మౌతహ్ యుద్ధం

ఆది, 01/21/2018 - 06:54

.జుమాదల్ అవ్వల్ మాసం 6వ తారీఖున హిజ్రీ యొక్క 8వ సంవత్సరంలో “మౌతహ్” యుద్ధం జరిగింది. దాని సంక్షిప్త వివరణ.

మౌతహ్ యుద్ధం

హిజ్రీ యొక్క 8వ సంవత్సరంలో “మౌతహ్” యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి గల కారణం ఏమిటంటే “హారిస్ ఇబ్నె ఉమైర్ అజది” ను “మౌతహ్” భూములలో “రూమ్” సైన్యాధిపతి అయిన “షర్ హబీల్ ఇబ్నె అమ్ర్” ఆదేశానుసారం బంధించి చేతులను కట్టి నరికేశారు.[వఖాయివుష్షుహూర్, పేజీ94] ఈ వార్త విని దైవప్రవక్త[స.అ] చాలా నిరాశ చెందారు, ఇంచుమించి 3 వేల సైన్యాన్ని సిద్ధం చేసి “జాఫర్ ఇబ్నె అబీతాలిబ్”ను సైన్యాధిపతిగా నియమించి ఒకవేళ జాఫర్ చంపబడితే “జైద్ ఇబ్నె హారిసహ్” అతను కూడా చంపబడితే “అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహహ్” సైన్యాధిపత్యాన్ని చేపట్టాలి అని నిర్ధారించారు. దైవప్రవక్త[స.అ] వారిని సాధ్యమైనంత వరకు కాఫిరులను ఇస్లాం స్వీకరణకై ఆహ్వానించండి ఆ తరువాత వారు ఇస్లాం స్వీకరించని పరిస్థితిలో వారితో యుద్ధం చేయండి అని అన్నారు.
ఇస్లాం సైన్యం “మౌత” భూముల వైపుకు ప్రయాణం మొదలు పెట్టింది. ఇస్లాం సైన్యం వస్తున్న వార్తను విన్న “షర్ హబీల్” వేధన చెంది “రూమ్” రాజు నుండి పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోరాడు. అలా లక్షమంది సైన్యం ముస్లిం సైన్యాంతో యుద్ధానికి సిద్ధమయ్యింది.
ఇరువైపుల సైన్యం యుద్ధానికి సిద్ధమైయ్యింది, వారి మధ్య చాలా వ్యథాకరమైన యుద్ధం జరిగింది. “జాఫర్ ఇబ్నె అబీతాలిబ్” ధైర్యముగా ముందుకు దూసుకొని వెళ్ళిపోయారు, అకస్మాత్తుగా అతను తనను శత్రుసైన్య ముట్టడిలో ఉన్నట్లుగా గ్రహించారు, ఆ ముట్టడి మరియు దాడి వలన వారి రెండు చేతులు నరకబడ్డాయి, శరీరం పై చాలా గాయాలు అయ్యాయి, అలా వారు చంపబడ్డారు. ఆ తరువాత “జైద్ ఇబ్నె హారిస్” సైన్యథిపత్యాన్ని చేపట్టారు కాని వారు కూడా చంపబడ్డారు. ఆ తరువాత “అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహహ్” సైన్యాథిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు కాని శత్రువుల నిరంతర దాడులతో అతను కూడా చంపబడ్డారు. దైవప్రవక్త[స.అ] నియమించిన ముగ్గురు సైన్యాథిపతులు చనిపోయిన తరువాత ఇస్లాం సైన్యానికి ఏమిచేయాలో తెలియలేదు. చివరికి “సాబిద్ ఇబ్నె అఖ్వామ్” మరియు “ఖాలిద్ ఇబ్నె వలీద్” ఉపాయంతో ఇస్లామీయ సైన్యం “రూమ్” యొక్క అతి పెద్ద సైన్యంతో ఒకరోజు స్థిరత్వమైన యుద్ధం తరువాత సురక్షితంగా మదీనహ్ కు తిరిగి వచ్చారు.[సీరయే ఇబ్నె హిషామ్, భాగం2, పేజీ388. బిహారుల్ అన్వార్, భాగం21, పేజీ62]

రిఫ్రెన్స్
సీరయే ఇబ్నె హిషామ్, భాగం2, పేజీ388. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం21, పేజీ62.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17