దైవప్రవక్త(స.అ) పలుకులు

శని, 04/30/2022 - 22:05

షహీదె అవ్వల్ ద్వార సంగ్రహించబడ్డ దైవప్రవక్త(స.అ) యొక్క కొన్ని హదీసుల తెలుగు అనువాదం..

దైవప్రవక్త(స.అ) పలుకులు

1. విజ్ఞానం భూమి పై అల్లాహ్ యొక్క అమానత్(భద్ర పరచమని ప్రసాదించబడినిది) మరియు విజ్ఞానులు దానిని భద్రపరిచే నమ్మకస్తులు, అయితే ఎవరైతే తన విజ్ఞానాన్ని అమలు పరుస్తారో వారు తన నమ్మకాన్ని చాటుకున్నట్లు మరి ఎవరైతే అమలు పరచలేదో దీవాన్-ఎ-ఇలాహీ లో పని ద్రోహుల ద్రోణిలో లిఖించబడుతుంది.
2. నువ్వు నీకున్న వాటి ద్వార ప్రజల పై ప్రభావం చూపలేకపోతే, నువ్వు నీ సత్ప్రవర్తన ద్వార ఈ పని చేయి (ప్రభావితుల్ని చేయి).
3. ఎంత సాధ్యమైతే అంత నిన్ను నువ్వు ఈ ప్రపంచం గురించి ఆలోచన తగ్గించు ఎందుకంటే ఎవరైతే తన హృదయాన్ని అల్లాహ్ ముందు తీసుకొస్తాడో, అల్లాహ్ దాసుల హృదయాలను తన ప్రేమా మరియు కారుణ్యం ద్వార ఆయన విధేయుడిగా తీర్చిదిద్దుతాడు మరియు ప్రతీ మంచిని అతడి కోసం నిర్ధారిస్తాడు.
4. భాగ్యాన్ని దుఆ తప్ప ఏదీ ఆపలేదు. వయసును మంచి తప్ప లేదీ పెంచలేదు. మనిషి చేసుకున్న పాపముల కారణంగా తన ఉపాధి నుంచి దూరంగా ఉంచబడతాడు.
5. అల్లాహ్ పట్ల మంచి ఆలచన, ఒక రకమైన దైవారాధన.
6. ఈ ముగ్గురిపై దయ చూపించండి: అవమానానికి గురి అయిన సమాజంలో గౌరవనీయ వ్యక్తి పై, పేదవాడిగా మారిన ధనవంతుడు పై మరియు అజ్ఞానుల బారిన పడ్డ జ్ఞాని పై.
7. దాతృత్వం గల వ్యక్తి అల్లాహ్ సన్నిధిలో మరియు నేను అతడితో పాటు ఉంటాను. పిసినారి నరకంలో మరియు అతడితో పాటు ఇబ్లీస్ ఉంటాడు.
8. అహంకారాన్ని చాటుకునేందుకు విజ్ఞానాన్ని నేర్చుకునేవాడు, ఒకవేళ మరణిస్తే అతడు అజ్ఞానిగా మరణించినట్లు. విద్యను అమలు చేయడానికి కాకుండా ఇతరులను బోధించడానికి నేర్చుకునే వాడు, ఒకవేళ మరణిస్తే అతడు కపటవర్తనుడిగా మరణించినట్లు. విద్యను దాని పై అమలు చేయడానికి నేర్చుకున్నవాడు, ఒక వేళ మరణిస్తే అతడు సాధువు(ఆరిఫ్-ప్రతీ దానిలో దైవాన్ని చూసేవాడు).
9. అల్లాహ్ నాలుగు అంశాలను, నాలుగు విషయాల నుండి ఎన్నుకున్నాడు: ధర్మాల నుండి ఇస్లాంను, మాసాల నుండి రమజాన్ మాసంను, రాత్రుళ్ల నుండి ఖద్ర్ రాత్రి(షబే ఖద్ర్)ను మరియు దినాల నుండి శుక్రవారాన్ని.
10. అల్లాహ్ సృష్టిపై దయ చూపించడం (నిజానికి) అల్లాహ్ ఆజ్ఞను గౌరవించడం.
11. నేను మీ మధ్య రెండు అమూల్యమైన వాటిని విడిచి వెళ్తున్నాను: అల్లాహ్ గ్రంథం మరియు నా సంతానం(ఇత్రాత్); వాటిని ఆశ్రయించి ఉన్నంత వరకు మార్గభ్రష్టతకు గురికావు.
12. అలీ(అ.స) యొక్క ప్రతిష్టతను మరియు స్థానాన్ని వివరిస్తూ ఇలా ప్రవచించారు: నేను విజ్ఞాన పట్టణం మరియు అలీ దాని ద్వారము. అ తరువాత ఇలా అన్నారు.. అల్లాహ్ ను ఏవిధంగానైతే తెలుసుకోవాలో అలా నేను మరియు అలీ తప్ప ఎవరూ తెలుసుకోలేరు. నన్ను ఏవిధంగానైతే తెలుసుకోవాలో అలా అల్లాహ్ మరియు అలీ తప్ప ఎవరూ తెలుసుకోలేరు. అలీ ను ఏవిధంగానైతే తెలుసుకోవాలో అలా అల్లాహ్ మరియు నేను తప్ప ఎవరూ తెలుసుకోలేరు.
13. భూమిపై అల్లాహ్ నీడ అధికారి, అన్యాయానికి గురి అయినవారు దాన్ని ఆశ్రయిస్తాడు.
14. నాలుగు విషయాలకు మరో నాలుగు విషయాల అవసరం.. అమలుకు విజ్ఞానం, సద్గుణానికి మంచి కుటుంబం, స్నేహానికి బంధం, అనుభవానికి బుద్ధి.
15. తన గురించి ఏదైతే కావాలనుకుంటాడో నీకోసం దానిని కోరని వాడితో సహవాసం, నీకు మంచిని చేకూర్చదు.
16. ఒక కాగితం పై తన విజ్ఞానాన్ని మిగిల్చి ఒక విశ్వాసి మరణించాడు, ప్రళయదినం ఆదే కాగితం అతడి మరియు నరకాగ్నికి మధ్య అడ్డుగా ఉంటుంది. మరియు అల్లాహ్ తఆలా అందులో లిఖించబడిన ప్రతీ అక్షరానికి బదులు ఈ ప్రపంచానికి ఏడు రెట్లు పెద్దగా ఉన్న పట్టణాలను అతడికి ప్రసాదిస్తాడు. ఒక గడియం విజ్ఞాని దగ్గర కూర్చున్న ప్రతీ విశ్వాసికి అతడి ప్రభువు అతడికి ఇలా అంటాడు.. నాకు ఇష్టమైన వాడి వద్ద కూర్చున్నావి, నా గౌరవం మరియు నా కీర్తి పై ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వు స్వర్గంలో అతడితో పాటు కూర్చో బెడతాను అందులో ఎటువంటి సందేహం లేదు.
17. తౌబహ్ (పశ్చాత్తాపం) చేయడంలో ఆలస్యం చేయడం, మోసపోవడానికి కారణం. రేపూ ఎల్లుండీ పై వదిలేయడం గందరగోళానికి కారణం. అల్లాహ్ ముందు సాకులు, నాశనానికి కారణం. పాపకార్యం పై పట్టుదల, తనను తాను సురక్షితంగా భావించడం. మరి అల్లాహ్ ఎత్తుల నుండి సురక్షితంగా ఉన్నాము అని నష్టపోయేవారు తప్ప మరోకరు భావించరు.

రిఫరెన్స్
అద్దుర్రతుల్ బాహిరహ్, షహీదె అవ్వల్, తర్జుమా.. అబ్దుల్ హాదీ మస్ఊదీ, ఇంతెషారాతె జాయిర్, చాప్3, 1394.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17