గైబతె కుబ్రా కాలంలో ఇమామ్ మహ్దీ(అ.స) ప్రతినిధులు

ఆది, 05/08/2022 - 16:27

గైబతె కుబ్రా కాలం మొదలయ్యింది అప్పుడు ఇమామ్ మహ్దీ(అ.స) ప్రతినిధులు ఎవరు అన్న ప్రశ్నకు వారే స్వయంగా తౌఖీహ్ ద్వార మార్గాన్ని చూపించారు...

గైబతె కుబ్రా కాలంలో ఇమామ్ మహ్దీ(అ.స) ప్రతినిధులు

గైబతె కుబ్రా కాలం మొదలయ్యింది అప్పుడు ఇమామ్ మహ్దీ(అ.స) ప్రతినిధులు ఎవరు అన్న ప్రశ్నకు వారే స్వయంగా తౌఖీహ్ ద్వార ఇలా ఉపదేశించి మార్గన్ని చూపించారు: “....అయితే మీకు ఎదురొచ్చే సమస్యలు మరియు కష్టాలలో మా రావీయులను ఆశ్రయించండి, ఎందుకంటే వాళ్లు నా తరపు నుండి మీపై హుజ్జత్(మార్గదర్శి, నిదర్శనం) మరియు నేను (వారిపై) అల్లాహ్ యొక్క హజ్జత్ ను...”[1]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనుసారం; దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: ఓ అల్లాహ్! నా ఉత్తరాధికారులపై నీ దయా మరియు కారుణ్యాలను చూపించు. ప్రశ్నించబడింది: ఓ దైవప్రవక(స.అ)! మీ ఉత్తరాధికారులెవరూ? సమాధానంగా వారు ఇలా అన్నారు: “నా తరువాత వచ్చేవారు మరియు నా హదీస్ మరియు సున్నత్ ను ఉల్లేఖించేవారు. దానిని ప్రజలకు నేర్పించేవారు”. (అనగా యోగ్యత గల ఉలమాలు మరియు ముజ్తహిదీన్ లు).[2]

అలీ ఇబ్నె ముసయ్యబ్ ఉల్లేఖించెను: నేను ఇమామ్ రిజా(అ.స)తో ఇలా అన్నాను: నేను ఉండేది చాలా దూరం నిత్యం మీ వద్దకు రాలేను, అలాంటప్పుడు దీన్ యొక్క అంశాలను ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఇమామ్: ఇహపరలోకాల వ్యవహారాలలో నమ్మకస్థుడైన జకరియ్యా ఇబ్నె ఆదమ్ ను అడిగి తెలుసుకో. అలీ ఇబ్నె ముసయ్యబ్ ఇలా అనెను: ఇమామ్ వద్ద నుండి బయలుదేరి నేను జకరియ్యా ఇబ్నె ఆదమ్ వద్దకు వెళ్లి నాకు కావలసిన వాటిని అడిగి తెలుసుకున్నాను.[3] ఇలాంటి మరెన్నో హదీసులు ఉన్నాయి.

మరో చోట దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: ఉలమాలు దైవప్రవక్తల వారసులు”[4] “దైవప్రవక్తల ఖలీఫాలు మరియు నా వారసులు అలాగే దైవప్రవక్తలందరి వారసులు”[5].

ఈ హదీసున్నీంటిలో హదీసులను ఉల్లేఖించేవారు అనగా ఫఖీహ్(అనగా ఇస్లాం ఆదేశాలను లోతుగా తెలుసుకునేవాడు), మర్జ-ఎ-దీన్(అనగా ఇస్లాం ధర్మం గురించి సమస్య వస్తే ఆశ్రయించదగ్గవాడు), ముజ్తహిద్(అనగా ఇస్లాం ఆదేశాలను తెలుసుకోవడానికి అలుపెరగని ప్రయత్నం చేయువాడు) వీళ్లే ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క ప్రతినిధుల. అయితే వారికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి. ఫఖీహ్ ప్రత్యేకతలను ఇమామ్ మహ్దీ(అ.స) యొక్క తండ్రి అయిన ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖించిన హదీస్ ద్వార తెలుసుకోవచ్చు:

“అయితే ఫిఖాహత్(విషయాలను లోతుగా తెలుసుకొని యోగ్యత) స్థానంలో ఉన్నవాడు: 1. స్వీయాన్ని అదుపులో ఉంచుకుంటాడు 2. ధర్మ రక్షకుడు అయి ఉంటాడు 3. మనోవాంఛలకు వ్యతిరేకంగా ఉంటాడు 4. ప్రభువు అయిన అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉంటాడు. ఈ ప్రత్యేకతలు గనక ఉంటే ప్రజలు వారిని అనుచరించాలి, అయితే షియా ఫఖీహులందరూ ఇలా ఉండరు, వారిలో కొందరు మాత్రమే ఇలా ఉంటారు”(వసాయిల్ అల్ షియా, భాగం18, అధ్యాయం10, హదీస్20).

హదీసులనుసారం తెలిసేవిషయమేమిటంటే ఈ కాలంలో మనం షరా పరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఫఖీహ్, మజ్తహిద్ మరియు మర్జా ను అశ్రయించడం అవసరం. ఇది షియా వర్గం యొక్క ఇప్పటి నమ్మకం కాదు దైవప్రవక్త(స.అ) ఉత్తరాధికారుల కాలం నుంచే వస్తుంది.  

ఒక లెక్క ప్రకారం గైబతె కుబ్రా మొదలయినప్పటి నుండి ఇప్పటి వరకు ముజ్తహిదుల సంఖ్య 247, వారిలో కొందరి పేర్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
1. ఇబ్నె అబీ అఖీల్ ఉమ్మానీ, హసన్ ఇబ్నె అలీ (మరణం 340హిజ్రీ)
2. ఇబ్నె ఖూలవై, జాఫర్ ఇబ్నె మొహమ్మద్ (మరణం369హి)
3. షేఖ్ సదూఖ్, మొహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె బాబ్వై ఖుమ్మీ (మరణం 381హి)  
4. షేఖ్ ముఫీద్, మొహమ్మద్ ఇబ్నె మొహమ్మద్ నోమానీ (మరణం413హి)
5. సయ్యద్ ముర్తుజా, మొహమ్మద్ ఇబ్నె హసన్ (మరణం 460హి)
6. ఇబ్నె ఇద్రీసె హిల్లీ, మొహమ్మద్ ఇబ్నె అహ్మద్ (మరణం598హి)
7. సయ్యద్ ఇబ్నె తాఊస్ (మరణం664హి)
8. మొహఖ్ఖిఖె అవ్వల్, జాఫర్ ఇబ్నె హసన్ (మరణం 676హి)
9. అల్లామా హిల్లీ, హసన్ ఇబ్నె యూసుఫ్ (మరణం 726 హి)
10. షహీదె అవ్వల్, మొహమ్మద్ ఇబ్నె మక్కీ (మరణం786)
11. ఇబ్నె ఫహదె హిల్లీ, అహ్మద్ ఇబ్నె మొహమ్మద్ (మరణం 841హి)
12. మొహఖ్ఖిఖె సానీ, అలీ ఇబ్నె అబ్దుల్ ఆలీ (మరణం940హి)
13. షహీదె సానీ, జైనుద్దీన్ (మరణం 996హి)
14. ముఖద్దసె అర్దబేలీ, అహ్మదె ఇబ్నె మొహమ్మద్ (మరణం 993 హి)
15. షేఖ్ బహాయీ, బహాఉద్దీన్ మొహమ్మద్ ఆములీ (మరణం 1031హి)
16. మజ్లిసీ అవ్వల్, మొహమ్మద్ తఖీ ఇబ్నె మఖ్సూద్ (మరణ1070హి)
17. ఫైజె కాషానీ, మొల్లా మొహ్సిన్ (మరణం1091 హి)
18. మొహఖ్ఖిఖె ఖాన్సారీ, హుసైన్ ఇబ్నె జమాలుద్దీన్ (మరణం 1098హి)
19. అల్లామా మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్ ఇబ్నె మొహమ్మద్ తఖీ (మరణం 1111హి)
20. వహీదె బహ్ బహానీ, మొహమ్మద్ బాఖిర్ ఇబ్నె మొహమ్మద్ అక్మల్ (మరణం1205హి)
21. సయ్యద్ మొహమ్మద్ మహ్దీ బహ్రుల్ ఉలూమ్ (మరణం 1212హి)
22. షేఖ్ జాఫర్ కాషిఫుల్ గితా (మరణం1228హి)
23. సాహిబె జవాహిర్, మొహమ్మద్ హసన్(మరణం 1266హి)
24. షేఖ్ ముర్తుజా అన్సారీ (మరణం 1281హి)
25. మీర్జా మొహమ్మద్ హసన్ షీరాజీ (పొగాకు ఫత్వా ఇచ్చినవారు) (మరణం1312హి)
26. మొహమ్మద్ కాజిమ్ ఆఖుందె ఖురాసానీ (మరణం 1329హి)
27. మీర్జా మొహమ్మద్ హుసైన్ నాయీనీ (మరణం1355హి)
28. మొహమ్మద్ హుసైన్ కాషిఫుల్ గితా (మరమం1373)
29. సయ్యద్ హుసైన్ బురుజర్దీ (మరణం1381హి)
30. సయ్యద్ మొహ్నినుల్ హకీమ్ (మరణం 1390హి)
31. సయ్యద్ రూహుల్లాహ్ ఖుమైనీ (మరణం 1409హి)
32. సయ్యద్ అబుల్ ఖాసిమ్ ఖుయీ (మరణం 1413హి)
33. అలీ సాఫీ గుల్ పాయెగానీ, (మరణం క్రీ.శ 2010)
34. మీర్జా జవాదె తబ్రెజీ (మరణం క్రీ.శ 2006)
35. సయ్యద్ షహాబుద్దీనె మర్అషీ నజఫీ, (మరణం కీ.శ 1990)
36. మొహమ్మద్ ఫాజిలె లంకరానీ (మరణం1428హి)
37. మొహమ్మద్ తఖీ బెహ్జత్ (మరణం 1430హి)
38. లుత్హుల్లాహ్ సాఫీ గుల్ పాయెగానీ (మరణం1443హి)
39. హుసైన్ వహీదె ఖురాసానీ, (జననం క్రీ.శ 1924)
40. హుసైన్ నూరీ హమదానీ (జననం క్రీ.శ 1926)
41. నాసిర్ మకారిమ్ షీరాజీ (జననం క్రీ.శ 1927)
42. సయ్యద్ మూసా షుబైరీ జన్జానీ (జననం క్రీ.శ 1927)
43. జాఫర్ సుబ్హానీ (జననం క్రీ.శ 1927)
44. సయ్యద్ అలీ హుసైనీ సీస్తానీ (జననం క్రీ.శ 1930)
45. అబ్దుల్లాహ్ జవాదె ఆములీ (జననం క్రీ.శ 1933)
46. హుసైనె మజాహిరీ ఇస్ఫెహానీ (జననం క్రీ.శ 1934)
47. యూసుఫం సానెయి (జననం క్రీ.శ 1937)
48. సయ్యద్ అలీ హుసైనీ ఖమెనయీ (జననం క్రీ.శ 1942)

రిఫరెన్స్
1. వసాయిల్ అల్ షియా, భాగం18, పేజీ101, హదీస్9.
2. వసాయిల్ అల్ షియా, భాగం18, అధ్యాయం8, హదీస్50.
3. వసాయిల్ అల్ షియా, భాగం18, పేజీ106, హదీస్27.
4. కన్జుల్ ఉమ్మాల్, హదీస్28676.
5. కన్జుల్ ఉమ్మాల్, హదీస్28677.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 44