన విధిగా నిర్థారించబడినటువంటి ఖలీఫా అయితే మాత్రం కాదు. మధ్యలో ఏదో జరిగింది, ఎక్కడో అన్యాయం జరిగింది.
వీటితో పాటు అహ్లె సున్నత్ మరియు వహాబీయుల ఉల్లేఖనలు ప్రదర్శించి వీటిపై ఆలోచించాల్సిందిగా పాఠకులను కోరుతున్నాము. ఇది సత్యాన్వేషకులకు తప్పకుండా సహాయపడుతుంది అని భావిస్తూ...
హజ్రత్ అలీ(స.అ) ప్రతిష్టతను ఒప్పుకున్న ఉమర్:
హజ్రత్ ఉమర్ నుండి ప్రసిద్ధ మాటలు ఉల్లేఖించబడి ఉన్నాయి వాటి ద్వార వారికి అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క జ్ఞానం అవసరం ఎంత ఉండేదో తెలుస్తుంది. ఇక్కడ వాటి నుండి కొన్ని:
1. “అలీ లేకుంటే ఉమర్ నాశనం అయి ఉండేవాడు”[4] ఈ పదాన్ని చాలా సార్లు చెప్పారు.
2. “ఓ అల్లాహ్ నన్ను అబీతాలిబ్ కుమారుడు పరిష్కరించడానికి లేని సమయంలో కష్టాలలో పడేయకు”[5]
3. “ఓ అబల్ హసన్ నువ్వు లేని భూమి పై, అల్లాహ్ నన్ను మిగిలి ఉంచకూడదు”[6]
4. “ఓ అలీ! అల్లాహ్ నన్ను నీ తరువాత మిగిలి ఉంచకూడదు”[7]
5. “నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను; కష్టం వచ్చింది కాని దాన్ని పరిష్కరించడానికి లేని సమయం నుండి”[8]
6. “అల్లాహ్ శరణు కోరుతున్నాను; ఓ అబుల్ హసన్ నువ్వు లేని సమూహంలో జీవితం గడపడం నుండి”[9]
7. “అలీ తీర్పు ఇవ్వడంలో మా అందరికి మించిన వారు”[10]
8. ముఆవియా ఇలా అనెను: “ఎదైనా విషయంలో ఉమర్ కు కష్టం ఎదురొస్తే దాని పరిష్కారాన్ని అతడి(అలీ) నుండి తీసుకునేవాడు”[12]
ఇవే కాకుండా మరెన్నో హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి.
హజ్రత్ అలీ(అ.స) ఉండగా మరెవరైనా ఇమామత్ మరియు ఖిలాఫత్ కూర్చోవడం అన్యాయం. న్యాయంగా ఆలోచించండి...
రిఫరెన్స్
1. షర్హె మఖాసిద్, భాగం5, పేజీ239.
2. షర్హె మఖాసిద్, భాగం5, పేజీ239.
3. షర్హుల్ ఫిఖ్హిల్ అక్బర్, పేజీ179.
4. ఈ హదీస్ ను అహ్మద్, అఖీలీ మరియు ఇబ్నుస్సమాన్ లు ఉల్లేఖించారు. ఇస్తిఆబ్, భాగం3, పేజీ39లో., తఫ్సీరె నైషాబూరి, సూరయె అహ్ఖాఫ్ లో., మనాఖిబె ఖారజ్మీ, పేజీ48లో., రియాజ్, భాగం2, పేజీ194లో., షర్హె జామె సగీర్ షేఖ్ మొహమ్మద్ హనఫీ, పేజీ417లో., తజ్కిరహ్ సిబ్త్, పేజీ87లో., మతాలిబుస్సుఆల్, పేజీ13లో., ఫైజుల్ ఖదీర్, భాగం4, పేజీ357లో. لو لا علىّ لهلك عمر
5. తజ్కిరతు సిబ్త్, పేజీ87., మనాఖిబె ఖారజ్మీ పేజీ58., మఖ్తలె ఖారజ్మీ, భాగం1, పేజీ45. اللهمَّ لا تبقنی لمعضلة لیس لها ابن أبی طالب
6. ఇర్షాదే సారీ, భాగం3, పేజీ195. لا أبقانی اللَّه بأرض لستَ فیها أبا الحسن
7. రియాజన్నజరహ్, భాగం2, పేజీ197, మనాఖిబె ఖారజ్మీ, పేజీ60, తజ్కిర సిబ్త్, పేజీ88., ఫైజుల్ ఖదీర్, భాగం4, పేజీ357. لا أبقانی اللَّه بعدك یا علیُّ
8. తారీఖె ఇబ్నె కసీర్, భాగం7, పేజీ359., ఫుతూహాతిల్ ఇస్లామియహ్, భాగం2, పేజీ302. أعوذ باللَّه من معضلة و لا أبو حسن لها
9. రిజాజున్నజరహ్, పేజీ197., ముంతఖబు కన్జుల్ ఉమ్మాల్ హాషియ ముస్నదె అహ్మద్, భాగం2, పేజీ352. أعوذ باللَّه أن أعیش فی قوم لستَ فیهم یا أبا الحسن
10. హిల్యతుల్ ఔలియా, భాగం1, పేజీ65., తబఖాతు ఇబ్నె సఅద్, పేజీ459, 460., ఇస్తిఆబ్, భాగం4, పేజీ38,39., తారీఖె ఇబ్నె కసీర్, భాగం7, పేజీ359. ఈ మాటలు ఉమర్ చెప్పినవి అని సాక్ష్యాలతో చెప్పబడినవి. తారీఖుల్ ఖులఫా, సీవ్తీ, పేజీ115. علىّ اقضانا
11. మనాఖిబె అహ్దం, రిజాజున్నజరహ్, భాగం2, పేజీ195. و قال معاویة: كان عمر إذا أشكل علیه شیءٌ أخذه منه
వ్యాఖ్యానించండి