ఉత్తమ ఉపాధ్యాయుడి లక్షణాలు మరియు వాటి పై ఖుర్ఆన్ నిదర్శనాలు...

ప్రపంచంలో అత్యంత ఉత్తమ వృత్తులలో ఒకటి ఉపాధ్యాయుని వృత్తి. ఏ ఉపాధ్యాయుడు అయితే స్వచ్ఛతతో పిల్లలను బోధిస్తాడో మరియు విద్యా బోధన సమయంలో దైవాన్ని దృష్టిలో ఉంచి తన విద్యార్ధులను బోధిస్తాడో అతడి వద్ద విద్య నేర్చుకున్న విద్యార్ధుల తీరే వేరుగా ఉంటుంది. వారు ఎక్కడ ఉన్న తమ ప్రభావాన్ని సమాజం పై చూపుతూ ఉంటారు. వారు నిత్యం సమాజాన్ని సరిదిద్దాలని అనుకుంటూ ఉంటారు. వారి ప్రతి అడుగు జ్ఞానంతో కూడి ఉంటుంది. ఉపాధ్యాయుల స్థానమే వేరు. అయితే ఉపాధ్యాయులందరూ ఇలా ఉండరు అని కూడా మనం గమనించాలి; నిజానికి ఉపాధ్యాయుడు ఇలా ఉండకపోతే అతడు ఉపాధ్యాయుడే కాదు. ఉపాధ్యాయుడు రుజుమార్గం చూపేవాడై ఉండాలి గాని సమాజాన్ని మరియు పిల్లల భవిష్యత్తును మార్గభ్రష్టతకు గురి చేయకూడాదు. మేము ఉపాధ్యాయుని యొక్క స్థాన్నాని గౌరవిస్తున్నాము మరియు అతడిని ఉత్తముడిగా భావిస్తున్నాము అంటే అతడు వంద శాతం సమాజం యొక్క ఉన్నతను కోరే ఉపాధ్యాయుడు అని మా ఉద్దేశం. ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క కొన్ని లక్షణాలను వివరించాలనుకుంటున్నాము.
మంచి ఉపాధ్యాయుడి లక్షణాలు:
1. స్వీయ శుద్ధి మరియు ధర్మనిష్ట
మంచి ఉపాధ్యాయుని యొక్క మొదటి మరియు ముఖ్యమైన లక్షణం స్వీయ శుద్ధి మరియు ధర్మనిష్థ కలిగి వుండడం. ధర్మనిష్ఠ మనిషిని కంట్రోల్ ఉంచే అతి బలమైన కారణం; దాని ద్వార అతడు ఇతర మనుషుల పట్ల అతడిపై ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తాడు. అదే ధర్మనిష్ట లేకపోతే ఇతరుల పట్ల బాధ్యత కలిగి వుండడు, తాను మార్గభ్రష్టతకు గురి అవ్వడమే కాకుండా విధ్యార్దులను కూడా మార్గభ్రష్టతకు గురి చేస్తాడు. అందుకని ఉపాధ్యాయుడు ఈ వృత్తిని ఎన్నుకునే ముందు తనను తాను సరి చేసుకోవడం చాలా అవసరం. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “ఓ విశ్వాసులారా! మీరు చేయ(లే)ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు?”[సూరయె సఫ్, ఆయత్02].
ధర్మనిష్ఠ గురించి హదీసులో ఇలా వివరించబడి ఉంది: “అల్లాహ్ ధర్మనిష్ఠ ద్వార తన దాసుడ్ని అతడు ఉహించలేని వాటి నుండి కాపాడుతాడు, అతడి నుండి హృదయ అంధాకారం మరియు అజ్ఞానాన్ని దూరం చేస్తాడు”[1] మరో రివాయత్ లో ఇలా వివరించబడి ఉంది: అల్లాహ్ ఈ రెండు లక్షణాలు లేకుండా అమలును స్వీకరించడు ఒకటి ధర్మనిష్ఠ మరియు రెండవది చేసే పనిలో స్వచ్ఛత.[2]
2. విశాల హృదయం మరియు ఔదార్యం: ఒక ఉపాధ్యాయుడు ఎదురుకునే సమస్యలు అందరికి తెలిసినవే, కొంతమంది విధ్యార్ధుల అల్ప చర్యల వల్ల ఉపాధ్యాయులకు చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా విధ్యార్ధి కృతఘ్నుడు మరియు విలువ ఇవ్వనివాడు అయినప్పుడు, కాని ఇలాంటి విషయాలు ఉపాధ్యాయుడి కార్యములలో ఎటువంటి ఆటంకం కాకూడదు. ఒక ఉపాధ్యాయుడు దైవప్రవక్తల వలే విశాల హృదయం మరియు ఔదార్యం కలిగివుండాలి. తన మాటలో ప్రభావం మరియు బోధించే శక్తిని అల్లాహ్ నుండి కోరి తన పనిని మంచిగా చేయడానికి ప్రయత్నించాలి. ఖుర్ఆన్ ఇలా సూచించెను: అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నారు: “ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ను విశాలమైనదిగా చేయి. నా కార్యాన్ని నాకోసం సలభతరం చేయి. నా నాలుక ముడిని విప్పు. ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు”[సూరయె తాహా, ఆయత్25-28].
3. విధ్యార్ధి పట్ల చాలా మేలు కోరి మరియు కారుణ్యం కలిగి వుండడం: దైవప్రవక్త(స.అ) యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి హిదాయత్ మరియు జ్ఞానం విషయంలో తన అనుచరుల పట్ల కరుణ కలిగివుండడం మరియు ఎతగానో మేలు కోరుకోవడం. అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ఉపదేశించెను: “మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు”[సూరయె తౌబహ్, ఆయత్128]. అంటే నిజమైన ఉపాధ్యాయుడ్ని విద్యార్ధి యొక్క కష్టం బాధ కలిగిస్తుంది. అతడు తన విద్యార్ధ కోసం అలుపెరగని ప్రయత్నాలు చేస్తాడు. నిత్యం విద్యర్ధి మేలును కోరుకుంటాడు.
4. శ్రేయోభిలాషి మరియు నమ్మకస్థుడు: ఖుర్ఆన్ ఉపదేశం: “నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని”[అఅరాఫ్, ఆయత్68]. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్ధిలో ఆధ్యాత్మిక మరియు సద్గుణ లోపాలను చూసీ చూడనట్లు వదిలేయడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుడు విధ్యార్ధులు దైవం అతడికి ఇచ్చిన అమానత్ గా భావిస్తాడు, వాళ్ల శిక్షణా బాధ్యాతలు అతడి పై ఉంది అని నమ్ముతాడు. గణిత ఉపాధ్యాయుడు కేవలం అతడు గణితం నేర్పించడమే అతడి పని కాదు, అలాగే సైన్స్ ఉపాధ్యాయుడు కేలవం అతడు సైన్స్ నేర్పించడమే అతడి పని కాదు, అంతుకు మించి బాధ్యత కలిగ ఉండాలి. అతడి సత్ప్రవర్తన విధ్యార్ధి ప్రవర్తన పై ప్రభావం చూపించాలి. హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “నాలక(నోరు)తో కాకుండా ప్రజలను (మీ విశ్వాసం మరియు మార్గం వైపు) ఆహ్వానించండి, ప్రజలు నీ ధర్మనిష్ఠ, ప్రయత్నం, నమాజ్ మరియు మంచిని చూడాలి, అవే స్వయంగా ఆహ్వానించేవి అవ్వాలి”[3]
5. అలుపెరగని ప్రయత్నం: ఖుర్ఆన్ యొక్క ఇలా ఉపదేశిస్తుంది: “తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురు గాక! వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా – ఖచ్చితంగా – తీసుకుంటారు. కాని వారికి కొలచిగానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.[సూరయె ముతఫ్ఫిఫీన్, ఆయత్1-3]. ఒక మంచి ఉపాధ్యయుడు తన కర్తవ్యాన్ని తన బాధ్యతను మంచి రీతిలో నిర్వర్తిస్తాడు. ఈ విషయంలో ఎటువంటి కొరత మరియు తరుగు చేయడు. అతడు విద్యార్ధులను సంపూర్ణ స్థాయికి చేర్చడానికి అలపెరగని ప్రయత్నం చేస్తాడు.
చివరి మాట: విద్యా వృత్తి చాలా కష్టమైన వృత్తి, కాని దాన్ని ప్రేమించి, ఇష్టపడి మరియు అల్లాహ్ సామిప్యం కోసం గనక అయితే ఇందులో ఎటువంటి శ్రమ మరియు కష్టం అనే పదాలకు చోటే లేదు.
రిఫరెన్స్
1. అల్ కాఫీ, మర్హూమ్ కులైనీ, భాగం8, పేజీ52.
2. తస్నీఫు గురరిల్ హికమ్ వ దురరిల్ కలిమ్, పేజీ155, హదీస్2914.
3. అల్ కాఫీ, మర్హూమ్ కులైనీ, భాగం2, పేజీ78.
వ్యాఖ్యానించండి