మనకు కష్టాలు మరియు ఆపదలు ఎదురొచ్చినప్పుడు ఏ దుఆలు చదవాలి? అన్న విషయం పై రివాయతుల నిదర్శనం..

మనకు కష్టాలు మరియు ఆపదలు ఎదురొచ్చినప్పుడు ఏ దుఆలు చదవాలి?
మానవులందరూ జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు మరియు కష్టాలకు ఎదుర్కోవలసి వస్తుంది అలాంటప్పుడు వాటిని దూరం చేసే మార్గాలను వెతుకుతూ ఉంటారు. దుఆ మరియు ప్రార్థన మానవుడి ఆత్మ అల్లాహ్ కు దగ్గరవ్వడానికి గల కారణాలలో అత్యంత ఉత్తమ కారణం. ఇస్లాం ధర్మంలో కష్టాలను దూరం చేసుకునేందుకు, రోగాల నుండి విముక్తి పొందేందుకు చాలా మార్గాలు చెప్పబడ్డాయి.
కష్టాలు మరియు ఆపదలు దూరం అవ్వడానికి నమాజ్ మరియు దుఆ:
1. ఇమామ్ సజ్జాద్(అ.స) ఉల్లేఖనం: దుఖాఃనికి మరియు కష్టాలకు గురి అయినప్పుడు, శుభ్రమైన దుస్తులు ధరించి, ఉజూ చేసుకొని ఎత్తైన ప్రదేశంలో నాలుగు రక్అతులు చదవండి:
మొదటి రెండు రక్అత్లు: మొదటి రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత జిల్జాల్ మరియు రెండవ రక్అత్ లో సూరయె అల్ హంద్ తరువాత ఇజాజాఅ నస్రుల్లాహ్ సూరహ్.
తరువాతి రెండు రక్అత్లు: మొదటి రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత కాఫిరూన్ సూరహ్ మరియు రెండవ రక్అత్ లో సూరయె అల్ హంద్ తరువాత ఖుల్ హువల్లాహు అహద్ సూరహ్, చదవాలి.
సలామ్ చదివి నమాజ్ పూర్తయిన తరువాత చేతులను ఆకాశం వైపుక ఎత్తి ఈ దుఆ ను చదవాలి:
“అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్లజీ ఇజా దుయీత బిహి అలా మగాలిఖి అబ్వాబిస్సమాయి లిల్ ఫత్హి బిర్రహ్మతిన్ ఫతహత్, వ ఇజా దుఈత బిహి అలా మజాయిఖి అబ్వాబిల్ అర్జి లిల్ ఫరజిన్ ఫరజత్, వ అస్అలుక బిఅస్మాయికల్లతీ ఇజా దుఈత బిహి అలల్ ఉస్రి లిల్ యుస్రి తయస్సరత్, వ ఇజా దుఈత బిహి అలల్ అమ్వాతి లిన్నుషూరిన్ తషరత్, సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్ వ అఖ్లిబ్నీ బి ఖజాయి హాజతీ”
ఇమామ్ సజ్జాద్(అ.స) ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఆ సమయంలో అతడింకా తన కాలు కదపక ముందే అల్లాహ్ అతడి విన్నపాన్ని తీరుస్తాడు.[1]
2. ఇమామ్ సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: ఫజ్ర్ నమాజ్ తరువాత యాసీన్ సూరహ్ ను, జొహ్ర్ నమాజ్ తరువాత ఫత్హ్ సూరహ్ ను, అస్ర్ నమాజ్ తరువాత నబా సూరహ్ ను, మగ్రిబ్ తరువాత ముల్క్ సూరహ్ ను మరియు ఇషాఁ నమాజ్ తరువాత వాఖిఅహ్ సూరహ్ ను చదవడం ద్వార ఎప్పటికి కష్టాలకు గురి కావు.
3. కష్టాలు ఎదురొచ్చినప్పుడు సజ్దాలో వెళ్లి(సాష్టాంగం చేసి) యూనుసియహ్ స్మరణను పఠించు: “వ జన్నూని ఇజ్ జహబ ముగాసియన్ ఫ జన్న అన్ లన్ నుఖద్దిర అలైహి ఫనాదా ఫిజ్జులుమాతి అన్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”[సూరయె అంబియా, ఆయత్87]
4. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: దుఖ్ఖాలు మరియు కష్టాలు దూరం అవ్వడానికి గుస్ల్ స్నానం చేసి రెండు రక్అత్ల నమాజ్ చదివి ఇలా పఠించు: “యా ఫారిజల్ హమ్మి, యా కాషిఫల్ గమ్మి, యా రహ్మానద్దునియా వల్ ఆఖిరతి వ రహీమహుమా, ఫల్లిజ్ హమ్మీ వక్షిఫ్ గమ్మీ, యా అల్లాహుల్ వాహిదుల్ అహదుస్సమద్, అల్లజీ లమ్ యలిద్ వ లమ్ యూలద్, వ లమ్ యకుల్ లహు కుఫువన్ అహద్, అఅసిమ్నీ వ తహ్హిర్నీ, వజ్ హిబ్ బెబలియతీ” ఆ తరువాత “ఆయతల్ కుర్సీ”, “ఖుల్ అఊజు బి రబ్బిల్ ఫలఖ్” మరియు “ఖుల్ అఊజు బి రబ్బిన్నాస్” సూరహ్ లను పఠించు (మరియు కష్టాలకు పరిష్కరించమని అల్లాహ్ ను వేడుకో)[2].
5. కష్టాల నుండి బయటపడడానిక ఇమామ్ జవాద్(స.అ) ఇలా సెలవిచ్చారు: “యా మన్ యక్ఫా మిన్ కుల్లి షైఇన్, వలా యక్ఫా మిన్హూ షైఉన్, ఇక్ఫీనీ మా అహమ్మనీ”[3]
6. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఎవరికైనా కష్టాలు, ఆపదలు మరియు విపత్తులు వచ్చినప్పుడు ఇలా చెప్పండి: “అల్లాహు రబ్బీ లా అష్రికు బిహి షైఅన్, తవక్కల్తు అలల్ హయ్యిల్లజీ లా యమూత్”[4]
7. రక్షణ మరియు కష్టాల నుండి విముక్తి కోసం ఫజ్ర్ నమాజ్ తరువాత చేయ్యిని గుండె పై ఉంచి 70 సార్లు “యా ఫత్తాహు” చదవాలి.
8. రివాయత్ లో ఇలా ఉంది; కష్టాల తీరడానికి సజ్దాలో వెళ్లి 100 సార్లు ఇలా చదవాలి: “యా హయ్యు యా ఖయ్యూమ్, యా లా ఇలాహ ఇల్లా అంత్, బి రహ్మతికస్తగీస్, ఫక్ఫినీ మా అహమ్మనీ, లా తకిల్నీ ఇలా నఫ్సీ”[5]
రిఫరెన్స్
1. అల్ సహీఫతుస్సజ్జాదియహ్, పేజీ119, దుఆ58.
2. కాఫీ, భాగం2, పేజీ557, హదీస్6.
3. బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ208, హదీస్39
4. బిహారుల్ అన్వార్, భాగం92, పేజీ208, హదీస్39.
5. కాఫీ, భాగం2, పేజీ562, హదీస్20.
వ్యాఖ్యానించండి