దైవధర్మాల నమూనా

శని, 05/07/2022 - 18:14

అల్లాహ్ న్యాయధర్మాలు పలు విధాలుగా, పలు మార్గాలలో అమలు పరిచే విధంగా చూస్తాడు అందులో ఒకటి ఈ సంఘటన...

దైవధర్మాల నమూనా

ఒక రోజు హజ్రత్ మూసా(అ.స) ఒక కొండ వద్ద నుండి వేళ్తుండగా అక్కడ ఒక కాలువను చూసి దాని నీళ్లతో ఉజూ చేసుకున్నారు, ఆ తరువాత కొండ పైకీ వెళ్లి నమాజ్ లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక వ్యక్తి గుర్రంపై ఆ కాలువ వద్దకు వచ్చాడు. దాని నుండి నీళ్లు తాగ్రి ధనంతో నిండి ఉన్న సంచిని అక్కడే మరచిపోయి వెళ్లిపోయాడు. అతడు అక్కడ నుండి వెళ్లిపోయిన తరువాత అక్కడికి గొర్రెలు మేపుకునేవాడు ఆ కాలువ వద్దకు (నీళ్లు త్రాగడానికి) వచ్చాడు. అక్కడ అతడికి ఆ ధనంతో నిండి వున్న సంచి కనిపించింది, అతడు దాన్ని తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తరువాత అలసటతో తల పై కట్టెలు మోసుకొని ఒక ముసలోడు ఆ కాలువ వద్దకు వచ్చాడు. కట్టెలు నేల పై దించి విశ్రాంతి కోసం కూర్చున్నాడు. అప్పుడే ఆ గుర్రపు వ్యక్తి తన ధన సంచిని వెతుక్కంటూ ఆ కాలువ వద్దకు తిరిగి వచ్చాడు, అక్కడ సంచి కనిపించకపోవడంతో ఆ విశ్రాంతి తీసుకుంటున్న ముసలాడి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు: నా సంచిని నువ్వు తీసుకున్నావు, ఎందుకంటే ఇక్కడ నువ్వు తప్ప మరొడు లేడు. ముసలాడు ఇలా సమాధానమిచ్చాడు: నాకు నీ సంచి గురించి తెలియదు. వారిద్దరి మధ్య మాటకు మాట పెరిగింది, ఘర్షణకు వరకు చేరింది, చివరికి ఆ గుర్రపు వ్యక్తి ముసలాడ్ని చంపి అక్కడ నుండి వెళ్లిపోయాడు.
(ఈ సంఘటనను ఆశ్చర్యంగా మరియు న్యాయధర్మాలకు వ్యతిరేకంగా భావించిన) హజ్రత్ మూసా(అ.స) అల్లాహ్ తో ఇలా అన్నారు: “ఓ ప్రభువా! ఇందులో న్యాయం ఏలా?”
అల్లాహ్ హజ్రత్ మూసా(అ.స) పై దైవవాణి పంపెను: ఆ కట్టెలు కొట్టుకునే ముసలాడు, ఆ గుర్రపు వ్యక్తి తండిని చంపినవాడు. (ఈ రోజు ఆ చంపబడిన వ్యక్తి కుమారుడి ద్వార అతడి రక్త మూల్యం తీర్చుకోబడింది). ఆ గుర్రపు వ్యక్తి యొక్క తండ్రి సంచిలో ఉన్న ధనంతో సమానమైన ధనం ఆ గొర్రెలు మేపుకునే వాడి తండ్రికి అప్పున్నాడు, ఈ రోజు ఆ గొర్రెలు మేపుకునేవాడికి చేరాల్సింది చేరిపోయింది. ఈ విధంగా రక్త మూల్యం మరియు అప్పులు తీర్చబడ్డాయి, “و انا حکمٌ عدلٌ నేన న్యాయంగా తీర్పునిచ్చే న్యాయాధికారిని”[2]

హజ్రత్ మూసా(అ.స) యొక్క ఈ సంఘటన., మనం చేసే నేరాలు మరియు అన్యాయాలు ఏవీ ఊరికే పోవు, ఎవరికి ఎప్పుడు దాని ప్రతిఫలాన్ని ఇవ్వాలో అప్పుడు వారికి తిరిగి ఇవ్వబడుతుంది అన్న విషయాలు మనకు తెలియ పరుస్తుంది.
ఈ సంఘటనలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఊహించుకున్నవాడికి ఊహించుకున్నంత అనే రకంగా.

రిఫరెన్స్
1. یا ربّ کیف العدل فی هذه الامور
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం64, పేజీ117-118.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15