బఖీ స్మశానంలో ప్రముఖులు

సోమ, 05/09/2022 - 17:20

బఖీ స్మశానంలో సమాధి చేయబడిన ప్రముఖుల గురించి సంక్షిప్త వివరణ...

బఖీ స్మశానంలో ప్రముఖులు

1. ఫాతెమా జహ్‌రా(స.అ)
ఫాతెమా జహ్‌రా(స.అ) అంతిమ దైవప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క ప్రియమైన కుమార్తె. వారి ఇంట జుమాదస్సానియా 20వ తారీకు, బేసత్ యొక్క 5వ ఏట, శుక్రవారం ఉదయం ఫాతెమా జహ్‌రా(స.అ) జన్మించారు. అప్పుడే జన్మించిన ఆ పాపాను దైవప్రవక్త(స.అ) ఎత్తుకొని “ఫాతెమా నా ప్రాణం, వారి నుండి స్వర్గపు సువాసన వస్తుంది” అన్నారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ), 5 సంవత్సరాల వయసులోనే తమ తల్లిని పోగొట్టుకున్నారు. దైవప్రవక్త(స.అ) వారిని చాలా గౌరవించేవారు, ఎల్లపుడూ “ఫాతెమా నాలోని భాగం, ఎవరైనా ఆమెను ఆనంద పరిస్తే నన్ను ఆనందపరిచినట్టు నన్ను ఆనంద పరచడం అల్లాహ్‌ను ఆనంద పరిచినట్లు, ఆమెను భాధ కలిగిస్తే నన్ను బాధ కలిగించినట్టే, నన్ను బాధ కలిగించడం అల్లాహ్‌ను బాధ కలిగించినట్టు” అనేవారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) వివాహం హిజ్రీ యొక్క 2వ ఏట హజ్రత్ అలీ(అ.స)తో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు[1]
ఆమె 18 సంవత్సరాల వయసులోనే కొంత మంది దుష్టులు వారి ఇంటి పైన చేసిన దాడి ప్రభావం వల్ల ఈ లోకాన్ని విడిచి వేళ్ళారు. వారి సమాధి బఖీ స్మశానంలో ఉంది.

2. ఇమామ్ హసన్ ఇబ్నె అలీ(అ.స)
దైవప్రవక్త[స.అ] యొక్క రెండవ ఉత్తరాధికారి ఇమామ్ హసన్[అ.స]. తండ్రి ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] తల్లి ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]. పవిత్ర మాసం రమజాన్ 15వ తారీఖు, హిజ్రీ యొక్క 3వ ఏట మదీనహ్ లో జన్మించారు. అతని పేరు దైవప్రవక్త[స.అ], అల్లాహ్ ఆదేశం ప్రకారం “హసన్” అని పెట్టారు. తౌరైత్(యూదుల పవిత్ర గ్రంధం)లో వారి పేరు “షబ్బర్”. హసన్ మరియు షబ్బర్ పదాలు వేరైనా అర్ధం ఒక్కటే.
వారి తండ్రి హజ్రత్ అలీ[అ.స] మరణాంతరం అనగా రమజాన్ నెల హిజ్రత్ యొక్క 40వ సంవత్సరం నుండి సఫర్ నెల 50వ హిజ్రీ వరకు వారి ఇమామత్ పదవీ కాలం, అనగా 10 సంవత్సరాలు.
హిజ్రీ యొక్క 50వ ఏటా అతని భార్య ముఆవియా కపటానికి గురి అయ్యి తన భర్తకు విషమిచ్చింది. ఆమె పేరు జోదా బింతె అష్‌అస్ బిన్ ఖైస్. ఆ విషం ద్వారానే అతని మరణం సంభవించింది. అతని మృతదేహాన్ని వారి పితామహులైన దైవప్రవక్త[స.అ] సమాధి ప్రక్కన సమాధి చేయడానికి అడ్డుకున్నారు. అప్పుడు అతని సోదరుడైన ఇమామ్ హుసైన్[అ.స] అతని పవిత్ర దేశాన్ని వారి తల్లి హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] సమాధి ప్రక్కన “జన్నతుల్ బఖీ”లో సమాధి చేశారు.[2]

3. ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) దైవప్రవక్త(స.అ) యొక్క నాలుగొవ ఉత్తరాధికారి, ఇమామ్ హుసైన్(అ.స) యొక్క కుమారుడు. వారి ప్రముఖ బిరుదులు “జైనుల్ ఆబెదీన్”, “సజ్జాద్”.
ఇమామ్ సజ్జాద్(అ.స) హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో జన్మించారు. వారి బాల్యం మదీనహ్ లో గడిచింది. రెండు సంవత్సరాలు వారి పితామహులైన అలీ(అ.స) యొక్క అధికారాన్ని చూశారు. ఆ తురువాత 10 సంవత్సరాలు తన పెదనాన్న అయిన హజ్రత్ హసన్(అ.స) యొక్క అధికారంలో జరిగిన సంఘటనలు చూస్తూ పెరిగారు. ఇమామ్ హసన్(అ.స) మరణానంతరం 10 సంవత్సరాల వరకు తన తండ్రి హుసైన్ ఇబ్నె అలీ(అ.స) ప్రక్కనే ఉన్నారు.
హిజ్రీ యొక్క 61వ హిజ్రీలో ముహర్రం లో కర్బలా భూమిపై తమ తండ్రిని అన్యాయంగా చంపబడడాన్ని చూశారు. కర్బలా యదార్థ సంఘటన తరువాత వారు ఇమామత్ బాధ్యత పొందారు. మిగిలివున్న ఇమామ్ హుసైన్(అ.స) కుటుంబ సభ్యులను బంధీలుగా చేసి కూఫా అక్కడ నుంచి షామ్ కు తీసుకుని వెళ్లారు. ఇమామ్ సజ్జాద్(అ.స) దారిపొడుగునా ఉపన్యాసాలు ఇచ్చి యజీద్ అధికారాన్ని సిగ్గుపడేలా చేశారు. షామ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మదీనహ్ లో స్థిరపడ్డారు. హిజ్రీ యొక్క 94 లేదా 95వ సంవత్సరంలో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి ఇమామ్ హసన్(అ.స) ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది.[3]

4. ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స)
ఇమామ్ బాఖిర్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క ఐదవ ఉత్తరాధికారి, ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క కుమారుడు. వారి పేరు “ముహమ్మద్”, వారి కున్నియత్ “అబూ జాఫర్”, వారి బిరుదులు “బాఖిర్”, “బాఖిరుల్ ఉలూమ్”
ఇమామ్ బాఖిర్(అ.స) హిజ్రీ యొక్క 57వ ఏట మదీనహ్‌లో జన్మించారు. తల్లి “ఉమ్మె అబ్దుల్లాహ్” ఈమె ఇమామ్ హసన్(అ.స) కుమార్తె, ఈ విధంగా ఇమామ్ బాఖిర్(అ.స) తల్లీ మరియు తండ్రి ఇద్దరి తరపు నుంచి ఫాతెమీ మరియు అలవీ సంతానం. తండ్రి ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించేటప్పుడు ఇమామ్ బాఖిర్(అ.స)కి 39 సంవత్సరాల వయసు.  
ఇమామ్ బాఖిర్(అ.స) యొక్క ఇమామత్ కాలం 18 సంవత్సరాలు. హిజ్రీ యొక్క 114వ సంవత్సరంలో మదీనహ్ లో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి వారి తండ్రి మరియు పితామహుల ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది. [4]

5. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స)
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 6వ ఉత్తరాధికారి. వారి పేరు “జాఫర్”, కున్నియత్ “అబూ అబ్దిల్లాహ్”, బిరుదు “సాదిఖ్”. తండ్రి ఇమామ్ మొహమ్మద్ బాఖిర్(అ.స) మరియు తల్లి “ఉమ్మె ఫర్వా”
హిజ్రీ యొక్క 83వ ఏట రబీవుల్ అవ్వల్ మాసం 17వ తేదీన మదీనహ్ లో జన్మించారు.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) 114వ సంవత్సరంలో ఇమామత్ పదవీ స్వీకరణ చేశారు. వారి ఇమామత్ కాలం ఐదుగురు “అమవీ” అధికారుల మరియు ఇద్దరు “అబ్బాసీ” అధికారుల పాలనలో గడిచింది.
ఇమామ్ సాదిఖ్(అ.స) కాలంలో ఉన్న పరిస్థితులు మిగత ఇమాముల కాలం పరిస్థితులకు మాదిరి లేకపోవడంతో ఇమామ్ సాదిఖ్(అ.స)కు జ్ఞాన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభించింది.
వారి[అ.స] కాలంలో అమవీయుల మరియు అబ్బాసీయులకు మధ్య జరిగిన అధికార వివాదాల కారణంగా ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] కు మంచి అవకాశం లభించింది, ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఆ అవకాశాన్ని వొదులుకోలేదు వారి తండ్రి మొదలు పెట్టిన మార్గాన్నే ముందుకు కొనసాగించారు, విద్యార్ధులను తయారు చేశారు, దాంతో చాలా పెద్ద విద్యాలయం స్థాపించబడింది.
65 సంవత్సరాల వయసులో హిజ్రీ యొక్క 147వ ఏట విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి “బఖీ” స్మశానంలో ఉంది.[5]
వీళ్ళె కాకుండా ఇంకా చాలా ప్రముఖుల సమాధులు బఖీ స్మశానంలో ఉన్నాయి. అయినప్పటికీ వాహాబీయులు ఆ స్మశాన్ని నాశనం చేసి దైవప్రవక్త(స.అ)ను మరియు వారి సంతానాన్ని ఇష్టపడే మరియు గౌరవించేవారందరి హృదయాలను కష్ట బెట్టారు, వారిని దుఖఃలో ముంచారు.
జన్నతుల్ బఖీ స్మశానం త్వరలోనే పునర్నిర్మాణం జరగాలని అల్లాహ్ ను కోరి ప్రార్థిస్తున్నాము. ఆమీన్.

రిఫరెన్స్
1. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్, పేజీ 177-186.
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం.
3. షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ జైనుల్ ఆబెదీన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం.
4. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ261.
5. మహ్దీ పీష్వాయీ, సీమాయే పీష్వాయాన్, పేజీ101.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4