షహీద్ ముతహ్హరీ(ర.అ)

మంగళ, 05/03/2022 - 03:36

షహీద్ ముర్తుజా ముతహ్హరీ(ర.అ) గురించి వారి తల్లి మరియు భార్య వివరించిన కొన్ని సంఘటనలు...  

షహీద్ ముతహ్హరీ(ర.అ)

షహీద్ ముతహ్హరీ(ర.అ) గురించి వారి తల్లి గారు ఇలా వివరించారు: ముతహ్హరీ జన్మించడానికి రెండు నెలల క్రితం ఒక రాత్ర ప్రశాంతంగా నిద్రపోతుండగా కలలో ఒక ఆద్యాత్మిక వేడుక జరుగుతుండగా చూశాను, అందులో చుట్టు ప్రక్కల నివసించే స్ర్తీలందరూ అక్కడ ఉన్న మస్జిదులో చేరి ఉన్నారు. అప్పుడే ఒక పవిత్ర మరియు గౌరవప్రదమైన ఒక స్ర్తీను మరో ఇద్దరు స్ర్తీలతో ప్రవేశించడాన్ని చూశాను ఆమె తనతో పాటు వచ్చినవారితో గులాబీల నీళ్లు చల్లమని కోరారు. నా వద్దకు వచ్చినప్పుడు మూడు సార్లు గులాబీ నీళ్లను చల్లారు, బహుశా నా హృదయాన్ని కమ్ముకొని వున్న పాపాములు మరియు చీకటిని ఇలా చేసి తొలగించి నా హృదయాన్ని పవిత్రంగా చేయాలనుకుంటున్నారేమోనని అనుకున్నాను కాని ఆ ప్రముఖ స్ర్తీ ఆనందిస్తూ ఇలా సమాధానం ఇచ్చింది: “నీ గర్భంలో ఉన్న ఆ బిడ్డ కోసం ఇలా చేయడం అవసరంగా భావించి చేశాము, అతడు ప్రకాశవంతమైన భవిష్యత్తు కలిగివున్నాడు, అతడు ఇస్లామీయ సమాజం కోసం భారీ సేవలను అందిస్తాడు”.

షహీద్ ముతహ్హరీ(ర.అ) యొక్క భార్య వారి గురించి ఇలా వివరించారు: వారు చంపబడిన రోజుల్లో టెలిఫోన్ వచ్చింది, ఒక ఆరిఫ్ (ఆమె భార్య అతని పేరు చెప్పలేదు) నాకు ఫోన్ చేసి “ముతహ్హరీ కి ఏదైనా జరిగిందా?” అని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అప్పటికి వీరు చంపబడిన వార్త చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తరువాత అతను ఇలా అన్నారు: నిన్న రాత్రి ఒకామె నాకు ఫోన్ చేసి ఇలా చెప్పింది: అయ్యా! నేను కలలో దైవదూతలను చూశాను వాళ్లు నన్ను ఒక సమాధిని చూపించి దీన్ని దర్శించుకో అని అన్నారు. ఇది ఎవరి సమాధి? అని అడిగాను. వాళ్లు ఇది “ఇమామ్ హుసైన్(అ.స) యొక్క సమాధి అని సమాధానమిచ్చారు. ఆ తరువాత పచ్చ రంగు కాంతితో మెరుస్తున్న మరో సమాధిని చూపించి ఇది అల్లాహ్ యొక్క ఔలియాలలో ఒకరి సమాధి దీన్ని కూడా దర్శించుకో అని అన్నారు. వారి పేరేమిటి అని ప్రశ్నించాను? దానికి వారు ఇలా సమాధానిమిచ్చారు: ఇది షహీద్ ముతహ్హరీ సమాది. షహీద్ ముతహ్హరీని చంపబడిన సమయంలోనే ఆమె కల చూసినట్లు తెలిసింది.

షహీద్ ముతహ్హరీ(ర.అ) భార్య ఇంకో సంఘటనను ఇలా వివరించారు: ఒకరోజు రాత్రి షహీద్ ముతహ్హరీ(ర.అ) నిద్ర నుండి ఉలిక్కి పడి లేచారు, వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నారు, ఏమయ్యింది అని ప్రశ్నించాను. నేను కలలో చూశాను; హజ్రత్ ఇమామ్ ఖుమైనీ(ర.అ)తో పాటు కలిసి దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్లాము, నేను స్వామితో ఇలా అన్నాను: దైవప్రవక్త(స.అ)! ఇతను మీ కుమారుడు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) ఇమామ్(ఖుమైనీ)ను కౌగిలించుకున్నారు. తర్వాత నా వైపు తిరిగి నన్ను తన దగ్గరకు తీసుకొని కౌగిలించుకుని తన పెదాలను నా పెదాల పై ఉంచారు, ఇప్పుడు కూడా వాటి వెచ్చదనాన్ని స్పర్సిస్తున్నాను అని అన్నారు. నా ఆలోచన ప్రకారం ఏదో పెద్ద సంఘటన సంభవించనున్నది అని భావిస్తున్నాను, అని అన్నారు. మూడు రోజుల తరువాత వారు చంపబడ్డారు.

రిఫరెన్స్
దాస్తాన్ హాయె ఆరిఫానెహ్, షహ్ రూజె షహ్రూయీ.

https://btid.org/fa/news/11395

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16